Site icon HashtagU Telugu

Bhuma Akhila Priya : టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అరెస్ట్

Bhuma Arrest

Bhuma Arrest

టీడీపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ (Bhuma Akhila Priya)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం జగన్ (AP CM Jagan) ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టారు..ఈ క్రమంలో ఈరోజు జగన్ నంద్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాలలో వైసీపీ బహిరంగా సభ ఏర్పాటు చేసింది. ఈ క్రమంలో వైసీపీ సభ దగ్గరకు వెళ్లిన అఖిల ప్రియ సాగునీటి విడుదల కోసం సీఎం జగన్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రయత్నించారు. ఆమెతో పాటు టీడీపీ శ్రేణులు సైతం భారీగా తరలివెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు అఖిలప్రియను, టీడీపీ శ్రేణులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

We’re now on WhatsApp. Click to Join.

అఖిల్ అరెస్ట్ తో అక్కడ కాసేపు ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించారు. వినతిపత్రం ఇచ్చేందుకు వస్తే అరెస్ట్ చేయడమేంటని టిడిపి శ్రేణులు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా అఖిలప్రియ మాట్లాడుతూ.. అపాయిట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తే సీఎంవో స్పందించలేదని తెలిపారు. అందుకే నేరుగా సీఎంను కలిసి వినతి పత్రం ఇద్దామని వచ్చానన్నారు. వినతిపత్రం ఇస్తే శాంతిభద్రతల సమస్య ఎలా అవుతోందని ప్రశ్నించారు.

Read Also : Viveka Murder : ఐదేళ్ల తర్వాత చిన్నాన్న గుర్తొచ్చారా జగన్ ..? – వివేకా కుమార్తె