ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జనసేన నేత నాగబాబు (Nagababu) ఇటీవల పిఠాపురంలో చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) విజయం వెనుక ఎవరైనా ఉన్నారని భావిస్తే, అది వారి ఖర్మ (Kharma) అంటూ ఆయన వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ వర్గాలు, వర్మ మద్దతుదారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ప్రముఖ నిర్మాత, పవన్ అభిమానిగా పేరున్న బండ్ల గణేష్ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.
Malavika Mohanan : మీరు వర్జినేనా..? ప్రభాస్ హీరోయిన్ ఏ సమాధానం చెప్పిందంటే !
బండ్ల గణేష్ (Bandla Ganesh) ఎవరినీ ప్రత్యక్షంగా ఉద్దేశించకుండానే చేసిన ట్వీట్ ఇప్పుడు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. “కృతజ్ఞత లేకుండా బతకడం మానవత్వాన్ని కోల్పోవడమే. ద్రోహంతో బతకడం మనుష్యత్వాన్ని నాశనం చేసుకోవడమే” అంటూ గణేష్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పేర్కొన్నారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఇది నాగబాబును ఉద్దేశించిన ట్వీట్ అని అంటుండగా, మరికొందరు ఇది వేరేవారికైనా అవ్వొచ్చు కదా అని వాదిస్తున్నారు.
గతంలో బండ్ల గణేష్.. నాగబాబును భోలా నాగేంద్రుడిగా ప్రశంసించారు. కానీ ఇప్పుడు ఆయన చేసిన ట్వీట్ వర్మ మద్దతుదారుల చేత వైరల్ అవుతోంది. బండ్ల గణేష్, మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి కావడంతో ఈ ట్వీట్ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏంటనే దానిపై అనేక ఊహాగానాలు నడుస్తున్నాయి. ఏదేమైనా ఈ ట్వీట్ ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీస్తోంది. దీనిపై బండ్ల గణేష్ స్పందిస్తారో.. లేదో చూడాలి.