Site icon HashtagU Telugu

Balakrishna: రాజకీయాల్లో బాలయ్య బిజీబిజీ.. గెలుపు వ్యూహాలపై గురి!

Balakrishna

Balakrishna123

Balakrishna: తెలుగుదేశం పార్టీకి 2024 ఎన్నికలు అత్యంత కీలకం. గెలుపొందేందుకు ఏ అవకాశాన్ని వదిలిపెట్టడం లేదు. నందమూరి బాలకృష్ణ రాజకీయంగా చురుకుగా మారాడు. బాలకృష్ణ హిందూపురంలో టీడీపీ క్యాడర్‌తో పలు గ్రౌండ్ లెవల్ సమావేశాల్లో పాల్గొంటున్నారు. సత్యసాయి జిల్లాలో నిరంతరం టచ్ లో ఉంటూ స్థానిక కేడర్‌కు అందుబాటులో ఉంటూ వస్తున్నారు. బాలయ్య ఎప్పుడూ ప్రజా నాయకుడే కానీ ఆయన ఎప్పుడూ రూట్ లెవల్ రాజకీయాలలో పాల్గొనలేదు. ఎన్నికల ప్రచారాలు, సమావేశాలకే పరిమితం కాకుండా తన ట్రేడ్‌మార్క్ తో జిల్లాలో తనదైన ముద్ర వేస్తున్నారు బాలయ్య.

బాలయ్య ఇప్పటికే చిలమత్తూరు మండల టీడీపీ నేతలతో సమావేశమై టీడీపీ ఎన్నికల ప్రచారంపై సూచనలు చేశారు. ఇవాళ లేపాక్షి మండల నాయకులతో ఆయన సమావేశమవుతున్నారు. పక్కా ఎన్నికల ప్రణాళికను రూపొందించేందుకు బాలయ్య, టీడీపీ నేతల మధ్య తరచూ సమావేశాలు జరుగుతున్నాయి.

మరోవైపు, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా టీడీపీ కంచుకోట అయిన హిందూపురంని బద్దలు కొట్టి బాలకృష్ణను ఎలాగైనా ఓడించాలని ప్రయత్నిస్తున్నారు. వైసీపీ బాస్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని పంపి హిందూపురంలోని రెబల్ టీడీపీ నేతలను ఆకర్షించే పనిలో ఉన్నారు. కానీ బాలయ్య పరిస్థితి పట్ల అప్రమత్తంగా ఉన్నాడు. 2024 ఎన్నికల ప్రచారంలో బాలయ్యను మనం ఎక్కువగా చూడవచ్చు.