విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మాణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు ఎయిర్‌పోర్ట్ ఆంధ్రప్రదేశ్‌లో అత్యాధునిక సదుపాయాలతో రూపుదిద్దుకుంటోంది. ఈ ప్రాజెక్టు రాష్ట్ర అభివృద్ధికి కొత్త దిశ చూపనుంది. దేశంలోనే పొడవైన 3.8 కి.మీ. రన్‌వేతో ఇది ప్రత్యేకత సంతరించుకోనుంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఈ విమానాశ్రయాన్ని నిర్మిస్తున్నారు. ప్రయాణీకుల భద్రత, సౌకర్యాలను దృష్టిలో ఉంచుకుని టెర్మినల్ భవనం, కంట్రోల్ టవర్, నావిగేషన్ వ్యవస్థలు, పార్కింగ్ సదుపాయాలు వేగంగా పూర్తి అవుతున్నాయి.
Diwali: దీపావళి తర్వాత మిగిలిపోయిన దీపాలను ఏం చేయాలి?
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్ నిర్మాణ పనులు 85 శాతానికి పైగా పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. పునాది పనుల నుంచి టెర్మినల్ భవనం వరకు అన్ని విభాగాల్లో సమాంతరంగా పనులు కొనసాగుతున్నాయి. ప్రధాన రన్‌వే, టాక్సీ ట్రాక్‌లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ సిస్టమ్, ఫైరింగ్ సేఫ్టీ యూనిట్‌లు దాదాపు పూర్తి దశలో ఉన్నాయి. రాబోయే కొన్ని నెలల్లో చివరి దశ పనులు, లైటింగ్ సిస్టమ్‌లు, ఇంటీరియర్ సదుపాయాలు అమలు చేయబడతాయని ప్రాజెక్ట్ ఇంజనీర్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత ఉత్తర ఆంధ్రప్రదేశ్ రవాణా రంగంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకుంటాయని నిపుణులు అంటున్నారు.
2026 ఆగస్టు నాటికి ఈ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించేలా చర్యలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే జూన్ నెలలో ట్రయల్ రన్ విజయవంతంగా నిర్వహించారు. దీని ద్వారా విమాన సర్వీసులు సాఫీగా నడిచే అవకాశాలు స్పష్టమయ్యాయి. ఎయిర్‌పోర్ట్ ప్రారంభమైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి పరిశ్రమలు, పర్యాటకం, రవాణా రంగాల్లో ఊపిరి పీల్చినట్టవుతుంది. అల్లూరి సీతారామరాజు పేరుతో నిర్మిస్తున్న ఈ ఎయిర్‌పోర్ట్ ప్రాంతీయ గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ఈ ప్రాజెక్టు ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.