Balineni : తాడేప‌ల్లి `మైత్రి`కి బీట‌లు, బాలినేని గుడ్ బై?

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌రీ(Balineni) చెదిరిపోతోంది. ఇటీవ‌ల ఎంపీ సాయిరెడ్డి(saireddy) ట‌చ్ మీ నాట్ అనేలా ఉన్నారు.

  • Written By:
  • Updated On - April 29, 2023 / 03:22 PM IST

ఏపీ సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కోట‌రీ(Balineni) చెదిరిపోతోంది. ఇటీవ‌ల ఎంపీ సాయిరెడ్డి(saireddy) ట‌చ్ మీ నాట్ అనేలా ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి(Balineni) చేరారు. ఆయ‌న జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి అత్యంత స‌మీప బంధువు. పైగా తాడేప‌ల్లి కోటలోకి నేరుగా వెళ్లే స్వ‌తంత్ర్యం ఉన్న లీడ‌ర్. అంత‌టి ప్రాధాన్యం ఉన్న బాలినేని రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి తాజాగా గుడ్ బై చెప్పారు. దాని వెనుక కార‌ణాలు లేక‌పోలేదు.

బాలినేని రీజిన‌ల్ కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి తాజాగా గుడ్ బై (Balineni)

ప‌లు సంద‌ర్బాల్లో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి(Balineni), సీఎం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి పొస‌గ‌లేదు. మంత్రిగా కొన‌సాగిన రోజుల్లో బంగారం స్మ‌గ్లింగ్ కేసులో ఆయ‌న కారు ప‌ట్టుబ‌డింది. అంతేకాదు, దాని వెనుక హ‌వాలా బిజినెస్ జ‌రుగుతోంద‌ని అప్ప‌ట్లో బాలినేని మీద ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ప్ర‌త్య‌ర్థి పార్టీలు కూడా ఆయ‌న చేసే దందాల‌ను, అక్ర‌మ ఆస్తుల వివ‌రాల‌ను క‌ర‌ప‌త్రాల రూపంలో పంచారు. విశాఖ కేంద్రంగా ఆయ‌న వియ్యంకుడు చేసిన భూ దందాలు కూడా తాడేప‌ల్లి కోట‌కు చేరిన‌ట్టు స‌మాచారం. అందుకే, ఆయ‌న్ను క్యాబినెట్ నుంచి త‌ప్పించారని టాక్‌.

మైత్రీమూవీస్ లో  బాలినేని శ్రీనివాస‌రెడ్డి పెట్టుబ‌డులు 

తాజాగా మైత్రీమూవీస్ మీద ఐటీ దాడులు జ‌రిగిన సంద‌ర్భంగా మాజీ మంత్రి బాలినేని(Balineni) పెట్టుబ‌డులు అంశం తెర మీద‌కు వ‌చ్చింది. ఆ విష‌యాన్ని విశాఖ‌ప‌ట్నం చెందిన జ‌న‌సేన కార్పొరేట‌ర్ బ‌య‌ట పెట్టారు. ఆ సంద‌ర్భంగా బాలినేని మీడియా ముందుకొచ్చారు. మైత్రీమూవీస్(mythri movies) బ్యాన‌ర్లో పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టు నిరూపిస్తే రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటాన‌ని స‌వాల్ విసిరారు. అంతేకాదు, ఆరోప‌ణ‌లు చేస్తోన్న జ‌న‌సేన కార్పొరేట‌ర్ మీద చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ కు విజ్ఞ‌ప్తి చేశారు. తెలంగాణ‌కు చెందిన శ్రీనివాస్ యాద‌వ్, బాలినేని శ్రీనివాస‌రెడ్డి పెట్టుబ‌డులు పెద్దఎత్తున మైత్రీమూవీస్ లో ఉన్నాయ‌ని ప్ర‌చారం జ‌రిగింది. ఐదు రోజుల పాటు ఆ కంపెనీ లావాదేవీల‌పై ఐటీ రైడ్స్ చేసింది. ఈ వ్య‌వ‌హారం తాడేప‌ల్లి కోట‌లో పెద్ద చ‌ర్చ‌కు దారితీసింద‌ని తెలుస్తోంది.

తాడేప‌ల్లి కోట మీద అసంతృప్తిగా

క్యాబినెట్ నుంచి త‌ప్పించిన త‌రువాత బాలినేని శ్రీనివాస‌రెడ్డి(Balineni) గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు ప్రోగ్రామ్ కు వెళ్లారు. ఆయ‌న నియోక‌వ‌ర్గంలోని ప్ర‌జ‌లు ప‌లు చోట్ల నిల‌దీశారు. ఆ సంద‌ర్భంగా ఒకానొక స‌య‌యంలో సంయ‌మ‌నం కోల్పోయిన బాలినేని బూతుపురాణం అందుకున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేసింది. ఒకానొక సంద‌ర్భంలో ఈసారి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి మ‌హిళ‌ల‌కు ప్రాధాన్యం ఇస్తార‌ని ప్ర‌క‌టిస్తూ త‌న విష‌యంలోనూ అంతేనంటూ ప‌రోక్షంగా పోటీలో ఉంటానో లేదో అనే సంకేతాలు ఇచ్చారు. ఆయ‌నకు బ‌దులుగా త‌న స‌తీమ‌ణికి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి టిక్కెట్ ఇచ్చినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రంలేద‌ని వ్యాఖ్యానించారు. ఇవన్నీ ఆయ‌న అసంతృప్తిగా ఉన్నార‌ని చెప్ప‌డానికి కొన్ని ఉదాహ‌ర‌ణ‌లుగా చెప్పుకోవ‌చ్చు.

Also Read : Jagan : అవినాష్ రెడ్డికి చెక్, తెర‌పైకి జ‌గ‌న్ మ‌రో బ్ర‌ద‌ర్

ప్ర‌కాశం జిల్లాలోని నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కంలోనూ  బాలినేని(Balineni)  పెత్త‌నం పెద్ద‌గా సాగ‌లేదు. ఒక‌రిద్ద‌రికి ప‌ద‌వులు ఇవ్వొద్దంటూ ఆయ‌న అడ్డుప‌డ‌డం జ‌గ‌న్మోహ‌న్ రెడ్డికి న‌చ్చ‌లేద‌ని తెలుస్తోంది. పైగా వైవీ సుబ్బారెడ్డికి ఆయ‌న‌కు తొలి నుంచి రాజ‌కీయంగా పొస‌గ‌దు. వెరసి బాలినేని శ్రీనివాస‌రెడ్డి గ్రాఫ్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి వ‌ద్ద బాగా త‌గ్గింద‌ని స‌మాచారం. అందుకు నిద‌ర్శ‌నంగా ఇటీవ‌ల మార్కాపురంలో జ‌రిగిన జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి స‌భ సంద‌ర్భంగా బాలినేనికి అవ‌మానం జ‌రిగింది. ఆయ‌న్ను వేదిక మీద‌కు వెళ్ల‌కుండా పోలీసులు అడ్డుకున్నారు. ఆ త‌రువాత స‌ర్దిచెప్పిన‌ప్ప‌టికీ జ‌ర‌గాల్సిన న‌ష్టం ఆయ‌న‌కు జ‌రిగింది. ఇవ‌న్నీ లోప‌ల పెట్టుకున్న బాలినేని ఇటీవ‌ల తాడేప‌ల్లి కోట మీద అసంతృప్తిగా ఉన్నార‌ని స‌ర్వ‌త్రా వినిపిస్తోంది. అందుకే, తాజాగా ప్ర‌కాశం, నెల్లూరు, క‌డ‌ప జిల్లాల కో ఆర్డినేట‌ర్ ప‌ద‌వికి గుడ్ బై చెప్పిన‌ట్టు తెలుస్తోంది. ఫ‌లితంగా జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి(Jaganmohan Reddy) కోట‌రీకి దూరంగా ఉంటోన్న‌ సాయిరెడ్డి జాబితాలోకి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస‌రెడ్డి చేరార‌న్న‌మాట‌.

Also Read : Jagan : జ‌గ‌న్ కు పులిలా క‌నిపిస్తోన్న చంద్ర‌బాబు