Site icon HashtagU Telugu

Bhuvaneswari : చంద్ర‌బాబు త‌ర‌ఫున నామినేష‌న్‌ వేసిన భువ‌నేశ్వ‌రి

Telugu Bhuvaneshwari nominated on behalf of Chandrababu

Telugu Bhuvaneshwari nominated on behalf of Chandrababu

Nara Bhuvaneswari: టీడీపీ అధినేత‌, మాజీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు(Chandrababu Naidu) త‌ర‌ఫున కుప్పం(kuppam)లో ఆయ‌న భార్య భువ‌నేశ్వ‌రి నామినేష‌న్ దాఖ‌లు(Nomination papers)
చేశారు. కుప్పంలో రిట‌ర్నింగ్ అధికారి (ఆర్ఓ) కి నామినేష‌న్ ప‌త్రాల‌ను ఆమె అంద‌జేశారు. అంత‌కుముందు ఆమె టీడీపీ, జ‌న‌సేన‌, బీజేపీ శ్రేణుల‌తో క‌లిసి భారీ ర్యాలీగా ఆర్ఓ కార్యాల‌యానికి చేరుకున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

నామినేషన్‌కు ముందు ఈరోజు ఉదయం 10.45 గంటలకు ఆమె వరదరాజస్వామి ఆలయంలో నామినేషన్‌ పత్రాలను ఉంచి పూజలు చేస్తారు. ఆలయ అర్చకులు ఆమెకు ఆశీర్వచనాలు, తీర్థ ప్రసాదాలు ఇచ్చి దీవించారు. తర్వాత ఆమె లక్ష్మీపురంలో ఉన్న మసీదు ఆవరణలో కూడా ప్రార్థనలు చేశారు. ఆ తర్వాత బాబూనగర్ లో ఉన్న చర్చిలో ప్రార్థనలు చేశారు. చంద్రబాబు నామినేషన్ తతంగానికి పెద్ద ఎత్తున అనుచరులు తరలి వచ్చారు.

Read Also: Lok Sabha Polls 2024: మధ్యాహ్నం సమయానికి 50.96 శాతం ఓటింగ్

అనంతరం కుప్పం చెరువుకట్ట నుంచి ర్యాలీగా వెళ్లి మధ్యాహ్నం 1.27గంటలకు నామినేషన్‌ పత్రాలను సమర్పించారు. కాగా, కుప్పం టీడీపీ శ్రేణులతో చంద్రబాబు గురువారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. తన తరఫున భువనేశ్వరి శుక్రవారం నామినేషన్‌ వేయనున్న నేపథ్యంలో ప్రతి ఇంటికీ వెళ్లి ప్రజలను కలిసి తన మాటగా పిలవాలని ఆయన కోరారు.