Bhumana Karunakar Reddy: ఉత్కంఠకు తెర.. టీటీడీ చైర్మన్ గా భూమన కరుణాకర్ రెడ్డి!

టీటీడీ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది.

  • Written By:
  • Updated On - August 5, 2023 / 04:26 PM IST

టిటిడి ట్రస్ట్ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి రెండవ టర్మ్ ఆగస్టు 12తో ముగియనుండడంతో కొత్త టీటీడీ ట్రస్ట్ బోర్డు చైర్మన్‌ను నియమించేందుకు ముఖ్యమంత్రి సీఎం జగన్ తీవ్ర కసరత్తు చేశారు. అయితే టీటీడీ చైర్మన్ రేసులో చాలామంది పేర్లు వినిపించినప్పటికీ దేవస్థానం ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ గా తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. గతంలో కూడా ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేశారు. 2006-2008 సమయంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు.

ఇప్పుడు జగన్ హయాంలో మరోసారి ఆయనకు ఆ అవకాశం లభించింది. ఇప్పటి వరకూ టీటీడీ చైర్మన్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఇకపై పూర్తిగా పార్టీ వ్యవహారాల్లో నిమగ్నం అవుతారని తెలుస్తోంది. ప్రస్తుతం ఉత్తరాంధ్ర ఇన్ చార్జ్ గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి ఇకపై ఢిల్లీలో పార్టీ వ్యవహారాలు కూడా చూస్తారని అంటున్నారు.

అయితే జగన్‌కు టీటీడీ చైర్మన్ పదవి కోసం పలువురు నేతల నుంచి అభ్యర్థనలు వచ్చినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నికల తర్వాత టీడీపీ నుంచి వైఎస్సార్‌సీపీలోకి ఫిరాయించిన మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు బరిలో నిలిచారు. ఇప్పటి వరకు టీటీడీ చైర్మన్‌గా వైశ్య వర్గానికి చెందిన ఎవరికీ అవకాశం రాలేదన్నారు. కానీ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డి ని నియమించడంతో ఎదురుచూపులకు బ్రేక్ పడింది.

Also Read: Kokapet Lands : క్లిన్ కార పేరు బలం..అప్పుడే చిరంజీవి ఫ్యామిలీకి 2000 కోట్ల లాభం