స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్‌లో ఉన్న చంద్రబాబును ఈ రోజు సాయంత్రం కుటుంబసభ్యులు ములాఖత్ కానున్నారు. సాయంత్రం 4 గంటలకు నారా భువనేశ్వరి, బ్రాహ్మణితో పాటు అచ్చెన్నాయుడు కూడా చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. రాష్ట్రంలో జరగుతున్న పరిస్థితులు, పార్టీ కార్యక్రమాలపై చంద్రబాబుకు అచ్చెన్నాయుడు వివరించనున్నారు. రేపు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణకు రానుంది.దీనిపై కూడా అచ్చెన్నాయుడు చర్చించనున్నారు. ఇటు కుటుంబసభ్యులతో ఆయన మాట్లాడనున్నారు. పార్టీ కార్యక్రమాలు, జనసేన టీడీపీ పొత్తు అంశాలను చంద్రబాబు అచ్చెన్నాయుడుతో చర్చించే అవకాశం ఉంది.
వారంలో రెండు రోజులు మాత్రమే ములాఖత్ కు అవకాశం ఉండటంతో కుటుంబ సభ్యులతో పాటు ముఖ్యనేతలు మాత్రమే వెళ్తున్నారు. మొన్నటి ములాఖత్‌లో టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు వెళ్లారు. యనమలతో చంద్రబాబు ఏకాంతంగా భేటి అయ్యారు. పార్టీ కార్యక్రమాలు, భవిష్యత్ కార్యచరణ, జనసేన పొత్తు అంశాలను చంద్రబాబుతో యనమల చర్చించారు. ఇటు లోకేష్ కూడా ఢీల్లి నుంచి వచ్చిన తరువాత చంద్రబాబుతో ములాఖత్ కానున్నారు. మరోవైపు నారా భువనేశ్వరి, బ్రహ్మణిలు చంద్రబాబు రిమాండ్‌కి వెళ్లిన రోజు నుంచి రాజమండ్రిలోనే బస చేస్తున్నారు. వివిధ వర్గాల వారిని బ్రహ్మణి, భువనేశ్వరిలు కలుస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో రాజమండ్రికి తరలివచ్చి తమ సంఘీభావం తెలుపుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో దీక్ష శిభిరాలను భువనేశ్వరి సందర్శించి వారికి సంఘీభావం తెలుపుతున్నారు.