Site icon HashtagU Telugu

Mudragada Padmanabham : ‘బీసీ కార్డ్’ తో రెండో కృష్ణుడు

Mudragada Brother Anil

Mudragada Brother Anil

వెనుబ‌డిన వ‌ర్గాల‌ను ముఖ్య‌మంత్రిని చేయ‌డానికి బీజేపీ సిద్ధం అవుతోంది. ఆ మేర‌కు బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవ‌ల ప్ర‌క‌టించిన విష‌యం విదిత‌మే. అదే ఈక్వేష‌న్ తో తాజాగా బ్ర‌ద‌ర్ అనిల్ కొత్త పార్టీ అడుగులు వేస్తోంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల లీడ‌ర్ల‌తో స‌మావేశ‌మైన బ్ర‌ద‌ర్ అనిల్ కొత్త పార్టీ కోసం క‌స‌ర‌త్తు చేస్తున్నాడు. ఆ క్ర‌మంలో సోమ‌వారం ఆయా వ‌ర్గాలకు చెందిన ఉత్త‌రాంధ్ర లీడ‌ర్ల‌తో విశాఖ‌ప‌ట్నం కేంద్రంగా మ‌రోసారి స‌మావేశం అయ్యాడు. బీసీ సీఎం అభ్య‌ర్థిని ముందుగా ప్ర‌క‌టించ‌డం ద్వారా స‌రికొత్త రాజ‌కీయ ఆరంగేట్రం చేయాల‌ని అనిల్ భావిస్తున్నాడ‌ట‌.వెనుక‌బ‌డిన త‌రగ‌తుల లీడ‌ర్ల‌తో కాపు రిజ‌ర్వేష‌న్ ఉద్య‌మ‌నేత ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం గ‌త ఏడాది స‌మావేశం నిర్వ‌హించాడు. బ‌హుజ‌నుల రాజ్యాధికారం కోసం కొత్త పార్టీ అంటూ సంకేతాలు ఇచ్చాడు. ఒక‌టి రెండు స‌మావేశాల‌ను బీసీ నేత‌ల‌తో ఆయ‌న నిర్వ‌హించాడు. కాపు ఉద్య‌మం నుంచి దాదాపుగా త‌ప్పుకున్న ముద్ర‌గ‌డ కొత్త పార్టీ దిశ‌గా అడుగులు వేశాడు. దీంతో సీఎం జ‌గ‌న్ ఆయ‌న వెనుక ఉండి నడిపిస్తున్నాడ‌ని ప్ర‌చారం జ‌రిగింది. కానీ, ముద్ర‌గ‌డ ప్ర‌య‌త్నాలు తొలి ద‌శ‌లోనే ఫ‌లించ‌లేద‌ని బీసీ నేత‌ల నుంచి అందుతోన్న స‌మాచారం. ముంద్ర‌గ‌డ‌తో క‌లిసి న‌డించేందుకు బీసీ నేత‌లు ఎవ‌రూ ఇష్ట‌ప‌డ‌లేదట‌.

ముద్ర‌గ‌డ వ‌దిలేసిన ఈక్వేష‌న్ తో ఇప్పుడు బ్ర‌ద‌ర్ అనిల్ కొత్త పార్టీ కోసం స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తున్నాడు. చాలా కాలంగా బీసీలు రాజ్యాధికారం కోసం ప్ర‌య‌త్నం చేస్తున్నారు. కాపు సామాజిక‌వ‌ర్గం నుంచి ప‌వ‌న్ అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచి బీసీల కొత్త పార్టీ కోసం తెర‌వెనుక క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. ఇటీవ‌ల తిరుప‌తి, విశాఖ‌, విజ‌య‌వాడ కేంద్రంగా కీల‌క బీసీ లీడ‌ర్ల సమావేశం కూడా నిర్వ‌హించారు. కొత్త పార్టీ పెట్టేందుకు చ‌రిష్మా ఉన్న అధినేత కోసం అన్వేష‌ణ ప్రారంభించారు. స‌మాజ్ వాదీ పార్టీని ఏపీలో ప‌రిచ‌యం చేయాల‌ని కూడా ఒకానొక సంద‌ర్భంలో బీసీ నేత‌లు చ‌ర్చించుకున్నార‌ని టాక్‌. కానీ, ఇప్పుడు బ్ర‌ద‌ర్ అనిల్ సీన్లోకి రావ‌డంతో బీసీ నేత‌లు ఆయ‌న‌తో జ‌ర్నీ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు.గ‌త ఎన్నిక‌ల్లో క్రిస్టియానిటీ ఓటు బ్యాంకును సాలిడ్ గా వైసీపీ వైపు మ‌ళ్లించ‌డంలో అనిల్ పాత్ర కీల‌కంగా ఉంద‌ని ఆ పార్టీ వ‌ర్గాలకు తెలుసు. ఏపీలోని 80శాతం మంది ద‌ళితులు క్రిస్టియానిటీని స్వీక‌రించార‌ని ఒక అంచ‌నా. వాళ్ల‌ను ఆక‌ర్షించే అనిల్ మైనార్జీలు, బీసీల వైపు ఎందుకు చూస్తున్నాడు? అనేది పెద్ద ప్ర‌శ్న‌. సాధార‌ణంగా క్రిస్టియ‌న్లు, ముస్లిం మైనార్టీలు ఒక వేదిక‌పై క‌ల‌వ‌డం చాలా అరుదు. ఇక వెనుబడిన వ‌ర్గాలు, క్లిస్టియ‌న్లు వేర్వేరు పంథాల్లో ఉంటారు. బీసీలు ఎక్కువ‌గా కృష్ణుడు, రాముడు ఆరాధ‌కులు. ఇలాంటి ఆరాధ‌న‌కు బ‌ద్ద వ్య‌తిరేకంగా క్రిస్టియ‌న్ల వ్య‌వ‌హారం ఉంటుంది. పైగా మ‌త మార్పిడుల‌ను బీసీలు అనుమ‌తించ‌రు. ఇలాంటి ప‌రిస్థితుల్లో క్రిస్టియ‌న్ల‌కు ప్ర‌తినిధిగా ఫోక‌స్ అయిన బ్ర‌ద‌ర్ అనిల్ మైనార్టీలు, బీసీ లీడ‌ర్ల‌తో భేటీల వెనుక ఉన్న ఆంత‌ర్యం ఏమిటి? అనేది పెద్ద‌ ప్ర‌శ్న.

2019 ఎన్నిక‌ల వ‌ర‌కు వెనుబ‌డిన వ‌ర్గాలు మోజార్టీ భాగం తెలుగుదేశం ప‌క్షాన ఉండేవ‌ని అంచ‌నా. కానీ, కాపుల రిజ‌ర్వేష‌న్ కు చంద్ర‌బాబు మ‌ద్ధ‌తు ఇచ్చిన కార‌ణంగా బీసీలు ఆ పార్టీకి దూరం అయ్యారు. ఆ రిజ‌ర్వేష‌న్ ను ప‌రోక్షంగా వ్య‌తిరేకించిన జ‌గ‌న్ వైపు బీసీలు మ‌ళ్లారు. ఫ‌లితంగా టీడీపీ కేవ‌లం 23 స్థానాల‌కు ఏపీలో పరిమితం అయింది. ఇక క్రిస్టియ‌న్లు, మైనార్టీల ఓటు బ్యాంకును 2019 ఎన్నిక‌ల్లో వైసీపీ బాగా సానుకూలంగా మ‌లుచుకుంది. అందుకు బ్ర‌ద‌ర్ అనిల్ పోషించిన పాత్ర కీల‌కం.మైనార్టీలు, క్రిస్టియ‌న్లు, బీసీల‌తో కూడిన ఒక పార్టీని పెట్టాల‌ని అనిల్ ఆలోచ‌న‌ట‌. అదే, జ‌రిగితే…జ‌గ‌న్ ఓటు బ్యాంకు బ‌ద్ల‌లుగా చీలిపోతుంద‌ని అంచ‌నా. కుటుంబ విభేదాల కారణంగా జ‌గ‌న్ ను రాజ్యాధికారం నుంచి త‌ప్పించాల‌ని బ్ర‌ద‌ర్ అనిల్‌, ష‌ర్మిల్ ల‌క్ష్యంగా ఎంచుకున్నార‌ని వాళ్ల‌ అనుచ‌రుల భావ‌న‌. అందుకే, వైఎస్ ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించిన ష‌ర్మిల స‌హ‌జ స్నేహితులుగా ఉన్న కేసీఆర్‌, జ‌గ‌న్ మ‌ధ్య చిచ్చు రేపింద‌ట‌. ఏపీలో పార్టీ పెట్ట‌డం ద్వారా జ‌గ‌న్ సీఎం ప‌ద‌విని స‌వాల్ చేయాల‌ని బ్ర‌ద‌ర్ భావిస్తున్నాడ‌ట‌. ఆ మేర‌కు బీసీలు, మైనార్టీ, ఎస్సీల‌తో భేటీ అయిన సంద‌ర్భంగా సంకేతాలు ఇచ్చార‌ట‌. ఇప్పుడు తాజాగా బీసీ కార్డ్ ను బ‌య‌ట‌కు తీసిన అనిల్ ప్ర‌స్తుతం జ‌గ‌న్ వెంట ఉన్న బీసీల‌ను త‌మ‌వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారు. రాజ‌కీయ పార్టీ పెట్ట‌డం ఈజీ కాదంటూనే బీసీ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిత్వాన్ని అనిల్ తెర‌మీద‌కు తీసుకొచ్చాడు. త్వ‌ర‌లోనే పార్టీ పెట్టే అంశంపై స్ప‌ష్ట‌త ఇస్తానంటూ మీడియాకు చెబుతున్నాడు. ఇప్ప‌టికే చ‌ర్చిల్లో తొలి విడ‌త స‌మావేశాలు పెట్టిన అనిల్ రాజ‌కీయంగా ప‌రిజ్ఞానం సంపాదించ‌డం కోసం మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తో భేటీ అయిన విష‌యం విదిత‌మే . ఆ త‌రువాత బీసీ, మైనార్టీ, ఎస్సీల లీడ‌ర్ల‌లో స‌మావేశం నిర్వ‌హించ‌డం ద్వారా కొత్త పార్టీ ఆవిర్భావాన్ని మ‌రింత దూకుడుగా ముందుకు తీసుకెళుతున్నాడు. అందుకోసం విశాఖ‌లో సోమ‌వారం నిర్వ‌హించిన బీసీ, ఎస్టీ, ఎస్సీ , మైనార్టీ లీడ‌ర్ల స‌మావేశంలో ముద్ర‌గ‌డ త‌ర‌హాలో బీసీ కార్డ్ ను ప్లే చేయ‌డం బ్ర‌ద‌ర్ అనిల్ ఎత్తుగ‌డ‌ల్లోని హైలెట్ పాయింట్.