Vidadala Rajini: సుందరానికి తొందరెక్కువ..! విడదల రజనీ బయోగ్రఫీ

వైసీపీ యువనేతల్లో ఆవిడొకరు...! పబ్లిసిటీ స్టంటో...అధినేత గాలికి అలా గెలిచేసారో ఏమో కానీ.. గత ఎన్నికల్లో ఏకంగా మంత్రినే ఓడించేసి..ఈవిడ కూడా మంత్రి అయ్యారు. ఇంత షార్ట్ జర్నీ.. ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి...మిత్రులతో పాటు.... శత్రువులు కూడా బానే ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈవిడ గారికి.. ప్రచారం అంటే మోజు అని.... ఎక్కడ కాంపెయిన్ జరిగినా ఆవిడే కనిపిస్తారంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయ్. మీడియా కెమెరాలకు చిక్కాలని తెగ ఆరాట పడుతుంటారని.. ఈ మంత్రిగారి పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపించేవి..! మరి ఇంత చరిష్మా ఉన్న నేత వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా..? ఇంతకీ ఎవరా నేత...లెట్స్ రీడ్ దిస్ స్టోరీ...

  • Written By:
  • Publish Date - April 30, 2024 / 02:17 PM IST

Vidadala Rajini: వైసీపీ యువనేతల్లో ఆవిడొకరు…! పబ్లిసిటీ స్టంటో…అధినేత గాలికి అలా గెలిచేసారో ఏమో కానీ.. గత ఎన్నికల్లో ఏకంగా మంత్రినే ఓడించేసి..ఈవిడ కూడా మంత్రి అయ్యారు. ఇంత షార్ట్ జర్నీ.. ఇంత అద్భుతంగా ఉంది కాబట్టి…మిత్రులతో పాటు…. శత్రువులు కూడా బానే ఉంటారు. మరి ఇలాంటి సందర్భంలోనే ఈవిడ గారికి.. ప్రచారం అంటే మోజు అని…. ఎక్కడ కాంపెయిన్ జరిగినా ఆవిడే కనిపిస్తారంటూ రూమర్స్ గట్టిగానే వినిపించాయ్. మీడియా కెమెరాలకు చిక్కాలని తెగ ఆరాట పడుతుంటారని.. ఈ మంత్రిగారి పార్టీ నేతల్లోనే గుసగుసలు వినిపించేవి..! మరి ఇంత చరిష్మా ఉన్న నేత వచ్చే ఎన్నికల్లో గెలుస్తారా..? ఇంతకీ ఎవరా నేత…లెట్స్ రీడ్ దిస్ స్టోరీ…

గుంటూరు జిల్లా….ఏపీ రాజకీయాల్లో చాలా కీలకం. ఇక్కడి ఓటర్లు…ఎప్పుడు ఎవరికి పట్టం కడతారో వారికే అర్ధం కాదు. ప్రతి ఎన్నికల్లోనూ… పార్టీ ఆభ్యర్ధి మారకున్నా…. గెలిచే అభ్యర్ధిని మాత్రం మార్చేస్తారు ఇక్కడి ఓటర్లు. అలాంటి నియోజకవర్గం.. మొదట్నుంచీ టీడీపీకి మంచి పట్టుంది. ఇక్కడ ఎప్పటి నుంచో..టీడీపీ సీనియర్ నాయకుడు ప్రత్తిపాటి పుల్లారావు ఇక్కడ పాగా వేసారు. అలాంటి నాయకుడినే ఇక్కడ ఓటర్లు…ఇంకా విడదల చరిష్మా అన్నీ కలిసాయ్.ఇంకేముంది…. అక్కడ ప్రత్తిపాటి పుల్లారావు ఓటమి తప్పలేదు. అంటే ఇక్కడ ఓటర్లు చైతన్యం కలవారే..కానీ…ఎన్నికల మందు వాళ్లకి ఏం చెప్తున్నాం… వాళ్లకి ఏం చేస్తున్నాం అన్నది ఇక్కడ పాయింట్. అందుకేనేమో….ఇక్కడ ఒక్కరిద్దరు నాయకులు తప్పా… ఇంకెవరూ కూడా ఎక్కువ సార్లు గెలవలేదు.

ఏపీ రాజకీయాల్లో మంత్రిగారి తీరే ప్రత్యేకంగా ఉంటుందనడంలో….ఏమాత్రం సందేహం లేదు. ఎంతో ఎమోషనల్‌గా మాట్లాడినట్టు మాట్లాడి… తనకి నచ్చిందే చేసేస్తుంటారు విడదల రజనీ..! ఇలాంటి క్యారెక్టర్స్ రాజకీయాల్లో సర్వసాదారణం అయినా…. మంత్రి విడదల రజనీ రూటు మాత్రం సపరేటు. 2019 ఎన్నికల వేళ..ఆమె వ్యవహరించిన తీరు… అనూహ్యంగా పార్టీ మారిన తీరు…అంతకముందు చంద్రబాబును ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు… సోషల్ మీడియాలో ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలాంటి వీడియోలు చూసిన వారు… ముక్కున వేలేసుకోవాల్సిందే..!

జీవితంలో ఊహించని మలుపులు, సినిమాలు కనిపిస్తాయ్…అందుకు సాక్ష్యాత్తు నిదర్శనం విడదల రజనీ. అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవడమే కాదు… అందుకు తగ్గట్టుగా రాణించడం.. తనకు తాను ఒక నాయకురాలిగా ఎదగడం… ప్రతి సవాల్‌ని ధైర్యంగా ఎదుర్కొని నాయకురాలిగా నిలబడటం లాంటి ఎన్నో ఘటనలు.. విడదల రజనీ జీవితంలో కనిపిస్తాయ్.
చిలకలూరిపేట ఎమ్మెల్యేగా గెలవడమే ఒక సంచలనం అయితే… 32 ఏళ్లకే ఏపీ కేబినెట్‌లో చోటు దక్కించుకోవడం… విడదల రజనీ జీవితంలో ఇదో విశేషం. అతి తక్కువ కాలంలో ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్న విడదల రజనీకి… సోషల్ మీడియాలో లక్షలాది అభిమానులు ఉన్నారు. రజనీ.. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి BSC కంప్యూటర్స్… మల్కాజ్‌గిరిలోని సెయింటాన్స్ మహిళా డిగ్రీ కళాశాల నుంచి MBA పూర్తి చేశారు. ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేసిన రజనీ.. విడదల కుమార స్వామిని వివాహం చేసుకున్నారు. భర్త సహకారంతో..VR ఫౌండేషన్ ను స్టార్ట్ చేసారు. ఈ ఫౌండేషన్ ద్వరా… పలు సంక్షేమ కార్యక్రమాలు చేసి జనానికి దగ్గర అయ్యారు. టీడీపీలో పలు పదవులు చూసి విసిగిపోయి.. 2018 ఆగస్టులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి చిలకలూరిపేట ఎమ్మెల్యేగా పోటీ చేసి…అప్పటి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీద 8 వేల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. చిలకలూరిపేట నుంచి గెలిచిన మొట్టమొదటి బీసీ మహిళగా రికార్డుల్లోకి ఎక్కారు. శాసనసభా వేదికగా… తనదైన శైలిలో వివిధ ప్రజా సమస్యలు, అభివృద్ధి అంశాల మీద గళం విప్పారామె. ఉత్సాహంగా ఉండటం.. నిత్యం ప్రజల్లో ఉండటం… అన్ని వర్గాలకు అందుబాటులో ఉండటం ఈవిడకు బాగా కలిసొచ్చాయ్. ఇవన్నీ కలిసొచ్చే…. ఆవిడ ముందు ఎమ్మెల్యే అయ్యారు…ఆ తర్వాత మంత్రి కూడా అయ్యారని చెప్పుకోవాలి.

గత ఎన్నికల్లో చిలకలూరిపేటలో వైసీపీ నుంచి విడదల రజిని గెలుపొందారు.. ప్రస్తుతం జగన్ క్యాబినెట్ లో ఆమె మంత్రిగా కూడా ఉన్నారు. ఇప్పుడు ఈవిడ గారు గుంటూరు వెస్ట్ నుంచి పోటీ చేస్తున్నారు. టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తే విడదల రజిని గుంటూరులో మళ్లీ గెలుస్తారా.. వైసీపీ మళ్లీ ఇక్కడ విజయం సాధిస్తుందా..? ఇక వచ్చే ఎన్నికల్లో… అక్కడి వైసీపీ కీలక నేత మర్రి రాజశేఖర్ కు ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో..ఈవిడ గారికి టికెట్ కన్‌ఫర్మ్ అని తేలిపోయింది. ఐతే మంత్రి రజనీ ఈసారి గెలుపు అవకాశాలు చాలా తక్కువ అనే ప్రచారం ఊపందుకుంటోంది. మంత్రి గారికి పార్టీలోనే కొన్ని సమస్యలున్నాయ్. అలాగే బయట సమస్యలు కూడా మరికొన్ని తోడయ్యాయనేది స్థానిక ఓటర్ల మాట. గత ఎన్నికల్లో గెలిచినంత ఈజీ కాదు.. వచ్చే ఎన్నికల్లో గెలవడం అనేది… ఇప్పుడు స్థానికంగా వినిపిస్తోన్న మాట. నిజానికి గత ఎన్నికల్లో రజనీ గెలుపు ఎదో అలా జరిగిపోయిందనే వాదనలూ లేకపోలేవు. ఎందుకంటే…పాదయాత్రలో జగన్… ఈసారి గుంటూరు టికెట్ విడదల రజనీకి ఇస్తున్నానని చెప్పడం…. పార్టీలో ఎన్ని విభేదాలున్నా…ఏం చేసైనా సరే… రజనీని గెలిపించాలని కోరారు జగన్.

వాస్తవానికి… మొదట్నుంచీ చిలకలూరిపేట సెగ్మెంట్ అంటే..కమ్మ సామాజికవర్గానికి మంచి పట్టుందని పేరు ఉండేది. అలాంటిది అక్కడ… 2019 ఎన్నికల్లో బీసీ సామాజికవర్గానికి చెందిన విడదల రజనీ గెలవడం ఒక సంచలనం అనే చెప్పాలి. అందులోనూ అక్కడ కాకలు తీరిన నాయకుడు.. ప్రత్తిపాటి పుల్లారావుని ఓడించడం..అది కూడా తక్కువ రాజకీయ అనుభవం ఉండి…ఇదంతా సాహసం అనే చెప్పుకోవాలి. ఆ తర్వాత ఎమ్మెల్యేగా గెలిచి…అనతి కాలంలోనే మంత్రి అవ్వడం.. ఒక్కసారిగా ఆవిడే షాకయ్యారట. సరే ఇక్కడి వరకు బానే ఉంది. ఒకళ్లు ఎదుగుతున్నారంటే…శత్రువులు ఉండటం సహజమే..! కానీ మంత్రి విడదల రజనీకి… ఇంటి పోరు ఎక్కువైంది. పార్టీలోని అసంతృప్త నేతలు…ఈవిడగారి ఫాలోయింగ్ చూసి పెద్ద పెద్ద నేతలే కుళ్లుకుంటున్నారట. కొన్ని బాహాటంగా ప్రకటించకపోయినా…. పెద్ద ఎత్తునే అసంతృప్తి ఉందన్న మాట వాస్తవం. ఇటు నరసారావు పేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులితో…మంత్రికి ఏమాత్రం పడటం లేదు. అలాగే మరో సినియర్ నేత…ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్‌తో కూడా మంత్రికి పొసగడం లేదు. ఇక వీటితో పాటు చిన్నచిన్న సమస్యలు ఎలాగూ ఉంటాయ్. ఇవన్నీ కలిసి మంత్రిపై వ్యతిరేకత పెంచేస్తున్నాయన్నది…జరుగుతున్న ప్రచారం.

కానీ మంత్రి గారికి మాత్రం….ఇవేం పట్టడం లేదు. తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. సంక్షేమ పథకాల అమలు..పలు అభివృద్ధి కార్యక్రమాలు, జగనన్న కాలనీలు…ఇలా తాను చేసిన పనులే తనను గెలిపిస్తాయని అనుకుంటున్నారట మంత్రి విడదల రజనీ. ఒకానొక సందర్భంలో… పార్టీలో జరుగుతున్న చర్చల్ని చూస్తుంటే…. మళ్లీ ఈసారి టికెట్ ఇస్తారా లేదా అన్నది కూడా కాస్తంత డౌట్ గానే అనిపించింది అప్పట్లో..! సరే ఇవన్నీ ఒకెత్తు… ఆవిడకి పబ్లిసిటీ పిచ్చి అని సోషల్ మీడియాలో ఆవిడంటే పడని వాళ్లు తెగ ట్రోల్స్ చేస్తూ ఉంటారు. సీఎం సభ ఉంటే…మీడియా ముందు ఆవిడే ఎక్కువ ఫోకస్ అవుతారని… ఇంకా ఏ ఎమ్మెల్యేని…ఏ మంత్రిని కూడా సీఎం దగ్గరికి రానివ్వకుండా..తానే మీడియాలో ఎక్కువ కనిపిస్తారని..ఆరోపణలు చేస్తుండేవారు ప్రత్యర్ధుులు. మరి ఇలాంటి నేపధ్యాలు కూడా..ఈవిడ గారికి మరింత మైనస్ అవుతున్నాయ్.

కొత్తగా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైద్య ఆరోగ్య శాఖామంత్రి విడదల రజిని ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ గా ఏపీని తీర్చి దిద్దుతామని, ఆస్పత్రులలో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేస్తామని బాధ్యతలు చేపట్టిన తొలి నాడు చెప్పారు. అయితే విడదల రజిని బాధ్యతలు చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక దారుణ సంఘటనలు చోటు చేసుకున్నాయి. విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక మానసిక దివ్యాంగురాలి పై ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన చోటు చేసుకుంది. ఏకంగా ప్రభుత్వాసుపత్రిలోనే గ్యాంగ్ రేప్ చోటుచేసుకోవడంతో ఈ వ్యవహారం అటు వైద్య ఆరోగ్య శాఖ మంత్రికి చిక్కులు తెచ్చిపెట్టింది. అప్పట్లో… విడదల రజినికి హైకోర్టు షాకిచ్చింది. చిలకలూరిపేటలో అసైన్డ్ భూములను గ్రానైట్ తవ్వకాలకు ఇవ్వడంపై ఏపీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసైన్డ్ భూముల్లో తవ్వకాలకు రెవెన్యూ అధికారులు ఎన్‌వోసీ ఇవ్వడంపై రైతులు అభ్యంతరం తెలుపుతూ.. కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. అసైన్డ్ భూములకు సంబంధించిన రైతులను బెదిరించి చట్టవిరుద్ధంగా ఎన్‌వోసీ ఇచ్చారని రైతులు పిటిషన్‌లో వివరించారు. దీనికి సంబంధించి రైతులు మంత్రి విడదల రజినితోపాటు పలువురు పేర్లను చేర్చారు. దీంతో విచారణ చేపట్టిన కోర్టు.. వివరణ ఇవ్వాలంటూ మంత్రి విడదల రజినితో పలువురికి నోటీసులు జారీ చేయడం ఏపీలో చర్చనీయాంశంంగా మారింది.

ఆంధ్రప్రదేశ్ లో సాధారణ ఎన్నికలకు మరో పది రోజులే సమయం ఉంది. టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో వేగం పెంచేశారు. చంద్రబాబు గతానికి భిన్నంగా అభ్యర్థుల విషయంలో ఎంతో ఆచితూచీ వ్యవహరిస్తున్నారు. అందుకే…గుంటూరు వెస్ట్ విషయంలో చంద్రబాబు ఊహకి అందని నిర్ణయం తీసుకున్నారు. రాజకీయాలు ఎప్పుడు ఒకరికే కలిసిరావు. పరిస్తితులకు తగ్గట్టుగా మారిపోతాయ్. ఒకసారి గెలిచి తమకు తిరుగులేదని భావిస్తే..ఎప్పటికైనా దెబ్బతినక తప్పదు..ఇంకా తమదే విజయం అని అనుకోవడం కరెక్ట్ కాదు. అధికారంలో ఉన్నాం కదా అని..ఇంకా శాశ్వతంగా అధికారం తమదే అని అనుకుంటే రిస్క్ తప్పదు. ఇప్పుడు అధికార వైసీపీలో చాలామంది నేతలు అలాగే భావిస్తున్నారు. ఏదో శాశ్వతంగా అధికారం, గెలుపు తమదే అనే భావనలో ఉన్నారు.

ఇలాంటి వారికి ప్రజలు షాక్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు. అలా ప్రజల షాక్ ఎదురుకోబోతున్న వారిలో మంత్రి విడదల రజిని కూడా ఉన్నారని సమాచారం. 2019 ఎన్నికల ముందు వరకు రజినికి రాజకీయాలు అంటే పెద్దగా పరిచయం లేదు. ఏదో ఎన్‌ఆర్‌ఐగా వచ్చి..టి‌డి‌పిలో చేరి..అప్పుడు మంత్రిగా చేసిన ప్రత్తిపాటి పుల్లారావు ఫాలోవర్‌గా ముందుకు సాగారు. కానీ సడన్ గా ఆమెకు సీటు కోసం చూశారు. ఇదే క్రమంలో వైసీపీ ఆఫర్ ఇచ్చింది. వెంటనే వైసీపీలోకి వెళ్ళిపోయారు. ఇక అప్పటివరకూ వైసీపీ సీనియర్ గా ఉన్న మర్రి రాజశేఖర్‌ని సైతం పక్కన పెట్టి.. ఆర్ధికంగా బలంగా ఉన్న రజినికి సీటు ఇచ్చారు. జగన్ గాలిలో రజిని.. ప్రత్తిపాటిపై గెలిచారు. గెలిచిన తర్వాత నుంచి సీన్ మారిపోయింది..ఆమె గెలుపుకు సపోర్ట్ చేసిన మర్రినే సైడ్ చేసేశారు. అటు ఎంపీ శ్రీకృష్ణకు సైతం చెక్ పెట్టాలని చూశారు. పైగా మంత్రి పదవి దక్కడంతో ఎక్కడా కూడా తగ్గట్లేదు. విచిత్రం ఏంటంటే త‌న కోసం సీటు త్యాగం చేసిన మ‌ర్రికి జ‌గ‌న్ మంత్రి ప‌ద‌వి ఇస్తానంటే.. ఆయ‌న‌కు కాకుండా ర‌జ‌నీయే మంత్రి ప‌ద‌వి సాధించేశారు.

ఐతే… మంత్రిగా తన శాఖపై పట్టు తక్కువ..నియోజకవర్గంలో అభివృద్ధి తక్కువ..సోషల్ మీడియాలో హడావిడి ఎక్కువ. దీంతో ఆమెపై నెగిటివిటీ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో గుంటూరు వెస్ట్‌లో ఆమెకు గెలుపు అవకాశాలు లేవని తాజా సర్వేలు చెప్తున్నాయ్. కాబట్టి…. గుంటూరు వెస్ట్‌లో టీడీపీ గెలుపు ఖాయమైందనే గుసగుసలు వినిపిస్తున్నాయ్. ఇక రజినికి సొంత పార్టీ నేతలే దూరం అవుతు న్నారు.ఫైనల్‌గా వచ్చే ఎన్నికల్లో రజిని రెండోసారి గెలిచే ఛాన్స్ అసలు కనిపించడం లేదనేది నియోజకవర్గంలో వినిపిస్తోన్న మాట.