BC Meet : టీడీపీతో బీసీల‌కు ఆత్మీయ‌బంధం! చంద్ర‌బాబు విజ‌య‌నగ‌రకేత‌నం!

టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు పార్టీ ఆవిర్భావం నుంచి పునాదులుగా ఉన్న

  • Written By:
  • Publish Date - December 23, 2022 / 04:32 PM IST

గెలుపు నాడిని టీడీపీ జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబునాయుడు ప‌ట్టుకున్నారు. పార్టీకి అంకితభావంగా ఉండే వాళ్లు ఎవ‌రు? అధికారం ఉన్న‌ప్పుడు నాట‌కాలాడి త‌ప్పుదోవ ప‌ట్టించేదెవ‌రు? అనే విష‌యాన్ని గ‌తం కంటే బాగా గ‌మ‌నించారు. అందుకే, పార్టీ ఆవిర్భావం నుంచి పునాదులుగా ఉన్న వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను(BC Meet) అక్కున చేర్చుకుంటున్నారు. వెనుక‌బ‌డిన వ‌ర్గాలకు, టీడీపీ పార్టీకి మ‌ధ్య ఉన్న మానసిక అనుబంధాన్ని విజ‌య‌న‌గ‌రం జిల్లా రాజాంలో జ‌రిగిన ఆత్మీయ స‌మ్మేళనం(BC Meet)లో చంద్ర‌బాబు అవ‌లోక‌నం చేశారు. వెనుకబ‌డిన వ‌ర్గాల్లోని 140 ఉప కులాలను(Caste) ఆదుకోవ‌డానికి 54 బిసి సాధికార కమిటీలు వేశామ‌ని చంద్ర‌బాబు వెల్లడించారు.

ఆత్మీయ స‌మ్మేళనం(BC Meet)

కుల‌, మ‌తం, ప్రాంతం ప్రాతిపదిక‌ను చంద్ర‌బాబు ఏనాడూ అధికారాన్ని దుర్వినియోగం చేయ‌లేద‌ని టీడీపీలోని చాలా మంది విశ్వసిస్తుంటారు. అంతేకాదు, సొంత సామాజిక‌వ‌ర్గానికి ఆయ‌న ఏనాడూ అద‌నంగా చేసిన విధాన ప‌ర‌మైన అంశాలు ఏమీలేవు. ఆ విష‌యంలో ఆయ‌న చాలా సూటిగా ఉంటారు. సొంత సామాజిక‌వ‌ర్గంలోని కొంద‌ర్ని మిన‌హా ద‌గ్గ‌ర‌కు కూడా రానివ్వ‌ర‌ని ఆయ‌న గురించి తెలిసిన వాళ్ల‌కు బాగా తెలుసు. ఆయ‌న ఏలుబ‌డిలో ద‌గ్గ‌ర‌తీసిన సొంత సామాజిక‌వ‌ర్గం నేత‌ల్ని వేళ్ల‌మీద లెక్క‌బెట్టొచ్చు. స‌మాజంలో పేద‌, ధ‌నిక అనే రెండు కులాలు(Caste) మాత్రమే ఉంటాయ‌ని చంద్ర‌బాబునాయుడు అనుభవం రీత్యా చెబుతుంటారు. అదే సూత్రాన్ని అనుస‌రిస్తుంటారు. అందుకే ఆయ‌న హ‌యాంలో ఎక్కువ‌గా వెనుక‌బ‌డిన వ‌ర్గాల‌ను అంద‌లం ఎక్కించారు. అదే విష‌యాన్ని విజ‌య‌న‌గనం `ఇదేం ఖ‌ర్మ‌ మ‌న రాష్ట్రానికి` ప్రోగ్రామ్ లో ప్ర‌త్యేకంగా గుర్తు చేశారు.

బీసీల జీవ‌న‌శైలితో రాజ్యాధికారానికి

టీడీపీ ఆవిర్భావానికి ముందు ఆ త‌రువాత బీసీల జీవ‌న‌శైలితో రాజ్యాధికారానికి ద‌గ్గ‌ర‌య్యారు. స‌మాజంలో 50 శాతం పైగా ఉన్న బీసీలను మొద‌టి నుంచి టీడీపీ గౌర‌విస్తోంది. అప్ప‌ట్లో ఎన్టీయే ప్ర‌భుత్వంలో కేంద్ర మంత్రిగా ఎర్రంనాయుడుకు అవ‌కాశం ఇవ్వ‌డం ఒక చ‌రిత్ర‌. రాష్ట్ర మంత్రులుగా అయ్యన్నపాత్రుడు, యనమల రామకృష్ణుడు, కె.ఇ. కృష్ణమూర్తి, దేవేందర్ గౌడ్ త‌దిత‌రులు కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. బీసీ వ‌ర్గానికి చెందిన సుధాకర్ యాదవ్ ను టీటీడీ బోర్డు చైర్మన్ గా నియ‌మించ‌డం ద్వారా టీడీపీ బీసీల‌కు ప్రాధాన్యం ఇస్తుంద‌ని నిరూపించింది. ఎన్టీఆర్ హయాంలో బీసీ కమిషన్ వ‌చ్చిన విష‌యం అంద‌రికీ. తెలిసిందే. వంశపారంపర్యంగా బీసీల‌కు ఉన్న‌ కులవృత్తులు, చేతి వృత్తులు ప్రోత్స‌హించ‌డానికి టీడీపీ స‌ర్కార్‌ ప్రత్యేక పథకాలు క్రియేట్ చేసి ఆర్థికంగా వాళ్ల‌ను పైకి తీసుకొచ్చింది. ఒక‌ప్పుడు కల్లుగీత కార్మికుల జీవితాలు చాలా దారుణంగా ఉండేవి. ప్రమాదం జరిగితే ఎవరూ ఆదుకునే వారులేని దుర్భ‌ర ప‌రిస్థితుల్లో టీడీపీ వచ్చిన తరువాత కల్లుగీత కార్మికులకు 20 శాతం ప్రభుత్వ మద్యం షాపులు కేటాయించ‌డం ఒక సంచ‌ల‌న నిర్ణ‌యం.

సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు పెట్రోల్ డీజిల్ సబ్సిడీ ఇవ్వ‌డం ద్వారా టీడీపీ ఆదుకుంది. చేపలవేట విరామం ఉండే రోజుల్లో మత్స్యకార కుటుంబాలకు బియ్యం, సరుకులు ఇచ్చి సహాయం ఉండేది. మత్స్య కారుల కోసం ఆధునిక బోట్లు అందుబాటులోకి తెచ్చిన టీడీపీ సర్కార్ నిస్వార్థ సేవ‌ను ఆత్మీయ స‌మ్మేళ‌నంలో చంద్ర‌బాబు గుర్తు చేశారు. ఒకప్పుడు మంగళసూత్రం తయారైన తర్వాతే ముహూర్తం పెట్టుకునే పరిస్థితి ఉండేలా విశ్వబ్రాహ్మణులకు డిమాండ్ ఉండేది. కానీ, ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. బీసీల‌కు చంద్ర‌బాబు గ‌తంలో అమ‌లు చేసిన ప‌థ‌కాల‌ను ర‌ద్దు చేసి కొంద‌రికి మాత్ర‌మే ఖాతాల్లో డ‌బ్బులు వేస్తున్నారు.

వెనుకబ‌డిన వ‌ర్గాల్లోని 140 ఉప కులాలు

ప్ర‌స్తుతం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ప్ర‌భుత్వం 56 కార్పొరేష‌న్ల‌ను ఏర్పాటు చేసింది. వాటికి చైర్మ‌న్ల‌ను నియ‌మించ‌డంతో పాటు కొన్నింటికి స‌ల‌హాదారుల‌ను కూడా నియమించింది. విచిత్రంగా ఏ ఒక్క కార్పొరేష‌న్ కు నిధులు కేటాయించ‌కుండానే ఇటీవ‌ల వాళ్ల చైర్మ‌న్ ప‌ద‌వుల గ‌డువు ముగిసింది. బీసీలకు ఆదరణ కోసం తెచ్చిన రూ.300 కోట్ల విలువ చేసే పరికరాలు తుప్పుపట్టిపోతున్నా ఇవ్వలేదు. ఉత్తరాంధ్రలో తోటపల్లి, మద్దివలస ప్రాజెక్టును పూర్తి చేసిన విష‌యాన్ని చంద్ర‌బాబు బీసీల స‌ద‌స్సులో గుర్తు చేశారు. ప్ర‌స్తుతం మోటార్లకు మీటర్లు పెడుతున్నారు. స‌మాజాన్ని చీల్చి చెండుతోన్న జ‌గన్మోహ‌న్ రెడ్డి పాల‌న‌కు అంతం ప‌ల‌కాల‌ని బీసీల‌కు చంద్ర‌బాబు పిలుపునిచ్చారు.

వెనుక‌బ‌డిన వ‌ర్గాల్లోని బ‌ల‌మైన లీడ‌ర్ల మీద జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌ర్కార్ గురి పెట్టింది. ఆయ‌న సీఎం అయిన తొలి రోజుల్లోనే టీడీపీలోని మాజీ మంత్రి కొల్లు రవీంద్రలాంటి వారిపై కేసు పెట్టి జైల్లో పెట్టారు. అజాత శత్రువు లాంటి కొల్లు రవీంద్రపై కేసులు పెట్టారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడుపైనా కేసు పెట్టి జైలుకు పంపారు. చివరికి కళా వెంకటరావు, అయ్యన్న పాత్రుడుపైనా కేసులు పెట్టారు. 72 ఏళ్ల అయ్యన్నపై రేప్ కేసు పెట్టిన విష‌యాన్ని చంద్ర‌బాబు త‌ప్పుబ‌ట్టారు. బీసీ మహిళ గౌతు శిరీషపైనా కేసులు పెట్టారు. గౌతు లచ్చన్న కుటుంబ సభ్యురాలిపై కేసు పెట్టారు. కూన రవిపై ప‌లు కేసులు పెట్టారు. బీసీలకు జగన్ హయాంలో అన్యాయం జరుగుతోంద‌న్న విష‌యాన్ని గ‌మ‌నించాల‌ని కోరారు. 40 ఏళ్లు ఆదరించి గౌరవించిన బీసీలకు న్యాయం చేస్తాన‌ని చంద్ర‌బాబు వెల్ల‌డించారు. ఉత్త‌రాంధ్ర‌లోని ప‌లు బీసీ సంఘాల నేత‌లు(Caste) పార్టీల‌కు అతీతంగా పెద్ద ఎత్తున ఈ స‌మ్మేళ‌నానికి (BC Meet)హాజ‌రు కావ‌డం కొస‌మెరుపు.

Also Read : Chandrababu Naidu: మైనార్టీల వైపు చంద్రబాబు!A