Balineni : సాయిరెడ్డికి ప‌వ‌ర్స్, బాలినేనికి క‌ళ్లెం! టీడీపీ ఎంపీ ఆఫ‌ర్?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి(Balineni) ప‌వ‌ర్స్ క‌ట్ చేశారు. స‌మీప బంధువు అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజీప‌డ‌లేదు.

  • Written By:
  • Publish Date - May 9, 2023 / 05:39 PM IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి(Balineni) ప‌వ‌ర్స్ క‌ట్ చేశారు. స‌మీప బంధువు అయిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి రాజీప‌డ‌లేదు. రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ గా రాజీనామా చేసిన బాలినేనికి బ‌దులుగా విజ‌య‌సాయిరెడ్డిని(Vijaya sai Reddy)  నియ‌మించారు. ఇప్ప‌టి వ‌ర‌కు మూల‌న‌ప‌డేసిన విజ‌య‌సాయిరెడ్డికి మ‌ళ్లీ ప‌వ‌ర్స్ ఇచ్చార‌ని పార్టీ వ‌ర్గాల్లోని టాక్‌. ఇటీవ‌ల బాలినేని రాజీనామా చేసిన ప్ర‌కాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల ఆ ఆర్డినేట‌ర్ ప‌ద‌విని విజ‌య‌సాయిరెడ్డిని వ‌రించింది.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డికి ప‌వ‌ర్స్ క‌ట్ (Balineni)

తాజాగా ప‌రిణామాన్ని గ‌మ‌నిస్తే ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో బాలినేని శ్రీనివాస‌రెడ్డి (Balineni) వ్య‌వ‌హారం వైసీపీకి మైన‌స్ గా క‌నిపిస్తోంది. ఆ లోటును భ‌ర్తీ చేయ‌డానికి ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న విజ‌య‌సాయిరెడ్డిని(Vijayasai Reddy) రంగంలోకి దింపారు. ఇక అక్క‌డ వేగంగా మార్పులు జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది. స్వ‌త‌హాగా టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య గ్యాప్ ఉందని వైసీపీ వ‌ర్గాల్లోని వినికిడి. ఇటీవ‌ల కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేసిన బాలినేని, సుబ్బారెడ్డి న‌డుమ గ్యాప్ పెరిగింది. ఫ‌లితంగా బాలినేని రాజీనామా చేసిన విష‌యం స‌ర్వ‌త్రా తెలిసింది. అయితే, ఇప్పుడు శ‌త్రువు శ‌త్రువు మిత్రుడి మాదిరిగా బాలినేని, విజయసాయిరెడ్డి ఒక‌టి కానున్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లోని టాక్‌.

టీటీడీ చైర్మ‌న్ సుబ్బారెడ్డి, విజ‌య‌సాయిరెడ్డి మ‌ధ్య గ్యాప్

ఉత్త‌రాంధ్ర బాధ్య‌త‌లు తీసుకున్న సుబ్బారెడ్డి(Subba Reddy), సొంత జిల్లా ప్ర‌కాశం మీద ప‌ట్టు కోసం ప్ర‌య‌త్నించారు. ఆ క్ర‌మంలో బాలినేని(Balineni), సుబ్బారెడ్డి మ‌ధ్య గ్యాప్ వ‌చ్చింది. ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డికి అక్క‌డి ఇంచార్జి బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డంతో సుబ్బారెడ్డి హ‌వాకు చెక్ ప‌డే ఛాన్స్ ఉంది. ఈ ప‌రిణామం బాలినేని శ్రీనివాస‌రెడ్డికి కొంత ఊర‌ట‌. అయిన‌ప్ప‌టికీ జిల్లా మొత్తం పెత్త‌నం చేసిన బాలినేని ఇప్పుడు ఒంగోలు వ‌ర‌కు ప‌రిమితం కావాల్సి ఉంటుంది. ఆ అసంతృప్తి నుంచి బ‌య‌ట‌కు వ‌స్తే వైసీపీ త‌ర‌పున ఈసారి కూడా ఆయ‌న పోటీ చేసే అవ‌కాశం ఉంది. లేదంటే మాత్రం ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను చూసుకుంటార‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నార‌ని (Balineni)

తెలుగుదేశం పార్టీ వైపు ఆయ‌న(Balineni) చూస్తున్నార‌ని ఇటీవ‌ల బ‌లంగా వినిపిస్తోంది. గ‌త ఎన్నిక‌ల సంద‌ర్భంగా కూడా ఆయ‌న టీడీపీలోకి వ‌స్తున్నార‌ని విస్తృతంగా ప్ర‌చారం జ‌రిగింది. కానీ, వైసీపీ నుంచి పోటీ చేయ‌డమే కాకుండా ప్ర‌కాశం జిల్లా మొత్తం మీద ఆయ‌న పెత్త‌నం న‌డిచింది. ఇప్పుడు మారిన ప‌రిస్థితుల దృష్ట్యా ఆయ‌న వైసీపీలో ఇమ‌డ‌లేక‌పోతున్నార‌ని తెలుస్తోంది. మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించిన త‌రువాత ఆయ‌న అసంతృప్తిగా ఉన్నారు. అంతేకాదు, అదే జిల్లాకు చెందిన సురేష్ ను (Suresh)మంత్రిగా కొన‌సాగించ‌డాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. దీంతో అస‌మ్మ‌తి గ్రూప్ నుంచి ప‌లుమార్లు అవ‌మానాలు ఎదుర్కొన్నారు. పార్టీ మార‌తార‌న్న టాక్ బ‌లంగా వ‌చ్చింది. దానికి అనుగుణంగా కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంతో తాడేప‌ల్లి కోట‌రీ నుంచి పిలుపు వెళ్లింది. గ‌త వారం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) తో నేరుగా భేటీ అయ్యారు. ఐ ప్యాక్ ప్ర‌తినిధుల‌తోనూ స‌మావేశం అయ్యారు.

ఒంగోలు నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా దామ‌చ‌ర్ల జనార్థ‌న్

ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా ఆయ‌న(Balineni) మీద వ్య‌తిరేక‌త ఉంద‌ని ఐ ప్యాక్ స‌ర్వేలోని సారాంశం. ఆ విష‌యాన్ని స‌ర్వే ప్ర‌తినిధులు చెప్పార‌ట‌. ఆ త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని బాలినేని క‌లుసుకున్నారు. డీఎస్పీ నియామ‌కం విష‌యంలో అసంతృప్తి వ్య‌క్త‌ప‌ర‌చ‌గా, దాన్ని అప్ప‌టిక‌ప్పుడే స‌రిచేశారు. ఇక మిగిలిన విష‌యాల‌ను జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. దీంతో అసంతృప్తిగా తాడేప‌ల్లి కోట నుంచి వెళ్లిపోయారు. ఆ రోజు నుంచి టీడీపీలోకి బాలినేని వెళుతున్నార‌ని బ‌లమైన టాక్ న‌డిచింది. అయితే, ఒంగోలు నుంచి బ‌ల‌మైన అభ్య‌ర్థిగా దామ‌చ‌ర్ల జనార్థ‌న్(Damacharla Janardhan) టీడీపీకి ఉన్నారు. ఆయ‌న్ను కాద‌ని బాలినేనికి టీడీపీ టిక్కెట్ ఆఫ‌ర్ చేయలేదు. దీంతో ప్ర‌త్యామ్నాయంగా ఒంగోలు ఎంపీ స్థానాన్ని ఆఫ‌ర్ చేసిన‌ట్టు తెలుస్తోంది.

Also Read : Jagan : ఆహా జ‌గ‌న్ ఓహో జ‌గ‌న‌న్న‌..చెబుదాం రండి!

ఇటీవ‌ల జ‌న‌సేనకు చెందిన విశాఖ కార్పొరేట‌ర్ ఒక‌రు బాలినేని(Balineni) పెట్టుబ‌డుల మీద మీడియాకు ఎక్కారు. ఆ సంద‌ర్భంగా మైత్రీ మూవీస్ లో పెట్టుబ‌డుల‌ను ప్ర‌స్తావించారు. దీంతో సీన్లోకి ప‌వ‌న్ ను(Pawan kalyan) కూడా బాలినేని లాగారు. నేరుగా జోక్యం చేసిన ఆరోప‌ణ‌ల‌ను ప‌రిశీలించాల‌ని కోరారు. అప్ప‌టికే ప‌వ‌న్, బాలినేని మ‌ధ్య బ‌ల‌మైన సంబంధాలు ఉన్నాయ‌ని స‌ర్వ‌త్రా తెలుసు. ఆ చ‌నువుతో టీడీపీతో డీల్ ను సెట్ చేయ‌డానికి ప‌వ‌న్ ను బాలినేని ఆశ్ర‌యించిన‌ట్టు కూడా ప్ర‌చారం జ‌రిగింది. అందుకే, ఇటీవ‌ల ప‌వ‌న్ టీడీపీ అధినేత ఇంటికి వెళ్లార‌ని కూడా టాక్‌.

ఈ ప‌రిణామాల‌ను సునిశితంగా ప‌రిశీలించిన తాడేప‌ల్లి కోట వెంట‌నే ట్ర‌బుల్ షూట‌ర్ గా పేరున్న విజ‌య‌సాయిరెడ్డిని(Vijayasai Reddy) కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వి కోసం ఎంపిక చేసింది. దీంతో బాలినేని చాలా వ‌ర‌కు సంతృప్తి చెందుతార‌ని తాడేప‌ల్లి కోట ఈక్వేష‌న్‌. కానీ, టీడీపీ ఒంగోలు ఎంపీగా పోటీ చేసేందుకు డీల్ సెట్ అయింద‌ని మ‌రో వాద‌న కూడా బ‌లంగా ఉంది. మొత్తం మీద ఒంగోలు కేంద్రంగా బాలినేని రాజ‌కీయ భ‌విష్య‌త్ పై ర‌స‌వ‌త్త‌ర చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : Jagan:అవినాష్ ఔట్‌!తెర‌పై దుష్య‌త్ రెడ్డి,అభిషేక్ రెడ్డి?