ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచుగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే జిల్లాల్లో నంద్యాల ఒకటి. భూమా కుటుంబం చుట్టూ తిరుగుతున్న రాజకీయాలు వేడెక్కుతున్నాయి. తాజాగా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియను (Bhuma Akhila Priya) పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో ఆమె ఇంటి నుంచి బయటకు రాలేకపోయింది. దీంతో ఆళ్లగడ్డలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. నంద్యాల అభివృద్ధిపై తాను చర్చకు సిద్ధమని అఖిలప్రియ ప్రకటించారు. దీనికి శిల్పా రవిచంద్రారెడ్డి కూడా కౌంటర్ ఇచ్చారు. నంద్యాల అభివృద్ధిపై చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు బయటకు వచ్చే అవకాశముందని భావించిన పోలీసులు అఖిలప్రియను హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసులు ఆమె PAకి నోటీసులు అందజేశారు.
Also Read: Road Accident: దుండిగల్‌లో బోల్తాపడిన డీసీఎం.. ఇద్దరు మృతి
పోలీసులు ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణాలున్నాయి. తనతో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికి అఖిలప్రియ సవాల్ విసిరారు. కాబట్టి.. ప్రస్తుతం ఆళ్లగడ్డలో 30 యాక్ట్ అమల్లో ఉంది. ఇలాంటి సమయంలో ఈ సవాళ్లు, బహిరంగ చర్చలు కుదరవని పోలీసులు తెలిపారు. అందుకు అఖిలప్రియ అంగీకరించకపోవడంతో.. ఆమెను గృహనిర్బంధంలో ఉంచినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీసుల తీరుపై అఖిలప్రియ మద్దతుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అఖిల ప్రియ ఇంటి దగ్గర పోలీసులు భారీగా మోహరించడంతో ఏం జరుగుతుందోనన్న టెన్షన్ నెలకొంది.