Bandaru Satyanarayana : ఆసుపత్రిలో బండారు సత్యనారాయణమూర్తి

స్వగ్రామం వెన్నెలపాలెంలో ఉన్న సమయంలో బండారు సత్యనారాయణమూర్తి అనారోగ్యానికి గురయ్యారు

Published By: HashtagU Telugu Desk
Bandaru Hsp

Bandaru Hsp

టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి (Bandaru Satyanarayana Murthy) అస్వస్థతకు గురయ్యారు. బీపీ, షుగర్ లెవల్స్ పెరగడం (Increase in BP and sugar levels)తో ఆయనను విశాఖలోని ఓ ఆసుపత్రి (Hospital)లో చేర్పించారు. సత్యనారాయణ పెందుర్తి టికెట్ ఆశించగా.. పొత్తులో భాగంగా అక్కడ జనసేనకు టికెట్ ఖరారైంది. ఆ పార్టీ నుంచి పంచకర్ల రమేశ్ బాబు పోటీ చేస్తున్నారు. దీంతో సత్యనారాయణ మనస్థాపానికి గురయ్యారని తెలుస్తుంది. స్వగ్రామం వెన్నెలపాలెంలో ఉన్న సమయంలో బండారు సత్యనారాయణమూర్తి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో కుటుంబసభ్యులు వెంటనే ఆయన్ని విశాఖపట్నంలోని ఆస్పత్రికి తరలించారు. బండారు సత్యనారాయణ మూర్తి కుమారుడు అప్పలనాయుడు ఆసుపత్రి వద్ద వైద్యసేవలను పర్యవేక్షిస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఉమ్మడి విశాఖ జిల్లాలో టీడీపీ పేరు చెప్తే గుర్తుకువచ్చే ముఖ్యమైన నేతలలో బండారు సత్యనారాయణ మూర్తి ఒకరు. 1985 నుంచి బండారు టీడీపీలో పనిచేస్తున్నారు. పరవాడ నియోజకవర్గం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికైన సత్యనారాయణ మూర్తి.. మంత్రిగానూ వ్యవహరించారు. ఉత్తరాంధ్రలో టీడీపీ పార్టీ కీలకనేతగా ఎదిగారు. 2004లో పరవాడలో గండి బాబ్జీ చేతిలో ఓడిపోయిన ఆయన.. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009లో పెందుర్తి నుంచి పోటీ చేశారు. అయితే అప్పటి ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు చేతిలో ఓడిపోయారు. 2014లో టీడీపీ నుంచి మరోసారి గెలిచిన బండారు.. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి అదీప్ రాజు చేతిలో ఓటమి పాలయ్యారు. ఇక ఇప్పుడు మరోసారి బరిలోకి దిగి విజయం సాధించాలని అనుకున్నారు కానీ పొత్తులో భాగంగా ఈ టికెట్ జనసేన కు వెళ్ళిపోయింది. దీంతో బండారు..అధిష్టానం ఫై అసంతృత్తి తో ఉన్నారు. ఇదే క్రమంలో ఈయన వైసీపీ లో చేరబోతున్నారనే వార్తలు కూడా తాజాగా బయటకు వచ్చాయి. కానీ ఇప్పుడు ఈయన అనారోగ్యానికి గురై హాస్పటల్ లో చేరారు.

Read Also : Vote Without Voter ID Card: ఓట‌ర్ ఐడీ కార్డ్ లేకుండా ఓటు వేయొచ్చు..? ఎలాగంటే..!

  Last Updated: 24 Mar 2024, 04:36 PM IST