Balineni : పవన్ డైలాగ్ తో ఉపిరిపీల్చుకున్న బాలినేని అభిమానులు

Balineni : పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో బాలినేనికి తాత్కాలిక ఊరట లభించినా, అసలు రాజకీయ ప్రయోజనం కలగాలంటే కూటమి పార్టీల మధ్య పూర్తి సమన్వయం అవసరం.

Published By: HashtagU Telugu Desk
Balineni Srinivasa Reddy Ja

Balineni Srinivasa Reddy Ja

వైసీపీ నుంచి బయటకు వచ్చి జనసేనలో చేరిన బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) భవిష్యత్తు ఏంటా? అనే సందేహాలు ఆయన అనుచరుల్లో గట్టిగా వినిపించేవి. జనసేనలో ఆయనకు సరైన గుర్తింపు దక్కలేదన్న అభిప్రాయాలు కూడా వచ్చాయి. అయితే తాజాగా మార్కాపురం సభలో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) స్వయంగా బాలినేని పేరును ప్రస్తావిస్తూ, ఆయన తనకు ఆత్మీయుడని, రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని పొగడడంతో బాలినేనికి పెద్ద బూస్ట్ గా మారింది. ఇదే సమయంలో పవన్ చెప్పిన కొన్ని వ్యాఖ్యలు కూటమి పార్టీల మధ్య ఉన్న వ్యత్యాసాలను సర్దుబాటు చేయాలనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.

Gold Prices: మ‌గువ‌ల‌కు శుభ‌వార్త‌.. తెలుగు రాష్ట్రాల్లో భారీగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు!

అయితే ఈ పరిణామాల నేపథ్యం చూస్తే.. ఒంగోలు ప్రాంతంలో బాలినేని పరిధిలో టీడీపీ నాయకుల అసహనం ఇప్పటికీ కొనసాగుతున్నది. గతంలో అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ నాయకులను బాలినేని ఇబ్బంది పెట్టారని వారు అభిప్రాయపడుతున్నారు. ఈ కారణంగా ఆయనతో కలిసి పని చేయలేమని తేల్చి చెబుతున్నారు. ముఖ్యంగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల తన స్పష్టమైన వ్యతిరేకతను ఇప్పటికే తెలియజేశారు. ఈ పరిస్థితుల్లో కూటమిలో బాలినేని పాత్ర ఏమిటనేది ఇంకా అనిశ్చితంగానే ఉంది. ఆయనకు ఎమ్మెల్సీ పదవి వస్తుందన్న ప్రచారం వినిపించినా, ఇప్పటి వరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

DalaiLama: దలైలామా వారసుడిని ఎంపిక చేసే విషయంలో ఉద్రిక్తత, ఎలా ఎంపిక చేస్తారు?

మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలతో బాలినేనికి తాత్కాలిక ఊరట లభించినా, అసలు రాజకీయ ప్రయోజనం కలగాలంటే కూటమి పార్టీల మధ్య పూర్తి సమన్వయం అవసరం. పవన్ చేసిన సూచనలు టీడీపీ నాయకులు పాటిస్తారా? లేక తన అనుభవంతో, నిష్కల్మషమైన రాజకీయ నడకతో బాలినేనే అందరినీ ఒప్పించగలరా? అన్నది ఆసక్తికరంగా మారింది.

  Last Updated: 05 Jul 2025, 11:45 AM IST