Site icon HashtagU Telugu

R Krishnaiah: కాంగ్రెస్‌లోకి బీసీ నాయకుడు ఆర్‌. కృష్ణయ్య‌..?

R Krishnaiah

R Krishnaiah

R Krishnaiah: బీసీ సంఘం అధ్యక్షులు, మాజీ ఎంపీ ఆర్. కృష్ణయ్య R Krishnaiah)తో కాంగ్రెస్‌ ఎంపీ మల్లు రవి బుధ‌వారం ఉద‌యం భేటీ అయ్యారు. హైద‌రాబాద్‌లోని ఆర్‌. కృష్ణ‌య్య నివాసానికి ఎంపీ మ‌ల్లు ర‌వి మ‌ర్యాద‌పూర్వ‌కంగా వెళ్లారు. నిన్న‌టి వ‌ర‌కు వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీగా ఉన్న కృష్ణ‌య్య కొన్ని కార‌ణాల వ‌ల‌న త‌న ప‌ద‌వికి రాజీనామా చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌ను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకు మ‌ల్లు ర‌వి భేటీ అయిన‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ నడుస్తోంది. అయితే కృష్ణ‌య్య వైసీపీకి రాజీనామాకు ముందే బీజేపీ పెద్ద‌ల‌తో మాట్లాడిన‌ట్లు స‌మాచారం. వారి నుంచి భ‌రోసా వ‌చ్చాకే త‌న రాజ్య‌స‌భ ప‌ద‌వికి రాజీనామా చేసిన‌ట్లు తెలుస్తోంది.

ఆర్.కృష్ణయ్య బీసీ ఉద్యమ నాయకుడు, తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. 1994లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీసీ సంక్షేమ సంఘం ఏర్పాటు చేశాడు. ఆయన 2014లో ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందాడు. ఆయన ప్రస్తుతం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్నారు. మంగ‌ళ‌వారం వైసీపీ రాజ్య‌స‌భ ఎంపీ ప‌ద‌వికి వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల‌న రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Also Read: Virat Kohli In Kanpur: హోట‌ల్ అధికారికి షేక్ హ్యాండ్ ఇవ్వ‌ని కోహ్లీ.. వీడియో వైర‌ల్‌..!

ఆర్.కృష్ణయ్య 2014లో తెలుగుదేశం పార్టీలో చేరి ఎల్బీ నగర్ నియోజకవర్గం నుండి పోటీ చేసి టిఆర్ఎస్ అభ్యర్థి ముద్దగోని రామ్మోహన్ గౌడ్ పై 12,525 ఓట్ల మెజారిటీతో గెలుపొంది తొలిసారి చట్ట సభల్లోకి అడుగుపెట్టాడు. 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీకి రాజీనామా చేసి, కాంగ్రెస్ పార్టీలో చేరి మిర్యాలగూడ నుండి పోటీ చేసి ఓటమి పాలయ్యాడు. ఇక ఆర్‌.కృష్ణయ్యను రాజ్యసభ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ 2022 మే 17న ప్రకటించింది. అయితే ప్ర‌స్తుతం కాంగ్రెస్ ఎంపీ మ‌ల్లు రవి భేటీ కావ‌డంతో ప్ర‌స్తుతం కృష్ణ‌య్య వ్య‌వ‌హారం సంచ‌ల‌నంగా మారింది. కృష్ణ‌య్య కాంగ్రెస్ పార్టీలో చేరితే కీల‌క ప‌దవి ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. మ‌రీ ఆయ‌న కాంగ్రెస్‌లోకి వెళ్తారా లేక బీజేపీలోకి వెళ్తారా తెలియాలంటే మ‌రికొద్ది రోజులు ఆగాల్సిందే.