Movie Tickets Issue: ఏపీలో భారీ బ‌డ్జెట్ చిత్రాల‌కు క‌ష్టాలే…?

ఏపీ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌లు నిర్ణ‌యంపై సినీ ఇండ‌స్ట్రీలో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు, ప్రోడ్యూస‌ర్ లు దీనిని వ్య‌తిరేకించారు. తాజ‌గా మ‌రో యువ హీరో సిధార్థ్ కూడా ఈ నిర్ణ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు.

  • Written By:
  • Updated On - December 5, 2021 / 07:40 PM IST

ఏపీ ప్ర‌భుత్వం టికెట్ ధ‌ర‌లు నిర్ణ‌యంపై సినీ ఇండ‌స్ట్రీలో అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతుంది. ఇప్ప‌టికే ప‌లువురు స్టార్ హీరోలు, డైరెక్ట‌ర్లు, ప్రోడ్యూస‌ర్ లు దీనిని వ్య‌తిరేకించారు. తాజ‌గా మ‌రో యువ హీరో సిధార్థ్ కూడా ఈ నిర్ణ‌యంపై అసంతృప్తి వ్య‌క్తం చేశారు. ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధే శ్యామ్‌’చిత్రాలు సంక్రాంతి సీజన్‌కి విడుదల కానున్నాయి.ఏపీలో 800కి పైగా సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లు ఉన్నాయి. అయితే ఏపీ ప్రభుత్వం వివిధ సెంటర్లలో ఫిక్స్ చేసిన టికెట్ రేట్లను అమలు చేయడంతో పాటు షోల సంఖ్యను కుదించాల‌ని నిర్ణ‌యం తీసుకుంది. దీన్ని అమలు చేసేందుకు ఏపీ శాసనసభలో బిల్లు కూడా ఆమోదం పొందింది.

గ్రామాల్లోని నాన్-ఏసీ థియేటర్‌లో టిక్కెట్ ధర ఆంధ్రప్రదేశ్‌లో రూ.5, రూ.10, రూ.15గా ఉండగా… ఏసీ థియేటర్ల ధరలు రూ.10, రూ.15, రూ.20గా ఉన్నాయి. గ్రామాల్లోని మల్టీప్లెక్స్‌లకు, ధరలు రూ. 30, 50 మరియు రూ. 80గా ఉన్నాయి. మున్సిపాలిటీ ప్రాంతాల్లో నాన్-ఏసీ థియేటర్ల ధరలు రూ.15, 30, రూ.50గా నిర్ణయించగా.. మల్టీప్లెక్స్‌లకు రూ.60, రూ.100, రూ.150. మున్సిపల్ కార్పొరేషన్ నగరాల్లో ధరల శ్రేణి రూ.75, రూ.150, రూ. 250లుగా ఉన్నాయి. తెలుగు సినీ నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ప్రభుత్వ చర్య వల్ల తాము అనేక విధాలుగా నష్టపోతున్నామని పేర్కొన్నారు. క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టికే భారీగా న‌ష్ట‌పోయామ‌ని నిర్మాత‌లు అంటున్నారు.

పన్నులు సక్రమంగా వసూలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టిక్కెట్ ధరలను తగ్గించింది. గతంలో సినిమా నిర్మాతలు విడుదలకు ముందు బెనిఫిట్ షోలను నిర్వ‌హించేవారు.దీంతో వీరికి ఆదాయం ఎక్కువ‌గా వ‌స్తుంది . తాజాగా ఏపీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యంతో నిర్మాత‌ల‌కు ఎదురుదెబ్బ త‌గులుంది.బెనిఫిట్ షోలు లేక‌పోవ‌డం,టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం ద్వారా వీరి ఆదాయానికి గండి ప‌డుతుంది. చిత్ర‌ప‌రిశ్ర‌మ‌లో మారుతున్న ట్రెండ్స్ కారణంగా గత కొన్నేళ్లుగా నిర్మాణ వ్యయం పెరిగింది. నటీనటుల పారితోషికం, వీఎఫ్‌ఎక్స్ , సాంకేతిక ఖర్చులతో ఇత‌ర ఖ‌ర్చులు పెరిగిపోయాయి. ఎక్కువ బ‌డ్జెట్ పెట్టి సినిమాలు తీసి ప‌రిమిత షోలు వేయ‌డం, టికెట్ ధ‌ర‌లు త‌గ్గించ‌డం వ‌ల్ల తీవ్రంగా న‌ష్ట‌పోతామ‌ని నిర్మాత‌లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.