TTD Chairman Oath: రేపే ప్రమాణస్వీకారం.. సీఎంని కలిసిన భూమన

తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. రేపు గురువారం ఉదయం భూమన టీటీడీ చైర్మన్‌‌గా బాధ్యతలు చేపట్టనున్నారు

Published By: HashtagU Telugu Desk
TTD Chairman

New Web Story Copy 2023 08 09t133638.023

TTD Chairman Oath: తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్‌గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి నియమితులయ్యారు. రేపు గురువారం ఉదయం భూమన టీటీడీ చైర్మన్‌‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. అంతకుముందు ఈ రోజు బుధవారం ఆయన సీఎం జగన్ ని కలిశారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ ని కలిసిన ఆయన టీటీడీ చైర్మన్‌గా తనకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

వైసీపీ అధికారం చేపట్టిన నాటి నుండి టీటీడీ ఛైర్మన్‌గా వైవీ సుబ్బారెడ్డి పదవిలో కొనసాగుతున్నారు. 2019లో సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్ బాధ్యతలు చేపట్టారు. నిజానికి రెండు సంవత్సరాల క్రితమే సుబ్బారెడ్డి పదవీ కాలం ముగిసింది. కానీ ఏపీ ప్రభుత్వం వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలాన్ని మరో రెండేళ్లు పొడిగించింది. ఈ నెల 12తో ఆయన పదవి కాలం ముగియనుండటంతో రేపటి నుండి టిటిడి చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించనున్నారు.

Also Read: Telangana Police: మొబైల్ ఫోన్ల రికవరీలో తెలంగాణ టాప్, సిటీ పోలీసులకు డీజీపీ అభినందనలు

  Last Updated: 09 Aug 2023, 01:39 PM IST