జనసేన ఆవిర్భావ (janasena Formation Day) సభలో బాలినేని శ్రీనివాసరెడ్డి (Balineni Srinivas Reddy) చేసిన వ్యాఖ్యలు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. తాను పవన్ కళ్యాణ్‌ను పదవుల కోసం అడగలేదని, కానీ ఒక సినిమా (Movie) అవకాశం మాత్రమే కోరినట్లు ఆయన తెలిపారు. పవన్ కూడా దీనికి అంగీకరించినట్లు బాలినేని వెల్లడించారు. అయితే ఇదంతా సులభమని భావించలేం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి స్థాయిలో తలమునకలై ఉన్నారు. జనసేన పార్టీని బలోపేతం చేయడంతో పాటు పొత్తుల వ్యవహారాలు, 2024 ఎన్నికల హామీలు ఇలా అన్నీ ఆయనపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త సినిమా కమిట్ అవుతారనే అంశం సందేహాస్పదంగా మారింది.
Minister Lokesh: ఇళ్లు లేని వారికి ఇళ్లు నిర్మించి ఇస్తాం.. మంత్రి లోకేష్ కీలక ప్రకటన
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఇప్పటికే హరిహరవీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ వంటి సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. వీటి చిత్రీకరణ కోసం ఆయన తగినంత సమయం కేటాయించలేకపోతున్నారు. ఇవే వాయిదా పడుతున్న పరిస్థితుల్లో, కొత్త సినిమా ప్రారంభించటం దాదాపుగా అసాధ్యమే. హరిహరవీరమల్లు చిత్రానికి సెకండ్ పార్ట్ కూడా ఉండటంతో మరిన్ని డేట్లు అవసరం అవుతాయి. దీంతో కొత్త సినిమా ఒప్పుకునే ఛాన్స్ లేదని ఫిక్స్ అవొచ్చు. ఇదిలా ఉంటె జగన్ మోహన్ రెడ్డి పై కూడా బాలినేని తీవ్ర వ్యాఖ్యలు చేసారు. జగన్ తన ఆస్తులను కాజేశారని, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నానని చెప్పకనే చెప్పారు.