Site icon HashtagU Telugu

Bharathi Reddy : భారతి రెడ్డే కాదు.. నీ దగ్గర సమాధానం ఉన్న చెప్పు జగన్‌..?

Bharathi Reddy

Bharathi Reddy

ఏపీలో ఎన్నికల వేళ తమ వారిని గెలిపించుకునేందుకు నడుం బిగించి ప్రచారంలో పాల్గొంటున్నారు కుటుంబ సభ్యులు. ఇప్పటికే ఏపీ ఎన్నికల ప్రచారంలో.. అభ్యర్థికి చెందిన భర్త, భార్య, వారి పిల్లలు పాల్గొనడం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే వైసీపీ అధినేత, సీఎం జగన్‌ భార్య భారతి రెడ్డి సైతం జగన్‌ గెలుపు కోసం శ్రమిస్తున్నారు. కానీ.. ప్రచారంలో అనుకోని ఎదురు దెబ్బలు భారతి రెడ్డికి తగులుతుండటం గమనార్హం. పులివెందులలో వైఎస్ భారతి రెడ్డి తన భర్త కోసం ప్రచారం చేస్తున్నా వేళ… ఈ నియోజకవర్గం వైఎస్ఆర్ కుటుంబానికి కంచుకోట అయినప్పటికీ ఆశ్చర్యకరంగా భారతికి ఒక సామాన్యుడి నుంచి ఎదురుదెబ్బ తగిలింది. ‘మా తాతల నుంచి సంక్రమించిన భూమి పాస్‌ పుస్తకాలపై సీఎం జగన్‌ ఫొటో ఎందుకు?’ అంటూ స్వయంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ నేత, కుమ్మరంపల్లె మాజీ సర్పంచ్‌ భర్త భాస్కరరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పాసుపుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని భారతిని కోరారు.

We’re now on WhatsApp. Click to Join.

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం వైఎస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లిలో భారతి పర్యటించారు. గొర్లమండల కాలనీలో మాజీ సర్పంచ్ ఇంటింటికి వెళ్లి వైఎస్సార్ కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా భాస్కరరెడ్డి ఆమెను ప్రశ్నించారు. రైతు భరోసాలో సగం కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని, దీని వల్ల రైతులకు ప్రయోజనం లేదన్నారు. రైతులకు మేలు జరిగేలా ఈ మొత్తాన్ని పెంచేలా జగన్ తో మాట్లాడాలని భారతిని కోరారు. భాస్కరరెడ్డి ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండిపోయింది భారతి. పులివెందులలో వైఎస్ కుటుంబాన్ని ఎవరో ప్రశ్నించడం అపూర్వమని, అన్ని చర్యలు తీసుకున్నప్పటికీ భారతి రెడ్డికి కూడా అదే జరిగింది. జగన్ చాలా బాధపడటం ఖాయం.

అయితే.. దీనికి సంబంధించిన వీడియోను ఎక్స్‌ వేదికగా టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘సొంత నియోజ‌క‌వ‌ర్గంలో, సొంత పార్టీ వైకాపా నేత సుబ్బారెడ్డి నీ భార్య భార‌తి గారిని అడిగిన ప్ర‌శ్న‌కు ఆమె వ‌ద్దే కాదు, నీ ద‌గ్గ‌రైనా స‌మాధానం ఉంటే చెప్పు జ‌గ‌న్ రెడ్డి? జ‌నం భూములు, ఆస్తిప‌త్రాల‌పై నీ బొమ్మ ఎందుక‌ని రాష్ట్ర‌మంతా అడుగుతోంది. జ‌వాబు ఉందా జ‌గ‌న్ నీ ద‌గ్గ‌ర‌?’ అని ఆయన అన్నారు.
Read Also : Glass Symbol : స్వతంత్రులకు గ్లాస్‌ గుర్తు.. మార్పు తప్పదు..!