Bayya Sunny Yadav : ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్ (Bayya Sunny Yadav) మరోసారి వార్తల్లోకెక్కాడు. కొద్ది రోజుల క్రితం పాకిస్తాన్‌కు బైక్‌పై వెళ్లిన విషయం తెలిసిందే. యుద్ధ పరిస్థితుల మధ్య అతడు అక్కడికి వెళ్లడంతో ఎన్ఐఏ (NIA) అధికారులు అతన్ని విచారించారు. అప్పట్లో ఈ వ్యవహారం పెద్ద దుమారమే రేపింది. విచారణ అనంతరం సన్నీ కొన్నాళ్లు మౌనంగా ఉండగా, ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు.
తాజాగా అతడు సింహాచలం (Simhachalam) లో ల్యాండ్ అయినట్టు వీడియో షేర్ చేస్తూ, ఓ సెన్సేషనల్ పోస్ట్ చేశాడు. “నేను ఎప్పటికే ఏపీకి వచ్చేసాను… సింహాచలంలో ల్యాండ్ అయ్యాను… ఇప్పుడు చూద్దాం రా!” అంటూ, పరోక్షంగా “నా అన్వేషణ (Naa Anveshana)” యూట్యూబర్ అన్వేష్‌ను టార్గెట్ చేశాడు. అంతే కాదు, “అతి త్వరలోనే వైజాగ్ (Vizag) వస్తున్నాను… మీ ఇంటికి కూడా వస్తాను… మీ అమ్మ నాన్నకు కూడా ధైర్యంగా చెబుతాను..!” అంటూ స్పష్టం చేస్తూ పోస్టు చేశాడు.
ఇది కేవలం పోస్టుతోనే కాదు. ఎయిర్ ఇండియా విమానం ఎక్కుతున్న వీడియోను, అలాగే సింహాచలం చేరుకున్నప్పుడు తీసిన విజువల్స్‌ను కూడా సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ పోస్ట్ ద్వారా అన్వేష్‌కు కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశాడు సన్నీ. “నువ్వేమైనా టెన్షన్ పడుతున్నావా? పర్లేదు, ధైర్యంగా ఉండు” అన్నట్లుగా సవాల్ విసిరాడు.
ఇటీవల సన్నీ యాదవ్ పాకిస్తాన్ ట్రిప్ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఇది మళ్లీ వివాదాలకు తెర తీసే అవకాశం ఉంది. ఇప్పటికే యూట్యూబ్‌లో ఈ పోస్ట్ వైరల్ అవుతోంది. పాకిస్తాన్ టూర్ తర్వాత కొద్దిరోజులు కనిపించని సన్నీ, ఈ విధంగా హఠాత్తుగా తిరిగి సోషల్ మీడియాలోకి రావడం విశేషంగా మారింది. ఈ వ్యవహారం ఇంకా ఎటు మలుపుతీసుకుంటుందో చూడాలి..
Honeymoon Murder Case : మేఘాలయలో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్.. కీలక విషయాలు వెలుగులోకి