సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఫై మరోసారి తన అభిమాని , ప్రేమను వ్యక్తం చేసారు నిర్మాత బండ్ల గణేష్ (Bandla Ganesh). పవన్ కళ్యాణ్ అంటే గణేష్ కు ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అనేక సినిమా ఫంక్షన్లలో , సోషల్ మీడియా లలో గణేష్ వ్యక్తం చేయడం జరిగింది. గత కొద్దీ రోజులుగా సైలెంట్ గా ఉన్న గణేష్..మరోసారి పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎలాంటిదో చెప్పుకొచ్చారు.
ఏపీలో ఉన్న అధికార పార్టీ (YCP) నేతలు పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ ఏ ప్రశ్నలు వేసిన..ప్రభుత్వ లోపాలను బయటపెట్టిన..రాష్ట్రంలో ఇవి జరుగుతున్నాయి..కాస్త చూసుకోండని చెప్పిన..వాటిని వదిలేసి, పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Personal Life) పర్సనల్ లైఫ్ ఫై కామెంట్స్ చేస్తూ వస్తుంటారు. ముఖ్యంగా పవన్ మూడు పెళ్లిళ్లు (Pawan Kalyan 3 Marriages) చేసుకున్నాడని..అది ఒక్కటే ప్రతి సారి ప్రజలకు చెపుతూ వస్తుంటారు. ఈ మధ్య సీఎం జగన్ సైతం అదే మాటను పదే పదే అంటూ వస్తుండడం తో పలువురు స్పందిస్తున్నారు. తాజాగా గణేష్ సైతం జగన్ (CM Jagan)..పవన్ కళ్యాణ్ ఫై చేసిన ఆరోపణలపై స్పందించారు.
నిన్నటి నుంచి మనసులో వేదన కలిస్తోందన్న ఆయన, బాధ కలిగిస్తోందన్నారు. ఇప్పుడు మాట్లాడకపోతే తన బతుకు ఎందుకని, చిరాకు కలిగిస్తోందన్నారు. తనకు ఇష్టమైన, దైవ సమానుడైన పవన్ కల్యాణ్ గురించి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని అన్నారు. మీరు పెద్ద హోదాలో ఉన్నారని, భగవంతుడు మీకు అద్భుతమైన పొజిషన్ ఇచ్చాడని గుర్తు చేశారు. దశాబ్దాలుగా పవన్ కల్యాణ్ తో తిరుగుతున్నానని, ఆయన చాలా నిజాయితీ పరుడని, నీతిమంతుడని బండ్ల గణేష్ గుర్తు చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎవరు కష్టాల్లో ఉన్నా ముందుకెళ్లే వ్యక్తి, భోళా మనిషి పవన్ కల్యాణ్ అని అన్నారు. ఆయన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడారని, కొన్ని ఆయనకు తెలియకుండా జరిగిపోయాయని ,. పవన్ కల్యాణ్ సమాజానికి ఉపయోగపడే వ్యక్తని, దేశం కోసం బతుకుతున్న వ్యక్తని కొనియాడారు. స్వార్థం కోసం, స్వలాభం కోసం ఎవరితోనూ ఆయన ఎవరతోనూ మాట్లాడలేదన్నారు. షూటింగ్ లు చేసుకోమని, హాయిగా బతకమని చెప్పేవాడినన్నారు. మనం చచ్చిపోయినా జనం గుర్తు పెట్టుకోవాలని, జనానికి ఏదో చేయాలని తరిపించే వ్యక్తి పవన్ కల్యాణ్ అన్నారు. నిస్వార్థంగా జనం కోసం రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని, ఆయన సంపాదించిన సొమ్మును పార్టీ కోసం ఖర్చు చేస్తున్నారని గణేష్ చెప్పుకొచ్చారు.
పవన్ కల్యాణ్ కు కులపిచ్చి ఉంటే తనను నిర్మాతను చేసే వాడా అని ప్రశ్నించారు. తాను అనుభవిస్తున్న ఈ హోదా మొత్తం పవన్ కల్యాణ్ పెట్టిన భిక్షేనన్నారు. పవన్ కల్యాణ్ లాంటి మంచి వ్యక్తిని అబాండాలు వేయవద్దని బండ్ల గణేష్ కోరారు. ప్రస్తుతం గణేష్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబదించిన వీడియో సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.
Read Also : We’re now on WhatsApp. Click to Join.
Bandla Ganesh reacts to AP CM Jagan's comments against the personal life of Pawankalyan. pic.twitter.com/YXIGfgqn1h
— Satya (@YoursSatya) October 13, 2023