Balineni : జ‌గ‌న్ పొలిటిక‌ల్ రివ్యూ, బాలినేని దారెటు?

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni) ఇటీవ‌ల న్యూస్ మేక‌ర్ గా మారారు. ఆయన‌కు సీఎంవో ఆఫీస్ నుంచి బుధ‌వారం ఫోన్ వ‌చ్చింది.

  • Written By:
  • Publish Date - May 31, 2023 / 02:20 PM IST

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి(Balineni) ఇటీవ‌ల న్యూస్ మేక‌ర్ గా మారారు. ఆయన‌కు సీఎంవో ఆఫీస్ నుంచి బుధ‌వారం ఫోన్ వ‌చ్చింది. మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు ప్ర‌కాశం, బాప‌ట్ల జిల్లాల రాజ‌కీయ రివ్యూ పెట్టార‌ని, జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy) స‌మీక్షిస్తార‌ని ఆ ఫోన్ కాల్ సారాంశం. అంతే, ఆయ‌న వెళ‌తారా? రివ్యూ మీటింగ్ కు వెళ్ల‌రా? అనే చ‌ర్చ న‌డిచింది. అయితే, ఆయ‌న తాడేప‌ల్లికి చేరుకుని రివ్యూ మీటింగ్ కు హాజ‌ర‌వుతున్నార‌ని క్యాడ‌ర్ కు క్లారిటీ వ‌చ్చేసింది. ఇక జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేసే స‌మీక్ష‌లో ఏలాంటి ఆదేశాలు జారీ చేయ‌బోతున్నారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి ఇటీవ‌ల న్యూస్ మేక‌ర్(Balineni) 

సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి బంధువు బాలినేని(Balineni). ఆయ‌న మీద ప‌లు ర‌కాల ఆరోప‌ణ‌లు రావ‌డంతో రెండోసారి క్యాబినెట్ మార్పులప్పుడు ప‌క్క‌న పెట్టేశారు. ఆ రోజు నుంచి బాలినేని ప్ర‌త్యామ్నాయం చూసుకుంటున్నార‌ని బ‌లంగా టాక్ న‌డిచింది. దానికి ఫుల్ స్టాప్ పెట్ట‌డానికి తాడేప‌ల్లి హౌస్ లో పంచాయ‌తీ కూడా పెట్టారు. అయిన‌ప్ప‌టికీ బాలినేని పార్టీ  మారే అంశానికి తెర‌ప‌డ‌లేదు. జ‌న‌సేన‌లోకి(Janasena) వెళ‌తారని కొంద‌రు, టీడీపీలో చేర‌తార‌ని మ‌రికొంద‌రు మాట్లాడుకోవ‌డం ఆగ‌లేదు. ఇలాంటి సంద‌ర్భంలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న రాజ‌కీయ రివ్యూ మీటింగ్ కు బాలినేని హాజ‌రవుతున్నారు. అక్క‌డ ఆయ‌న ఇచ్చే సంకేతాల ఆధారంగా భ‌విష్య‌త్ అడుగులు బాలినేని వేస్తార‌ని తెలుస్తోంది.

తెలుగుదేశం పార్టీ, జన‌సేన పొత్తు ఖాయ‌మైతే, బాలినేని

స‌ర్వేల ప్ర‌కారం బాలినేనికి ఒంగోలు(Ongole) నుంచి సీటు ఇస్తే ఓట‌మి ఖాయ‌మ‌ని సారంశం. అదే విష‌యాన్ని ఐ ప్యాక్ టీమ్ చాలా క్లియ‌ర్ గా చెప్పేసింద‌ట‌. అందుకే ఆ టీమ్ మీద కూడా బాలినేని (Balineni)ఆగ్ర‌హంగా ఉన్నార‌ని తెలుస్తోంది. ఒకానొక సంద‌ర్భంలో ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి (Jaganmohan Reddy) త‌న‌కు బ‌దులుగా త‌న స‌తీమ‌ణికి టిక్కెట్ ఇచ్చిన‌ప్ప‌టికీ చేసేదీ ఏమీలేద‌ని వ్యాఖ్యానించారు. కానీ, తాజాగా పార్టీలో జ‌రుగుతోన్న అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల ప్ర‌కారం బాలినేని కుటుంబీకుల‌కు ఈసారి ఒంగోలు టిక్కెట్ ఇవ్వ‌ర‌ని తెలుస్తోంది. ఆయ‌న మీద ఇప్ప‌టికే ప‌లు ఆరోప‌ణ‌లు, అక్ర‌మాల దందా వ్య‌వ‌హారంపై దుమారం రేగుతోంది. ఆ కార‌ణంగా గ్రాఫ్ ప‌డిపోయింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల భావ‌న‌.

Also Read : Jagan Ruling : CBN 6 వ‌జ్రాలు, జ‌గ‌న్ మ‌ర‌చిన‌ 130 హామీలు

తెలుగుదేశం పార్టీ, జన‌సేన పొత్తు ఖాయ‌మైతే, బాలినేని(Balineni) ప్ర‌త్యామ్నాయ నిర్ణ‌యం తీసుకుంటార‌ని క్యాడ‌ర్ లోని చ‌ర్చ‌. ఆ మేర‌కు క్యాడ‌ర్ అభిప్రాయాన్ని కూడా సేక‌రించార‌ని అభిమానుల్లోని టాక్. రెండు ఆప్ష‌న్లు ఆయ‌న ముందు ఉన్న‌ట్టు కూడా వినికిడి. ఒంగోలు ఎంపీగా జ‌న‌సేన త‌ర‌పున పోటీ చేయ‌డం ఒక ఆప్ష‌న్ లేదా టీడీపీ త‌ర‌పున ద‌ర్శి(Darsi) నుంచి పోటీ చేయ‌డం మ‌రో ఆప్ష‌న్ గా ఉంద‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం ఒంగోలు నియోజ‌క‌వ‌ర్గం నుంచి ఎమ్మెల్యే అభ్య‌ర్థిగా టీడీపీ త‌ర‌పున దామ‌చ‌ర్ల జ‌నార్థ‌న్ (Damcharla Janardhan) ఉన్నారు. ఆయ‌న్ను కాద‌ని బాలినేని ఇవ్వ‌డం సాధ్య‌ప‌డ‌దు. అందుకే, పొత్తులో భాగంగా ఒంగోలు ఎంపీగా జ‌న‌సేన నుంచి బాలినేని బ‌రిలోకి దిగ‌డం ఖాయ‌మ‌ని ఆయ‌న కోట‌రీలోని కొంద‌రు టాక్‌. వైసీపీలో ఆయ‌న కొన‌సాగ‌డం మాత్రం క‌ష్ట‌మ‌ని భావించే వాళ్లు ఎక్కువ‌గా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒంగోలు, బాప‌ట్ల రాజ‌కీయ రివ్యూలో జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చే సంకేతాల ఆధారంగా బాలినేని ప‌యనం ఉంటుంద‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చ జ‌రుగుతోంది.

Also Read : YCP Criminal status : YCP నేర‌ చిట్టా విప్పిన CBN! జ‌గ‌న్ జ‌మానాలో 70శాతం పెరిగిన‌ కోర్టు ఖ‌ర్చు!!