Site icon HashtagU Telugu

AB Venkateswara Rao: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఉపశమనం!

AB Venkateswara Rao

AB Venkateswara Rao

AB Venkateswara Rao: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రిటైర్డ్ ఐపీఎస్ అధికారి, మాజీ అడిషనల్ డైరెక్టర్-జనరల్ ఆఫ్ పోలీస్ (ఇంటెలిజెన్స్) ఏబీ వెంకటేశ్వర రావు (AB Venkateswara Rao)పై అన్ని తదుపరి కార్యకలాపాలను అధికారికంగా నిలిపివేసింది. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఒక ఎఫ్‌ఐఆర్, చార్జ్‌షీట్‌ను రద్దు చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

మంగళవారం జారీ చేసిన జీ.ఓ. ఆర్‌టీ నెం.1334లో చీఫ్ సెక్రటరీ కె. విజయానంద్.. వెంకటేశ్వర రావుపై అవినీతి నిరోధక బ్యూరో (ఏసీబీ) దాఖలు చేసిన కేసు, ఐపీసీ సెక్షన్లు 120-బి (క్రిమినల్ కుట్ర), 420 (మోసం), 409 (క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్)తో పాటు అవినీతి నిరోధక చట్టం నిబంధనల కింద దాఖలైన కేసు, హైకోర్టు తీర్పు దృష్ట్యా ఇకపై చెల్లుబాటు కాదని పేర్కొన్నారు.

Also Read: Seven Spiritual Cities : జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఏడు మోక్షదాయక క్షేత్రాలు.. పునర్జన్మ నుంచి విముక్తి మార్గం ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం!

విజయవాడలోని స్పెషల్ జడ్జ్ ఫర్ ఎస్‌పీఈ & ఏసీబీ కేసుల ముందు దాఖలైన ఎఫ్‌ఐఆర్, తదనంతర చార్జ్‌షీట్‌ను హైకోర్టు, వెంకటేశ్వర రావు దాఖలు చేసిన క్రిమినల్ పిటిషన్‌కు ప్రతిస్పందనగా రద్దు చేసింది. కేసును పరిశీలించిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను కొనసాగించకూడదని నిర్ణయించింది. అన్ని తదుపరి చట్టపరమైన, శాఖాపరమైన చర్యలను నిలిపివేయడానికి అధికారిక ఆదేశాలను జారీ చేసింది. డైరెక్టర్-జనరల్ ఆఫ్ పోలీస్ ఈ నిర్ణయాన్ని తదనుగుణంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.