Site icon HashtagU Telugu

Balineni Srinivasa Reddy : ఈసారి ఎన్నికలు అంత ఈజీ గా ఉండవంటున్న వైసీపీ ఎమ్మెల్యే

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు (Telugu States ) రాబోతున్నాయి. నవంబర్ నెలలో తెలంగాణ ఎన్నికల పోలింగ్ (Telangana Elections) జరిగితే, మర్చి , ఏప్రిల్ నెలలో ఏపీలో ఎన్నికలు (AP Elections) రాబోతున్నాయి. ఈసారి ఎన్నికలు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాల టఫ్ గా ఉండబోతున్నాయి. తెలంగాణ లో అధికార పార్టీ vs కాంగ్రెస్ (BRS vs Congress) గా ఉంటె , ఏపీలో వైసీపీ vs జనసేన టీడీపీ (YCP vs TDP Janasena) మధ్య భారీ పోటీ నెలకొని ఉంది.

ఇదే విషయాన్నీ తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి (Balineni Srinivasa Reddy) చెప్పుకొచ్చారు. ఏపీలో ఈసారి జరిగే ఎన్నికలు అంత ఈజీగా వుండవని, తాము కూడా గట్టిగానే పోరాడుతామన్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న బాలినేని.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

We’re now on WhatsApp. Click to Join.

ప్రకాశం జిల్లా ప్రజలంతా మాగుంట కుటుంబానికి అండగా నిలబడాలన్నారు. ఏ సమస్య వచ్చినా మాగుంట మౌనంగా వుంటూ ఈజీగా తీసుకుంటున్నారని శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈసారి జరిగే ఎన్నికలు అంత ఈజీగా వుండవని, తాము కూడా గట్టిగానే పోరాడుతామని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల కోసం మాగుంట కుటుంబం వారి సొంత డబ్బును ఖర్చు చేస్తోందని,. ఈ ఎన్నికల్లో మాగుంట ఉంటారో, ఆయన కుమారుడు ఉంటారో వారే నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎప్పుడూ లేనటువంటి ఇబ్బందులను తమ కుటుంబం ఇప్పుడు ఎదుర్కొంటోందని , క్లిష్ట పరిస్థితుల్లో తమ కుటుంబానికి అండగా నిలిచిన నేతలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు.

Read Also : Kunja Satyavathi : అర్ధరాత్రి ఆకస్మిక గుండెపోటు.. మాజీ ఎమ్మెల్యే హఠాన్మరణం!