TDP : ఏలూరు జిల్లాలో టీడీపీ కి భారీ ఊరట..

జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు

Published By: HashtagU Telugu Desk
TDP Complaint

Tdp

ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ఏలూరు జిల్లా(Eluru District)లో టీడీపీ పార్టీ(TDP)కి భారీ ఊరట లభించింది. టీడీపీ పార్టీ నుండి ఈ జిల్లాలో భారీ ఎత్తున ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ (Nomination of Independent Candidates) వేయగా..ఈరోజు నామినేషన్ల తిరస్కరణ కు లాస్ట్ డే సందర్బంగా ఇండిపెండెంట్ గా వేసిన చాలామంది అభ్యర్థులు తమ తమ నామినేషన్లను తిరస్కరించారు. జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 11 మంది అభ్యర్థులు వారి నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఏలూరులో ఒకరు, కైకలూరులో ముగ్గురు, పోలవరంలో ఒకరు , నూజివీడులో ఇద్దరు, చింతలపూడిలో ఒకరు, ఉంగుటూరులో ముగ్గురు తమ నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దెందులూరు లో ఎవరు నామినేషన్లు వెనక్కి తీసుకోలేదు. పోలవరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇండిపెండెంట్ అభ్యర్థి కారం మల్లేశ్వరరావు నామినేషన్ ను ఉపసంహరించుకున్నారు. ఇక చింతలపూడి నుండి ఇండిపెండెంట్ అభ్యర్థి వెంపా దుర్గారావు నూజివీడు లో ఇండిపెండెంట్ అభ్యర్థులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావు, ముద్దరబోయిన రాధిక తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. ముద్దరబోయిన వెంకటేశ్వరరావు టీడీపీ రెబల్ గా బరిలో దిగి చివరి నిముషంలో వైదొలిగారు. వీరే కాక ఇండిపెండెంట్ గా వేసిన చాలామంది వారి నామినేషన్లను తిరస్కరించారు. ఈసారి కూటమి పొత్తులో భాగంగా కొన్ని టీడీపీ స్థానాలను జనసేన, బిజెపి లకు ఇవ్వడం తో ఆ ఆయా స్థానాల్లో ఇండిపెండెంట్ గా నామినేషన్ వేశారు. కానీ చివరకు అంత విత్ డ్రా చేసుకోవడం తో పార్టీకి భారీ ఊరట లభించినట్లు అయ్యింది.

Read Also : AP Politics : టీడీపీ నయా ప్లాన్‌.. ఇక వై నాట్‌ వైసీపీ కాదు.. వై వైసీపీనే..!

  Last Updated: 29 Apr 2024, 09:05 PM IST