ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ (YCP) తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటోంది. గత ఎన్నికల్లో ఘోర పరాజయం, వరుసగా పార్టీకి ఎదురవుతున్న షాక్‌లు వైసీపీని మరింత కష్టాల్లోకి నెట్టాయి. ఓవైపు ప్రభుత్వం కోల్పోవడం, మరోవైపు నేతల రాజీనామాలు పార్టీకి ఇబ్బందికరంగా మారాయి. ఇప్పటికే ఆళ్ల నాని, అవంతి శ్రీనివాస్, బాలినేని, సామినేని ఉదయభాను, గ్రంధి శ్రీనివాస్ వంటి కీలక నేతలు వైసీపీకి గుడ్‌బై చెప్పారు. ముఖ్యంగా విజయసాయిరెడ్డి రాజీనామా పార్టీకి గట్టి ఎదురుదెబ్బ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
Chiranjeevi Politics : రాజకీయాలకు జోలికి వెళ్ళాను – చిరు ఫుల్ క్లారిటీ
ఈ పరిస్థితుల్లో వైసీపీకి కాస్త ఊరట కలిగించే ప్రకటన చేసారు ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి (Balanagi Reddy). కొంతకాలంగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండడంతో, టీడీపీలోకి వెళ్తున్నారనే ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ వార్తలను ఖండిస్తూ, తాను ఎక్కడికీ వెళ్లడం లేదని స్పష్టంగా ప్రకటించారు. పార్టీ మారే ప్రసక్తే లేదని, వైసీపీకి కట్టుబడి ఉంటానని వెల్లడించడం పార్టీ వర్గాల్లో కొంత ఊరటను కలిగించింది. తన రాజకీయ ప్రయాణం వైఎస్ జగన్‌తోనే కొనసాగుతుందని, పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి స్పష్టం చేశారు. వ్యక్తిగత కారణాల వల్లే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని, అవి ఓవరైపోయిన తర్వాత మళ్లీ యాక్టివ్‌గా పనిచేస్తానని తెలిపారు. ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డిపై తనకున్న గౌరవం కారణంగా ఎప్పటికీ వైసీపీలోనే ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రకటనతో నిరాశలో ఉన్న వైసీపీ నేతలకు కొంత మానసిక ఊరట లభించినట్లైంది. పార్టీకి మరో కీలక నేత గుడ్‌బై చెప్పారనే వార్తలు షికార్లు చేస్తుండగా, బాలనాగిరెడ్డి క్లారిటీ పార్టీకి కొంత ఊపిరి పోసింది.