ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం (AP Govt) టూరిజం అభివృద్ధి(Tourism Development)ని దృష్టిలో ఉంచుకొని కీలక నిర్ణయం తీసుకుంది. బార్ల లైసెన్స్ ఫీజులను (Bar License fees) మరియు నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీలను గణనీయంగా తగ్గించింది. బార్ల లైసెన్స్ తీసుకోవాలంటే ఇప్పటివరకు భారీ మొత్తాలు చెల్లించాల్సి వచ్చేది. తాజాగా తీసుకున్న నిర్ణయం ప్రకారం.. బార్ లైసెన్స్ ఫీజు రూ.5 లక్షలుగా నిర్ణయించారు. దీనితో పాటు, ఇతర రుసుముల్లో కూడా పెద్ద ఎత్తున కోత విధించారు.
Danger From The Himalayas: హిమాలయాల నుండి పొంచి ఉన్న ప్రమాదం?
3, 5 స్టార్ హోటళ్లకు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఊరట కల్పించింది. ఇప్పటివరకు ఈ హోటళ్ల రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ.66 లక్షలుగా ఉండగా, ఇప్పుడు వాటిని రూ.25 లక్షలకు తగ్గించారు. అలాగే నాన్ రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.20 లక్షలుగా పేర్కొన్నారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలో కొత్త బార్లు, హోటళ్ల ఏర్పాటు మరింత సులభం కావడంతోపాటు, టూరిజం రంగం వేగంగా అభివృద్ధి చెందే అవకాశముందని భావిస్తున్నారు.
ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 1 నుంచి అధికారికంగా అమలులోకి రానున్నాయి. ఈ విషయాన్ని ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా స్పష్టంగా ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో రాష్ట్రంలో పెట్టుబడులు పెరగడమే కాకుండా, టూరిస్టులకు మెరుగైన సేవలు అందించేందుకు అవకాశాలు ఎక్కువయ్యేలా మారుతుంది. టూరిజం రంగంలో నూతన అధ్యాయం ప్రారంభం కాబోతోందని అధికార వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.