Site icon HashtagU Telugu

Bandla Ganesh: ఏపీ సీఎం కు బండ్ల గణేష్ రిక్వెస్ట్..!

Bandla Ganesh Request To Ap Cm

Bandla Ganesh Request To Ap Cm

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం కోరారు టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh ). ఓ చిన్నారి ప్రాణాన్ని రక్షించాలని కోరారు. కడప జిల్లాకు చెందిన చిన్నారి అనారోగ్యంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది. వైద్యం చేయించేందుకు తన దగ్గర ఆర్థిక స్థోమత లేదని బాలిక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు.. ఈ విషయాన్ని తెలియజేస్తూ ట్విట్టర్ వేదికగా సాయం కోరాడు. ఈ విషయం తెలుసుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh) స్పందించారు. వైఎస్ జగన్, సీఎంలో ఉండే అధికారి హరికృష్ణను బండ్ల గణేష్ ట్యాగ్ చేశారు. అన్నా ప్లీజ్ ఆ పాప జీవితాన్ని కాపాడండి.. ఇది నా రిక్వెస్ట్ అంటూ కోరారు. నెటిజన్లు కూడా ఈ ట్వీట్‌పై స్పందించారు. ఆ బాలిక ప్రాణాలను కాపాడాలని కోరారు. అలాగే కొందరు సాయం చేయాలంటూ తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను కూడా కోరుతున్నారు.

తన కుమార్తెను బతికించండి అంటూ సీఎం జగన్‌ను తండ్రి కోరారు. హైదరాబాద్ కొండాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్సపొందుతోందని తెలిపారు. తనకు సాయం చేయమని కోరారు. ‘నా బిడ్డను కాపాడండి.. చాలా సీరియస్‌గా ఉంది. నా బిడ్డను బతికించండి.. నాది కడప అన్న..హోప్‌లెస్ అయ్యాను. రోజుకు లక్షన్నర అడుగుతున్నారు.. నా పరిస్థితి బాలేదన్నా. ఒక తండ్రిగా నా ఆవేదనను అర్ధం చేసుకోండి.. ఇప్పటి వరకు రెండు లక్షలు కట్టాను. ఇక హోప్ లెస్ అయ్యాను, నా బిడ్డను నాకు ఇవ్వరు డబ్బులు కట్టకపోతే’ అంటూ ఆ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. తాను వైఎస్ జగన్ అభిమానినని.. చేతిపై ఉన్న టాటూను కూడా చూపించారు.

Also Read:  TTD Alert: నేటి నుంచి ఆన్ లైన్ లో అకామిడేషన్ బుకింగ్.. ఇలా బుక్ చేసుకోండి