Site icon HashtagU Telugu

Balineni Srinivasa Reddy : జనసేన లోకి బాలినేని..?

Balineni Srinivasa Reddy

Balineni Srinivasa Reddy

ఏపీలో మరో మూడు నెలల్లో ఎన్నికలు (AP Assembly Elections 2024) రాబోతున్నాయి. ఈ క్రమంలో మరోసారి సీఎం కుర్చీ దక్కించుకోవాలని జగన్ (Jagan) చూస్తున్నాడు..ఇదే క్రమంలో పార్టీ అభ్యర్థుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నియోజకవర్గంలో వ్యతిరేకత ఉన్న నేతలకు ఈసారి టికెట్ ఇచ్చేది లేదని తేల్చేసారు. ఇప్పటికే 11 నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ లను మార్చడం..పలువురికి టికెట్ ఇవ్వడం లేదని చెప్పడం చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ రాని నేతలంతా టీడీపీ , జనసేన (TDP-Janasena) వైపు చూస్తున్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఇక ఒంగోలు (Ongole) నుండి ఈసారి బాలినేని (Balineni Srinivasa Reddy)కి కాకుండా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాంకు టికెట్ ఇవ్వాలని జగన్ చూస్తున్నాడు. ఇదే విషయాన్నీ బాలినేని కి ఎంపీ విజయసాయి రెడ్డి చెప్పినట్లు సమాచారం. దీంతో బాలినేని జనసేన పార్టీ లో వెళ్లాలనే ఆలోచన చేస్తున్నాడట. ఇదే విషయాన్నీ తన కార్యకర్తలతో చర్చలు జరిపినట్లు వినికిడి. రాబోయే ఎన్నికల్లో టీడీపీ – జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఒంగోలు నుండి టీడీపీ అభ్యర్థి గా దామచర్ల జనార్ధన్ బరిలో ఉన్నాడు. ఇక్కడ దామచర్ల జనార్ధన్ కు మంచి పట్టుఉంది..మరి బాలినేని ..ఒకవేళ జనసేన లో చేరితే..దామచర్ల జనార్ధన్ పరిస్థితి ఏంటి..? ఆయన తప్పుకుంటారా లేదా..? చంద్రబాబు ను పవన్ ఒప్పించగలడా…? దామచర్ల జనార్ధన్ కు ఎంపీ టికెట్ ఏమైనా ఇస్తారా..? అనేది చూడాలి.

ఇక బాలినేని రాజకీయ ప్రస్థానం చూస్తే.. ఒంగోలు నియోజకవర్గం నుండి శాసన సభ్యునిగా 1999 నుండి 2014 వరకు ఐదు పర్యాయాలు వరుసగా గెలుపొందాడు. తరువాత 2014లో అదే నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా గెలుపొందాడు. 1999, 2004, 2009 లలో జరిగిన శాసనసభ ఎన్నికలలో కాంగ్రెస్ తరపున శాసనసభ్యునిగా గెలుపొందాడు. 2012లో జరిగిన ఉప ఎన్నికలో వైసీపీ పార్టీ తరపున పోటీ చేసి టిడిపి పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్థనరావుపై గెలుపొందాడు. 2014 ఏపీ శాసనసభ ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోయాడు.

Read Also : Jagan vs Chandrababu: జగన్‌కు ఓటమి భయం.. ఇంటికి సాగనంపడానికి సిద్దమైన ప్రజలు