Balineni : జ‌గ‌న్ పై `బాలినేని`ప‌వ‌రిజం, YCPకి బై?

జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత బంధువుల‌ను(Balineni) కూడా వ‌దులుకోవ‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు. ఐప్యాక్ ఇచ్చే స‌ర్వేల‌ను గుడ్డిగా న‌మ్ముకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - May 3, 2023 / 02:56 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి సొంత బంధువుల‌ను కూడా వ‌దులుకోవ‌డానికి సిద్ద‌ప‌డుతున్నారు. ఐప్యాక్ ఇచ్చే స‌ర్వేల‌ను గుడ్డిగా న‌మ్ముకుంటున్నారు. మాజీ మంత్రి ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డిని(Balineni) అందుకే దూరంగా పెట్టార‌ని తెలుస్తోంది. ప్ర‌త్యామ్నాయంగా ఆయ‌న టీడీపీ(TDP) వైపు చూస్తున్నార‌ని టాక్‌. లేదంటే, జ‌న‌సేన అభ్య‌ర్థిగా ఒంగోలు నుంచి పోటీకి దిగుతార‌ని మ‌రో ప్ర‌చారం కూడా లేక‌పోలేదు. ప్ర‌స్తుతం తాడేప‌ల్లి కోట‌రీలో నెల‌కొన్ని ప‌రిస్థితుల కార‌ణంగా ఆయ‌న వైసీపీకి(YCP) గుడ్ బై చెబుతార‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస‌రెడ్డి  వైసీపీకి గుడ్ బై (Balineni) 

నాలుగు రోజుల క్రితం బాలినేని శ్రీనివాస‌రెడ్డి (Balineni) వైసీపీ రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. ఆ విష‌యాన్ని తెలియ‌చేస్తూ తొలుత హ్యాష్ ట్యాగ్ యూ `తాడేప‌ల్లి కోట‌లో బీట‌లు` హెడ్ లైన్ తో సంచ‌ల‌న న్యూస్ ఇచ్చింది. దానికి కొన‌సాగింపుగా బాలినేని శ్రీనివాసరెడ్డి టీడీపీ(TDP) వైపు చూస్తున్నార‌ని తెలియ‌చేసింది. అందులో భాగంగా రెండు రోజుల క్రితం చంద్ర‌బాబునాయుడు(Chandrababu), ప‌వ‌న్ భేటీ జ‌రిగింద‌ని కూడా క్లూ ఇవ్వ‌డం జ‌రిగింది. ఇప్పుడు జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy) బుజ్జ‌గింపులు కూడా బాలినేనికి ప‌నిచేయ‌లేదు. ప్ర‌త్యామ్నాయ మార్గాల‌ను ఆయ‌న చూసుకుంటున్నార‌ని విశ్వ‌స‌నీయంగా తెలుస్తోంది.

టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి  ద్వారా నిఘా

ప్ర‌కాశం జిల్లా వైసీపీ రాజ‌కీయాన్ని తొలి నుంచి ఒంటిచేత్తో బాలినేని(Balineni) న‌డిపారు. అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి క్యాబినెట్లో కీ రోల్ పోషించారు. అక్క‌డ నుంచి ఆయ‌నకు త‌ల‌నొప్పి మొద‌ల‌యింది. తొలుత ఆయ‌న కారు స్టిక్క‌ర్ తో దొరికిన బంగారం స్మ‌గ్లింగ్ బ‌య‌ట ప‌డింది. ఆ త‌రువాత హ‌వాలా సొమ్మంటూ మ‌రో ఆరోప‌ణ ఆయ‌న్ను చుట్టుముట్టింది. ఒంగోలు కేంద్రంగా చేసుకుని వైశ్య సామాజిక‌వ‌ర్గంకు చెందిన సుబ్బారావు మీద బాలినేని అనుచ‌రులు దాడి చేసిన సంఘ‌ట‌న తాడేప‌ల్లిని సైతం క‌ల‌వ‌ర‌ప‌రిచింది. అప్ప‌టి నుంచి సొంత బావ, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) ద్వారా నిఘా పెట్టారు.

రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి  బాలినేని రాజీనామా

సీన్ క‌ట్ చేస్తే, క్యాబినెట్ ప‌ద‌వి బాలినేనికి (Balineni)ఊడింది. అప్ప‌టి నుంచి అడుగ‌డుగునా అవ‌మానాల‌ను భ‌రించ‌లేక‌పోతున్నాడు. తాజాగా ఒంగోలు డీఎస్పీ విష‌యంలో బావ‌, బావ‌మ్మ‌ర్దుల మ‌ధ్య వివాదం జ‌రిగింది. అక్క‌డ పోస్టింగ్ వైవీ సుబ్బారెడ్డికి(YV subba Reddy) చెప్పిన అధికారికి ఇచ్చారు. దీంతో రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి రాజీనామా చేశారు. పార్టీకి కూడా రాజీనామా చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న స‌మ‌యంలో తాడేప‌ల్లి నుంచి పిలుపు అందుకున్నారు. ఒంగోలు డీఎస్పీ ప‌ద‌విని బాలినేని చెప్పిన వాళ్ల‌కు ఇచ్చేలా సీఎంవో ఆఫీస్ సందేశం ఇచ్చింది. అయిన‌ప్ప‌టికీ ఆయ‌న కూల్ కాలేదు. ప్ర‌త్యామ్నాయ ప్ర‌య‌త్నాల్లో ఉన్నార‌ని తెలుస్తోంది.

ప‌వ‌న్, బాలినేని మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు (Balineni)

ఇటీవ‌ల మైత్రీ మూవీస్ లో పెట్టుబ‌డులు పెట్టార‌ని బాలినేని(Balineni) ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. వాటిని జ‌న‌సేన కార్పొరేట‌ర్ చేయ‌డం గ‌మ‌నార్హం. దీంతో మీడియా ముందుకొచ్చిన బాలినేని నేరుగా ప‌వ‌న్ దీనిపై స్పందించాల‌ని కోరారు. ఆ విధంగా ఆయ‌న విజ్ఞ‌ప్తి చేయ‌డానికి కార‌ణం లేక‌పోలేదు. ప‌లు సంద‌ర్భాల్లో బాలినేని సౌమ్ముడు, వివాద‌ర‌హితుడు అంటూ ప‌వ‌న్ ప్ర‌శంసించారు. వైసీపీ అంటేనే ఎగ‌సిప‌డే ప‌వ‌న్ (Pawan Kalyan) ఆ పార్టీకి చెందిన బాలినేని అంటే ప‌వ‌న్ కు గౌర‌వం. అందుకే, ప‌వ‌న్, బాలినేని మ‌ధ్య స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. అంతేకాదు, ప‌వ‌న్ ద్వారా టీడీపీలో చేర‌డానికి లాబీయింగ్ చేశార‌ని కూడా వినికిడి.

Also Read : Operation Balineni: CBN, PK భేటీ వెనుక ఆపరేషన్ ‘బాలినేని’..?

ప్ర‌స్తుతం టీడీపీ, జ‌న‌సేన పొత్తు దాదాపుగా ఖ‌రారు అయిన‌ట్టు ఇరు పార్టీల్లోని కీల‌క నేత‌లు భావిస్తున్నారు. సీట్ల పంపిణీ విష‌యంలోనూ ప‌వ‌న్, చంద్ర‌బాబు మ‌ధ్య ఒక అవ‌గాహ‌న ఉంద‌ని కూడా అంటున్నారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలోకి రావ‌డానికి బాలినేని(Balineni) ప్లాన్ చేస్తున్నార‌ని తెలుస్తోంది. అయితే, ప్ర‌కాశం జిల్లా పెత్త‌నం అప్ప‌గించాల‌ని ఒక ష‌ర‌తు పెట్టార‌ట‌. దానితో పాటు రాబోవు రోజుల్లో మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌ని మ‌రో కండీష‌న్ పెట్టార‌ని తెలుస్తోంది. ఆ విష‌యాల‌ను ప‌వ‌న్(Pawan Kalyan) ద్వారా చంద్ర‌బాబుకు చేర‌వేశాడ‌ని ఎన్టీఆర్ ట్ర‌స్ట్ వ‌ర్గాల్లోని చ‌ర్చ. పొత్తులో భాగంగా ఒంగోలును జ‌న‌సేన‌కు ఇవ్వాల‌ని బాలినేని కోసం ప‌వ‌న్ కోరిన‌ట్టు తెలుస్తోంది. ఇలాంటి చ‌ర్చ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికి కార‌ణాలు బోలెడు.

Also Read : Balineni : తాడేప‌ల్లి `మైత్రి`కి బీట‌లు, బాలినేని గుడ్ బై?

ఐప్యాక్ స‌ర్వేలో బాలినేని బాగా వెనుబ‌డ్డార‌ని రిపోర్ట్ ఉంద‌ట‌. అందుకే, ఆయ‌నకు టిక్కెట్ కూడా ఈసారి డౌట్ అంటూ వైసీపీ వ‌ర్గాల్లోని టాక్. ఆయ‌న స‌తీమ‌ణికి ఈసారి టిక్కెట్ ఇచ్చే అవ‌కాశం ఉంద‌ని కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. దానికి తోడు మంగ‌ళ‌వారం తాడేప‌ల్లికి బాలినేని వెళ్లిన‌ప్పుడు తొలుత ఆయ‌న‌తో ఐప్యాక్ ప్ర‌తినిధి రుషీసింగ్ భేటీ అయ్యార‌ట‌. రాబోవు ఎన్నిక‌ల్లో పోటీ చేస్తే ప‌రిస్థితి ఎలా ఉంటుంది? అనేదానిపై స‌ర్వేల సారాంశాన్ని చెప్పార‌ని స‌మాచారం. దీంతో ఐప్యాక్ (I Pack)మీద మండిప‌డ్డ బాలినేని ప్ర‌త్యామ్నాయ మార్గాల‌కు ఫిక్స్ అయ్యార‌ని తెలుస్తోంది. అంటే, ఆయ‌న వైసీపీకి గుడ్ బై చెప్పే రోజులు ద‌గ్గ‌ర‌ప‌డుతున్నాయ‌ని వినికిడి. ప్ర‌త్యామ్నాయంగా టీడీపీ(TdP) లేదా జ‌న‌సేన‌లోకి వెళ్ల‌తార‌ని ప్ర‌కాశం జిల్లా రాజ‌కీయాల్లో న‌డుస్తోన్న హాట్ టాపిక్.