YSRCP: ట్రెండింగ్ పాలిటిక్స్.. బాలినేని అవుట్..?

  • Written By:
  • Updated On - March 12, 2022 / 07:35 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కేబినెట్ విస్త‌ర‌ణ పై కొద్ది రోజులుగా జోరుగా చ‌ర్చ జ‌ర‌గుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తాజాగా శుక్ర‌వారం ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న‌ కేబినెట్ మీటింగ్ జ‌రిగింది. ఈ స‌మావేశంలో భాగంగా మంత్రివ‌ర్గ పుర‌ర్‌వ్య‌వ‌స్థీక‌రణ అంశం పై ప్ర‌స్తావ‌న వ‌చ్చిన‌ట్టు స‌మాచారాం. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ మాట్లాడుతూ మంత్రివర్గాన్ని రెండున్నరేళ్ల తర్వాత పునర్‌వ్యవస్థీకరిస్తానని ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడే చెప్పామని జ‌గ‌న్ గుర్తు చేశారు.

ఈ నేప‌ధ్యంలో కేబినెట్​లో ఉన్న వారికి వేరే బాధ్యతలు అప్పగిస్తామ‌ని, మిగతా వారిని మంత్రివర్గంలోకి తీసుకొస్తామని జ‌గ‌న్ వ్యాఖ్యానించిన‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఇక కేబినెట్ రేసులో చాలా మంది ఉన్నారని సీఎం జగన్ అన్నారని తెలుస్తోంది. మంత్రివర్గంలో చోటు ద‌క్క‌నంత మ‌త్రాన వారిని పక్కన పెట్టినట్లు భావించొద్దని జ‌గ‌న్ చెప్పారు. మళ్లీ గెలిచి వస్తే మంత్రులుగా ఉండేది మీరేనని, పదవి నుంచి తప్పించిన వారికి జిల్లా ఇంచార్జ్ బాధ్యతలు ఇవ్వనున్నట్లు జ‌గ‌న్ పేర్కొన్నారు.

ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న వారు, కొత్త మంత్రివ‌ర్గం లిస్ట్‌లో ఉంటారని జ‌గ‌న్ స్పష్టం చేశారు. ఈనెల 15న వైఎస్సార్​సీఎల్పీ భేటీ కానుంది. అయితే సమావేశంలో కేబినెట్ విస్తరణపై పూర్తిస్థాయిలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం మేరకు తెలుస్తోంది. మొత్తంగా కేబినెట్ విస్తరణపై సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స్పందించ‌డంతో అధికార పార్టీ సభ్యుల్లో ఆశలు రేపుతోంది. అయితే కొత్త మంత్రుల ఎంపిక‌కు సంబంధించి, పార్టీ అధిష్టానం ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేశారని సమాచారం.

ఇక మ‌రోముఖ్యమైన విష‌యం ఏంటంటే మంత్రి బాలినేని శ్రీనివాస రావుకు జ‌గ‌న్ షాక్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణం, శాస్త్ర సాంకేతిక శాఖల్లో మంత్రిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న బాలినేని శ్రీనివాస రెడ్డికి కొత్త కేబినెట్‌లో బాలినేనికి జ‌గ‌న్ ఛాన్స్ ఇవ్వ‌లేద‌ని తెలుస్తోంది. ప్ర‌కాశం జిల్లాలోని సొంత‌నియోజ‌క‌వ‌ర్గ‌మైన ఒంగోలులో బాలినేని శ్రీనివాస‌రెడ్డిపై తీవ్ర‌స్థాయిలో వ్య‌తిరేక‌త ఏర్ప‌డింది. దీంతో ఈ విష‌యంపై జ‌గ‌న్, బాలినేని పై జ‌గ‌న్ సీరియ‌స్ అయ్యార‌ని వైసీపీ వ‌ర్గీయులే చెబుతున్నారు. ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న వారు, కొత్త మంత్రివ‌ర్గం లిస్ట్‌లో ఉంటార‌ని జ‌గ‌న్ ఇప్ప‌టికే చెప్పారు. అయితే వైఎస్ కుటుంబాని బాలినేని ద‌గ్గ‌రి బంధువు అయినా, జ‌గ‌న్ న‌యా కెబినెట్‌లో బాలినేని శ్రీనివాస‌రెడ్డికి చోటు క‌ల్పించ‌లేద‌ని తెలుస్తోంది. దీంతో బాలినేని మినిస్ట‌ర్ ప‌ద‌వి అవుట్ అంటూ రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.