Site icon HashtagU Telugu

Bandi Sanjay : ఏపీలో బండి సంజయ్.. టీటీడీ కర్రల విధానంపై ఫైర్.. హిందువుల్లా ఆలోచించండి..

Bandi Sanjay

Bandi Sanjay

తెలంగాణ(Telangana) బీజేపీ(BJP) నేత, ఎంపీ బండి సంజయ్(Bandi Sanjay) తాజాగా నేడు ఏపీ విజయవాడ(Vijayawada)లో బీజేపీ తలపెట్టిన ‘ఓటర్ చేతన్ మహాభియాన్’ కార్యక్రమంలో వర్చువల్ పాల్గొన్నారు. ఏపీ పాలిటిక్స్ పై కూడా బీజేపీ ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ని రంగంలోకి దింపింది.

చిరుతల విషయంలో టీటీడీ(TTD) కర్రల విధానంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై బండి సంజయ్ కూడా స్పందిస్తూ టీటీడీ అధికారులు, వైసీపీ నాయకులపై ఫైర్ అవుతూ ఏపీలో హిందూ ఆలయాలపై జరుగుతున్న దాడుల్ని తీవ్రంగా విమర్శించారు.

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఏపీలో హిందూ మతంపై పెద్ద ఎత్తున దాడి జరుగుతోంది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తుల్లో అడగడుగునా ఆందోళన సృష్టిస్తూ భక్తులు రాకుండా చేస్తున్నారు. భక్తులను కాపాడలేక కర్రలిస్తారా?. వెంకటేశ్వర స్వామిని అవమానిస్తే పుట్టగతులుండవనే సంగతి గుర్తుంచుకోవాలి. కొత్తగా నియమితులైన టీటీడీ ఛైర్మన్ ఎవరు? ఆయన బిడ్డ పెళ్లి క్రైసవ ఆచార పద్దతిలో చేసిన మాట నిజం కాదా? నేను నాస్తికుడని ఆయన గతంలో చెప్పలేదా? ఆయన రాడికల్ కాదా? ఇంకా సిగ్గు లేకుండా తిరుమలలో అడవులున్న విషయమే తెల్వదని టీటీడీ ఛైర్మన్ చెబుతున్నాడు. మరి ఆయనకు పుష్ప సినిమా చూపించాలేమో అని తీవ్రంగా విమర్శించారు.

అలాగే.. నేను వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అప్పీల్ చేస్తున్నా. మీరు హిందువులుగా ఆలోచించండి. హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. దేవతా విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. ఒక మతానికే కొమ్ముకాస్తూ ఆ మతమే అధికారం చెలాయించాలని చూస్తున్నారు. వాటిని ఇంకెంత కాలం సహిస్తారు అని ఫైర్ అయ్యారు. మరి బండి సంజయ్ కామెంట్స్ పై వైసీపీ నాయకులు ఎవరన్నా స్పందిస్తారేమో చూడాలి.

 

Also Read : Raja Singh : గోషామహాల్ బీజేపీ అభ్యర్థి నేనే.. రాజాసింగ్..