Site icon HashtagU Telugu

Tirumala Laddu Controversy : చంద్రబాబును శ్రీవారే సర్వనాశనం చేస్తాడు – భూమన

Cbn Tirumala Laddu

Cbn Tirumala Laddu

తిరుమల లడ్డు (Tirumala Laddu) ప్రసాదంలో నెయ్యి (Pure Ghee)కి బదులు జంతువుల కొవ్వు (Animal Fat ) వాడారని చంద్రబాబు (Chandrababu) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. దీనిపై నిన్నటి నుండి భక్తులు వైసీపీ పార్టీ పై జగన్ పై నిప్పులు చెరుగుతున్నారు. అయితే వైసీపీ నేతలు మాత్రం అలాంటిదేమి జరగలేదని అంటున్నారు. ఇప్పటికే TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అంబటి రాంబాబు తదితరులు చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఖండించగా..తాజాగా TTD మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఘటిగా రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు తిరుమలను రాజకీయ పావుగా వాడుకుంటున్నారని కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. ‘తిరుమల లడ్డూలో జంతువుల నూనె ఉపయోగిస్తే అది కలిపిన వారిని శ్రీవారు సర్వనాశనం చేస్తారు. అది కలపలేదని తేలితే చంద్రబాబు కుటుంబాన్ని సర్వనాశనం చేస్తాడు అని కీలక వ్యాఖ్యలు చేసారు. TTD విజిలెన్స్ కమిటీలో ఓ ముస్లిం వ్యక్తిని విచారణ అధికారిగా నియమించారు. హిందూయేతర వ్యక్తిని ఎలా నియమిస్తారు?’ అని ఆయన ఫైర్ అయ్యారు.

అంతకు ముందు TTD మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy) స్పందించారు. తిరుమల ప్రసాదంపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. ‘కోట్ల మంది హిందువుల విశ్వాసాలను దెబ్బతీసి చంద్రబాబు పెద్ద పాపమే చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎంతటి నీచానికైనా ఆయన వెనకాడరని మరోసారి నిరూపితమైంది. ఈ విషయంలో ఆ దేవదేవుని సాక్షిగా కుటుంబంతో కలిసి ప్రమాణం చేయడానికి నేను సిద్ధం. చంద్రబాబు సిద్ధమా?’ అని సవాల్ విసిరారు. ‘చంద్రబాబు, లోకేశ్, వారి కుటుంబం ..ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నారా? మేం సవాల్ చేస్తున్నాం’ అని వైసీపీ (YCP) సైతం ట్వీట్ చేసింది.

అలాగే మాజీ మంత్రి అంబటి రాంబాబు (Ambati Rambabu) సైతం దీనిపై రియాక్ట్ అయ్యారు. తిరుమల లడ్డూ ప్రసాదంపై సీఎం చంద్రబాబు దుర్మార్గపు ఆరోపణ చేయడం సరికాదని రాంబాబు మండిపడ్డారు. దమ్ముంటే సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ‘రాజకీయ లబ్ధి కోసం మరీ ఇంత నీచానికి దిగజారుతావా చంద్రబాబు’ అని ట్వీట్ చేసారు. మరి వైసీపీ నేతల కామెంట్స్ పై చంద్రబాబు ఏ సమాధానం చెపుతారో చూడాలి.

Read Also : Delhi: అతిషితో పాటు మరి కొందరు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం?