Bhogapuram Airport : వై`భోగం`పురం! నాడు బాబు నేడు జ‌గ‌న్!!

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్రారంభించిన వాటిని మ‌ళ్లీ ప్రారంభించ‌డం, శంకుస్థాప‌న చేసిన వాటికి మ‌ళ్లీ శంకుస్థాప‌న చేయ‌డం అల‌వాటుగా మారింది.

  • Written By:
  • Updated On - May 4, 2023 / 12:17 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి ప్రారంభించిన వాటిని మ‌ళ్లీ ప్రారంభించ‌డం, శంకుస్థాప‌న చేసిన వాటికి మ‌ళ్లీ శంకుస్థాప‌న చేయ‌డం అల‌వాటుగా మారింది. ఆ జాబితాలో ఇప్పుడు భోగాపురం ఎయిర్ పోర్ట్ (Bhogapuram Airport) చేరింది. ఇదే ఎయిర్ పోర్ట్ కు 2019 ఫిబ్ర‌వ‌రి 15న చంద్ర‌బాబు(Chandrababu) శంక‌స్థాప‌న చేశారు. అదే రోజు ఆదానీ డేటా సెంట‌ర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ హ‌బ్ త‌దిత‌రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. కానీ, మ‌ళ్లీ ఇప్పుడు వాటికే భూమి పూజ చేయ‌డం గ‌మ‌నార్హం.

భోగాపురం ఎయిర్ పోర్ట్ భూమి పూజ (Bhogapuram Airport)

ఎయిర్ పోర్ట్ కు  (Bhogapuram Airport) భూములు ఇచ్చిన వాళ్ల‌కు ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిహారం ఇవ్వ‌లేదు. వాళ్లంద‌రూ నిర‌స‌న‌లు వ్య‌క్తం చేయ‌కుండా గ్రామాల‌ను ఖాళీ చేయించారు. ప‌ర‌దాల మాటున అక్క‌డ‌కు వెళ్లి భూమి పూజ చేయ‌డం ప‌లు విమర్శ‌ల‌కు దారితీస్తోంది. ఈ ఎయిర్ పోర్ట్ ను రూ.4592 కోట్లతో నిర్మించనున్నారు. కేవ‌లం 36 నెల‌ల్లోనే నిర్మించాల‌ని లక్ష్యంగా పెట్టుకుంది. నిర్మాణ బాధ్యతలను జీఎంఆర్ సంస్థకు అప్పగించారు.

నాలుగేళ్ల కింద‌ట ఇదే ఎయిర్ పోర్ట్ కు భూమిపూజ, విశాఖ కాపులుప్పాడలో రూ 70వేల కోట్లతో లక్ష మందికి ఉపాధి లక్ష్యంతో అదానీ డేటా సెంటర్ టెక్ పార్క్ కు చంద్ర‌బాబు(Chandrababu) శంకుస్థాపన చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు, విజయనగరం జిల్లాలో పతంజలి ఫుడ్ పార్క్ కు 172ఎకరాలు, విజయనగరం మెడికల్ కాలేజీని నిర్మించ‌డానికి 129ఎకరాల్లో గురజాడ వర్సిటీకి అప్ప‌ట్లోనే శ్రీకారం చుట్టారు. కానీ, ఆ త‌రువాత 2019 ఎన్నిక‌లు రావ‌డంతో సీన్ మారిపోయింది.

రూ 70వేల కోట్లతో  అదానీ డేటా సెంటర్ టెక్ పార్క్

అప్ప‌టికి ఇప్ప‌టికీ తేడాల‌ను గ‌మ‌నిస్తే, ఆనాడు చంద్రబాబు(Chandrababu) సర్కారు 2,700 ఎకరాల్లో ఎయిర్ పోర్టు నిర్మించాల‌ని డిజైన్ చేసింది. కానీ నేడు జగన్ సర్కారు దాని నిర్మాణాన్ని 2200ఎకరాలకు కుదించింది. వరల్డ్ బిగ్గెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ ఏ-380 కూడా ఈజీగా ల్యాండ్ అయ్యే విధంగా 3.8కిమీ రన్ వేకు అప్పట్లో ప్లాన్ చేశారు. ప్రస్తుతం విశాఖ ఎయిర్ పోర్టు నేవీ ఆధ్వర్యంలో నడుస్తోంది. పార్కింగ్ స్పేస్ , మెయింటెనెన్స్ వర్క్ షాప్ అభివృద్ధికి ప్రణాళికలు అప్ప‌ట్లో సిద్దం చేశారు. ఆనాడు ప్ర‌తిప‌క్ష నేత‌గా ఉన్న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) నిర్వాసితుల ప‌క్షాన నిలిచారు. భూములు ఇవ్వొద్ద‌ని పిలుపు నిస్తూ, ఒక వేళ అధికారంలోకి వస్తే తిరిగి భూములను వెనక్కి ఇస్తానని హామీ ఇచ్చారు. కానీ, ఇప్పుడు పూర్తి భిన్నంగా జ‌గ‌న్మోన్ రెడ్డి వ్య‌వ‌హారం ఉంది.

విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు వేగంగా ఫైల్

రాష్ట్ర విభజన తరువాత 4ఏళ్లలోనే ఎయిర్ పాసింజర్ ట్రాఫిక్ 4రెట్లు పెరిగింది. 1.3మిలియన్ నుంచి 5.5మిలియన్లకు పెర‌గ‌డం గ‌మ‌నార్హం. అంటే, సిఏజిఆర్ 38% పెరిగింది. ఏపిలో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు విశాఖపట్నం ఒక్కటే అప్ప‌ట్లో ఉండేది. విజయవాడ, తిరుపతి ఎయిర్ పోర్టులను అంతర్జాతీయ విమానాశ్రయాలుగా ఆనాడు చంద్ర‌బాబు అభివృద్ధి చేశారు. విమానాల జంక్షన్ గా భోగాపురం ఎయిర్ పోర్టు (Bhogapuram Airport) నిర్మాణాన్ని తీర్చిదిద్దాల‌ని డిజైన్ చేశారు. అందుకోసం అప్ప‌ట్లో కేంద్ర విమానయాన శాఖ మంత్రిగా అశోక్ గజపతిరాజు వేగంగా ఫైల్ ను క‌దిలించారు. కానీ ఎయిర్ పోర్టు నిర్మాణానికి ఒక్క అడుగు ముందుకు వేయకుండా నిర్వాసితుల‌ను, భూ సేక‌ర‌ణ‌ను అట్టుకుంటూ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రెచ్చ‌గొట్టారు.

Also Read : CM Jagan : నేడు భోగాపురం ఎయిర్‌ఫోర్ట్‌కు శంకుస్థాప‌న చేయ‌నున్న సీఎం జ‌గ‌న్‌

ఇక అదానీ గ్రూప్ విశాఖలో 130 ఎకరాల ప్రాంగణంలో మెగా డేటా సెంటర్, ఇంటిగ్రేటెడ్ ఐటీ పార్కును ఏర్పాటు చేస్తోంది. ఈ ప్రాజెక్టు కోసం కంపెనీ ఏకంగా రూ.14,000 కోట్లు పెట్టుబడి పెడుతోంది. ఈ ప్రాజెక్టు ద్వారా దాదాపు 25 వేల మంది ఉపాథి వ‌స్తుంద‌ని అంచ‌నా. డేటా సెంటర్ మూడు సంవత్సరాలలోపు తన కార్యకలాపాలను ప్రారంభించి, భూసేకరణ తేదీ నుంచి ఏడేళ్లలోపు ప్రాజెక్ట్ లోని అన్ని అంశాలను పూర్తిచేయాల‌ని 2020లో ఏపీ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల్లో ఉంది. ఆ మేర‌కు బుధ‌వారం శంకుస్థాప‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(jaganmohan Reddy) చేశారు. ఆర్థిక రాజధానిగా ఎదుగుతున్న విశాఖలో ఐటీ కంపెనీలు ఎక్కువగా లేవు. 2021-2022 నాటికి మొత్తం ఐటీ ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 0.14 శాతంగా ఉంది.
Also Read : Jagan Bail : బెయిల్ పై మోడీ గ‌ళం, జ‌గ‌న్ కు జ‌ర్క్.!
డేటా సెంటర్‌ ప్రాజెక్ట్‌ విశాఖను ఎకనామిక్‌ హబ్‌గా మారుస్తుందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ అంటున్నారు. ఏపీకి చెందిన ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. అదానీ డేటా సెంటర్ ద్వారా ప్రత్యక్షంగా 24,990 మందికి, పరోక్షంగా 10,610 మందికి ఉపాధి లభిస్తుందని అంచ‌నా వేస్తున్నారు. ఈ రెండు ప్రాజెక్టులు గ‌తంలో చంద్ర‌బాబు హ‌యాంలో కార్య‌రూపంలోకి వ‌చ్చిన‌వే. కానీ, నాలుగేళ్లుగా ప‌ట్టించుకోని జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇప్పుడు మ‌ళ్లీ వాటికి శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేయ‌డం విడ్డూరం.