Site icon HashtagU Telugu

AP Elections : వైసీపీ గెలుస్తుందని రూ.30 కోట్ల బెట్టింగ్..ఓటమి తో ఆత్మహత్య

Man Ends Life After Betting

Man Ends Life After Betting

ఏపీలో ఎలెక్షన్ల పోరు ఏ రేంజ్ లో జరిగిందో తెలియంది కాదు..నువ్వా నేనా అన్నట్లు కూటమి vs వైసీపీ మధ్య హోరాహోరీ జరిగింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల రంజు పిక్ లెవల్లో ఉండడం..పోలింగ్ శాతం కూడా భారీగా జరగడం తో పందెం రాయుళ్లు రెచ్చిపోయారు. కూటమి గెలుస్తుందని లక్షల మంది పందేలు కాయగా..అదే స్థాయిలో వైసీపీ గెలుస్తుందని కూడా పందేలు కాసారు. అయితే ఓ వ్యక్తి వైసీపీ గెలుస్తుందని చెప్పి ఏకంగా రూ.30 కోట్లు పందేలు కాసి..ఆ డబ్బు తిరిగి చెల్లించలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఏలూరు జిల్లా నూజివీడు మండలం తూర్పుదిగవల్లిలో ఆదివారం జరిగింది.

We’re now on WhatsApp. Click to Join.

తూర్పుదిగవల్లి గ్రామానికి చెందిన జగ్గవరపు వేణుగోపాల్ రెడ్డి (52) ఏడో వార్డు సభ్యుడిగా ఉన్నారు. ఆయన భార్య సర్పంచ్. వీరు వైసీపీ మద్దతుదారులు. దీంతో, ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని వేణుగోపాల్ రెడ్డి వివిధ గ్రామాలకు చెందిన వారితో సుమారు రూ.30 కోట్ల వరకూ బెట్టింగ్ కాసారు. ఫలితాల్లో వైసీపీ ఘోరంగా ఓటమి చెందడంతో.. ఫలితాలు వెల్లడైన రోజున ఊరు విడిచి వెళ్లి.. ఇంటికి తిరిగి రాలేదు. బెట్టింగ్ కట్టిన వారు ఫోన్లు చేసినా స్పందన లేదు. ఈ నెల 7న పందెం వేసిన వారు ఆయన ఇంటికెళ్లి తలుపులు పగులగొట్టి ఏసీలు, సోఫాలు, మంచాలు తీసుకెళ్లిపోయారు. ఈ క్రమంలో మరుసటి రోజు ఊళ్లోకి వచ్చిన ఆయన విషయం తెలిసి మనస్తాపానికి గురయ్యారు. ఆదివారం పొలం వద్ద పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా మృతదేహం వద్ద ఓ లేఖను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో చింతలపూడి మండలం నామవరానికి చెందిన ఓ వ్యక్తి తన మృతికి కారణమని పేర్కొన్నట్టు రాసి ఉంది. దీనిపై కేసు నమోదు చేసి పోలీసులు విచారణ చేపడుతున్నారు.

Read Also : Coconut: కొబ్బరికాయకు మూడు కన్నులు ఎందుకు ఉంటాయో మీకు తెలుసా?