Site icon HashtagU Telugu

Bhuvaneshwari and Brahmani: ఎన్నిక‌ల బ‌రిలోకి భువ‌నేశ్వ‌రి, బ్రాహ్మ‌ణి? గుడివాడ‌, గ‌న్న‌వ‌రం ఈక్వేష‌న్ల‌లో మ‌లుపు..!

Bhuvaneshwari and Brahmani

Resizeimagesize (1280 X 720) 11zon

వ‌చ్చే ఎన్నిక‌ల్లో (Elections) అధికారంలోకి రావడానికి స‌ర్వ‌శ‌క్తుల‌ను చంద్ర‌బాబు ఒడ్డుతున్నారు. ముంద‌స్తు ఎన్నిక‌లు రావ‌డానికి అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అందుకే, అభ్యర్థుల‌ను ప్ర‌క‌టిస్తూ ముందుకెళుతున్నారు. అయితే, కొన్ని చోట్ల మాత్రం అభ్య‌ర్థుల‌ను అన్వేషించ‌డానికి చంద్ర‌బాబు క‌స‌ర‌త్తు చేస్తున్నారు. ఆ క్ర‌మంలో కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం, గుడివాడ నియోజ‌క‌వ‌ర్గాలు ఆయ‌న‌కు స‌వాల్ గా మారాయి. స్వ‌ప‌క్షంలోనే విప‌క్షంగా మారిన వ‌ల్ల‌భ‌నేని వంశీని రాజకీయ తెర‌మీద లేకుండా చేసేలా స్కెచ్ వేస్తున్నారు. అలాగే, మాజీ మంత్రి కొడాలి వెంక‌టేశ్వ‌ర‌రావు అలియాస్ నాని ఓట‌మి కోసం భారీ స్కెచ్ వేస్తున్నారు చంద్ర‌బాబు.

తొలి నుంచి గుడివాడ అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గం నంద‌మూరి కుటుంబానికి ఉండేది. అక్క‌డ నుంచే స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి, సీఎం అయ్యారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గంగా గుడివాడ మారిపోయింది. త‌ద‌నంత‌రం నంద‌మూరి కుటుంబ స‌భ్యులు అక్క‌డ నుంచి పోటీ చేస్తూ వ‌చ్చారు. స్వ‌ర్గీయ హ‌రికృష్ణ ప్ర‌మేయంతో తొలిసారిగా 2004 ఎన్నిక‌ల్లో గుడివాడ నుంచి కొడాలి నానికి టీడీపీ టిక్కెట్ ద‌క్కింది. ఆ త‌రువాత 2009 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కు ఇచ్చారు. రెండుసార్లు వ‌రుస‌గా కొడాలి అక్క‌డ నుంచి గెలిచారు. ఆ నియోజ‌క‌వ‌ర్గం టీడీపీకి కంచ‌కోట‌గా ఉండేది. ఆ త‌రువాత కొడాలి 2014 ఎన్నిక‌ల నాటికి వైసీపీ పార్టీ త‌ర‌పున పోటీ చేసి గెలుపొందారు. ఆ త‌రువాత 2019 ఎన్నిక‌ల్లోనూ వైసీపీ నుంచి గెలుపొంది, మంత్రి అయ్యారు. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ టీడీపీ పార్టీ గుడివాడ‌లో గెల‌వ‌లేక‌పోయింది.

కంచుకోట‌గా ఉన్న గుడివాడ నియోజ‌క‌వ‌ర్గాన్ని ఈసారి ఎలాగైనా కైవ‌సం చేసుకోవాల‌ని టీడీపీ భావిస్తోంది. ఆ దిశ‌గా చంద్ర‌బాబునాయుడు సీరియ‌స్ గా పావులు క‌దుపుతున్నారు. అందుకే, నంద‌మూరి కుటుంబం నుంచి అభ్య‌ర్థిని నిల‌బెట్టాల‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఇంచార్జిగా ఉన్న రావి వెంక‌టేశ్వ‌ర‌రావు కు టిక్కెట్ ఇవ్వాల‌ని క్యాడ‌ర్ కోరుతోంది. అయితే, ఆయ‌న బ‌లం చాల‌ద‌ని రోజుకో పేరు అక్క‌డ నుంచి తెర‌మీద‌కు వ‌స్తోంది. ఇటీవ‌ల వెనిగండ్ల రాము పేరు వినిపించింది. ఆయ‌న ఎన్నారై కావ‌డంతో స‌ర్వేల్లో బాగా వెనుక ఉన్నార‌ని తెలుస్తోంది. అందుకే, మ‌ధ్యేమార్గంగా నంద‌మూరి కుటుంబం నుంచి గుడివాడ‌లో నిల‌బెట్టాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

Also Read: జగన్ కాపుల కళ్లు పొడిచారు.. వైసీపీ పాలనలో కాపులకు అన్యాయం – టీడీపీ ఎమ్మెల్యే అన‌గాని

అసెంబ్లీ వేదిక‌గా చంద్ర‌బాబు స‌తీమ‌ణి భువ‌నేశ్వ‌రి శీలాన్ని శంకించిన వాళ్ల‌కు ప‌రోక్షంగా కొడాలి, వ‌ల్ల‌భ‌నేని అండ‌గా ఉన్నార‌ని టీడీపీ భావ‌న‌. అందుకే, వాళ్ల‌ను ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న నంద‌మూరి, నారా అభిమానులు టార్గెట్ చేశారు. ముళ్లును ముళ్లుతోనే తీయాల‌నే నానుడికి అనుగుణంగా భువ‌నేశ్వ‌రిని గుడివాడ నుంచి ఎన్నిక‌ల బ‌రిలోకి దించాల‌ని టీడీపీలోని ఒక వ‌ర్గం అభిప్రాయంగా ఉంది. గ‌త రెండు రోజులుగా విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా బ్రాహ్మణి ఉంటార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక వేళ అదే నిజ‌మైతే, భువ‌నేశ్వ‌రి ఎన్నిక‌ల బ‌రిలోకి రాక‌పోవ‌చ్చు. బ్రాహ్మ‌ణి క‌నుక ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటే మాత్రం భువ‌నేశ్వ‌రి గుడివాడ నుంచి పోటీకి దిగుతార‌ని తెలుస్తోంది.

గ‌న్న‌వ‌రం విష‌యంలో ఇంకా ఒక కొలిక్కారాలేక‌పోతున్న టీడీపీ బ‌ల‌మైన అభ్య‌ర్థి కోసం అన్వేషిస్తోంది. ప్ర‌స్తుతం బ‌చ్చుల అర్జునుడు టీడీపీ ఇంచార్జిగా ఉన్నారు. కానీ, చివ‌రి నిమిషంలో అక్క‌డ నుంచి అభ్య‌ర్థి మారే అవ‌కాశం ఉంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది. విజ‌య‌వాడ ఎంపీ అభ్య‌ర్థిగా కేశినేని చిన్ని( ఎంపీ నాని బ్ర‌ద‌ర్) ఉంటే మాత్రం బ‌చ్చుల అర్జునుడు గ‌న్న‌వ‌రం నుంచి పోటీకి దిగే ఛాన్స్ ఉంది. ఒక వేళ బ్రాహ్మ‌ణి విజ‌య‌వాడ ఎంపీ రేస్ లో ఉంటే, కేశినేని చిన్ని గ‌న్న‌వ‌రం నుంచి బ‌రిలోకి దిగుతార‌ని టాక్‌. మొత్తం మీద బ్రాహ్మ‌ణి, భువ‌నేశ్వ‌రి చుట్టూ కృష్ణా జిల్లాలోని గ‌న్న‌వ‌రం, గుడివాడ రాజ‌కీయం తిరుగుతోంది.