Site icon HashtagU Telugu

Bhuvaneshwari: భువనేశ్వరి భావోద్వేగం, లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కన్నీళ్లుపెట్టా!

Bhuvaneshwari

Bhuvaneshwari

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. తన తండ్రి నారా చంద్రబాబు నాయుడు, తల్లి నారా భువనేశ్వరి ఆశీస్సులతో లోకేష్ పాదయాత్ర ప్రారంభించారు. ఆ సమయంలో నారా భువనేశ్వరి, లోకేష్ పాదయాత్ర విజయవంతం కావాలని ఆశీర్వదించి పంపారు. ఆ తర్వాత భువనేశ్వరి కూడా ఒకరోజు లోకేష్ పాదయాత్రలో పాల్గొన్నారు. అయితే ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడలేదు. కానీ, ఇటీవల కుప్పంలో పర్యటించిన సందర్భంగా మీడియాతో మాట్లాడిన భువనేశ్వరి.. లోకేష్ పాదయాత్రపై స్పందించారు.

ఈ సందర్భంగా భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. లోకేష్ పాదయాత్ర చేయాలని నిర్ణయించుకున్నప్పుడు తీవ్ర మనోవేదనకు, ఆందోళనకు గురయ్యానని భువనేశ్వరి అన్నారు. తన కొడుకు లోకేష్ పాదయాత్ర చేస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయానని ఆమె వెల్లడించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత తమ కుటుంబాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాష్ట్రం కోసం, ప్రజల కోసం ఎన్ని కష్టాలు వచ్చినా తమ కుటుంబం ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతుందని భువనేశ్వరి భావోద్వేగానికి గురయ్యారు. తన తండ్రి ఎన్టీఆర్ పేరు మీద రూ.100 స్మారక నాణెం విడుదల చేయడం సంతోషంగా ఉందన్నారు. నాణెం విడుదలకు కృషి చేసిన తన అక్క పురందేశ్వరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ సంజీవిని ఉచిత ఆసుపత్రిని ప్రారంభించిన భువనేశ్వరి కుప్పంలో పర్యటిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read: MLC Kavitha: నిజామాబాద్ యువత ఉపాధి కల్పన కోసం కట్టుబడి ఉన్నాం – కవిత

Exit mobile version