Site icon HashtagU Telugu

YS Sharmila : వైసీపీపై వ్యతిరేకత.. షర్మిల మెజారిటీపై జోరుగా బెట్టింగ్‌లు..

YS Sharmila Wishes

YS Sharmila Wishes

తెలుగు రాష్ట్రాలలో వైఎస్సార్‌పై గౌరవం ఏరేంజ్‌లో ఉందో మనకు తెలుసు. అయితే.. ఇటీవల ఏపీ కాంగ్రెస్‌ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన వైఎస్‌ షర్మిల తన సోదరుడు, సీఎం జగన్‌ను లక్ష్యంగా చేసుకొని ఎన్నికల్లో పోటీ చేశారు. ఆమె ఏపీసీసీ అధినేత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదలు ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారారు. అంతేకాకుండా.. ఏపీ ఎన్నికల్లో ఆమె పులివెందుల నుంచి పార్లమెంట్‌ స్థానానికి పోటీ చేసి అందరి దృష్టిని ఆకర్షించారు. ఎందుకంటే.. పులివెందులలో వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి పోటీ చేస్తున్నారు. అయితే.. అవినాష్‌ రెడ్డి సిట్టింగ్‌ ఎంపీ కూడా. అయితే.. వైఎస్‌ వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న అవినాష్‌ రెడ్డిని ఓడించాలనే లక్ష్యంతో రంగంలోకి దిగిన వైఎస్‌ షర్మిలకు.. వైఎస్‌ వివేకా కుమార్తె సునీతా రెడ్డి కూడా సహాయం చేసినట్లు కనిపిస్తోంది. ఎందుకంటే.. అవినాష్‌ రెడ్డిపై ప్రజల్లోకి వాస్తవికతను తీసుకెళ్లారు. వైఎస్‌ వివేకా హత్య ఉందాంతంకు సంబంధించిన ఎన్నో విషయాలు ఆమె మీడియా ముందు పెట్టారు. ఇవన్నీ వైఎస్‌ షర్మిల గెలుపుకు ప్రాధన్యతను ఇస్తున్నాయి. అయితే.. 2024 సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. మహాకూటమి అభ్యర్థుల గెలుపుపై ​​సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ ఎన్నికల్లో కడప ఎంపీ సీటు కోసం వైఎస్‌ షర్మిల, వైఎస్‌ అవినాష్‌రెడ్డి మధ్య ఆసక్తికర పోరు సాగుతోంది.

We’re now on WhatsApp. Click to Join.

షర్మిల కాంగ్రెస్ తరపున ప్రాతినిధ్యం వహించగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున అవినాష్ నిలిచారు. ఈ పోరులో షర్మిల విజయంపై భారీగా బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. ప్రజలు ఆమె గెలుపుపై ​​కాకుండా మెజారిటీపైనే పందెం కాస్తున్నారు. మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోట పులివెందులలో మెజారిటీ తగ్గడంపై పలువురు పందెం కాస్తున్నారు. కడపలో పందాలు ఎక్కువగా షర్మిల, పులివెందులపైనే కేంద్రీకృతమయ్యాయి. కమలాపురం మండలం ఆదినిమ్మాయపల్లె, వల్లూరు గ్రామాల మధ్య ఉన్న సూపర్‌మార్కెట్‌లో ఈ పందాలు జరుగుతున్నాయి.

వడ్ల వ్యాపారి ఆధ్వర్యంలో బెట్టింగ్‌లు జరుగుతున్నట్లు సమాచారం. మరోవైపు అన్నమయ్య జిల్లాలోనూ బెట్టింగ్ జోరుగా సాగుతోంది. రాజంపేట ఎంపీ సీటుపైనే ఎక్కువగా బెట్టింగ్‌లు జరుగుతున్నాయి. కూటమి మద్దతుదారులు తమ అభ్యర్థుల గెలుపుపై ​​చురుగ్గా బెట్టింగ్‌లు వేస్తుండగా, వైసీపీ నేతలు మాత్రం తమ పోటీదారులపై బెట్టింగ్‌లకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. మొత్తానికి ఐపీఎల్ బెట్టింగ్ కు తోడు ఈ సమ్మర్ లో బుకీలకు ఈ ఎన్నికల బెట్టింగ్ అదనపు ఊపునిచ్చింది.
Read Also : Pawan Kalyan : ఆ విషయం ఈసారి పవన్‌ వైపే అంట..!