YS Helicopter Crash: వైఎస్ హెలికాప్ట‌ర్ సీక్రెట్స్! అందుకే `న‌ల్లారి` సీఎం.!!

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు ఉండేవా? అవే ఆయ‌న‌కు సీఎం ప‌ద‌వి వ‌రించ‌డానికి ప‌నికొచ్చాయా? అంటే ఔనేమో! అనే సందేహం క‌లిగేలా హీరో బాల‌క్రిష్ణ నిర్వ‌హిస్తోన్న‌` అన్ స్టాప‌బుల్ ` షోలో కిర‌ణ్ కుమార్ రెడ్డి పాత జ్ఞాప‌కాలు కొన్నింటిని బ‌య‌ట‌పెట్టారు.

  • Written By:
  • Updated On - November 19, 2022 / 03:24 PM IST

స్వ‌ర్గీయ వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి, మాజీ సీఎం కిర‌ణ్ కుమార్ రెడ్డి మ‌ధ్య అభిప్రాయ‌భేదాలు ఉండేవా? అవే ఆయ‌న‌కు సీఎం ప‌ద‌వి వ‌రించ‌డానికి ప‌నికొచ్చాయా? అంటే ఔనేమో! అనే సందేహం క‌లిగేలా హీరో బాల‌క్రిష్ణ నిర్వ‌హిస్తోన్న‌` అన్ స్టాప‌బుల్ ` షోలో కిర‌ణ్ కుమార్ రెడ్డి పాత జ్ఞాప‌కాలు కొన్నింటిని బ‌య‌ట‌పెట్టారు. ఒక మంత్రి కార‌ణంగా త‌న‌కు, వైఎస్ మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డింద‌ని సంచ‌ల‌న విష‌యాన్ని కిర‌ణ్ కుమార్ రెడ్డి బ‌య‌ట‌పెట్టారు. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో వైఎస్ మ‌ర‌ణం త‌రువాత కాంగ్రెస్ పార్టీ రోశ‌య్య‌ను సీఎం చేసిన‌ప్ప‌టికీ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఎదుర్కోవ‌డానికి స‌రైన నాయ‌కునిగా కిర‌ణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం ఎంచుకుంది. అప్ప‌టికే వైఎస్, న‌ల్లారి మ‌ధ్య ఉన్న విభేదాలు అధిష్టానం గ్ర‌హించి ఆయ‌న‌కు సీఎం ప‌ద‌విని అప్ప‌గించిందా? అనే అనుమానం ఇప్పుడు రేకెత్తుతోంది.

వాస్త‌వంగా హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం రోజున వైఎస్ తో న‌ల్లారి కిర‌ణ్ కుమార్ రెడ్డి కూడా వెళ్లాల్సి ఉంద‌ట‌. చివరి నిమిషంలో రద్దయినట్లు `అన్ స్టాప‌బుల్` ప్రోమోలోని కిర‌ణ్ కుమార్ రెడ్డి మాటలను బట్టి తెలుస్తోంది. ఆరోజు వైఎస్ వెంట హెలికాప్టర్ లో వెళ్లాల్సి ఉండగా , తాను వెళ్లకపోవడం వల్లనే బతికిపోయాని, అందుకే సీఎం కాగలిగానని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు ప్రోమోలో ఉన్నాయి. ఆ ప్రోమోలోని మాట‌ల ఆధారంగా వైఎస్, న‌ల్లారి మ‌ధ్య గ్యాప్ ఉంద‌ని అర్థం అవుతోంది. అలాగే, వాళ్లిద్ద‌రి మ‌ధ్య ఒక మంత్రి భేదాభిప్రాయాల‌ను సృష్టించార‌ని చెప్ప‌డంతో ఆ మంత్రి ఎవ‌రో కాదు, ప్ర‌స్తుతం మంత్రిగా ఉన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అనేది స‌ర్వ‌త్రా వినిపిస్తోంది.

Also Read:  Margadarsi Chit: జ‌గ‌న్ కు తండ్రి `మార్గ‌ద‌ర్శి`నం! ఉండ‌వ‌ల్లి సంబరం!!

వైఎస్ క్యాబినెట్లో మంత్రి ప‌ద‌వి రాక‌పోవ‌డానికి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి వేసిన అడ్డుపుల్లేన‌ని ఇప్ప‌టికీ కిరణ్ కుమార్ రెడ్డి విశ్వ‌సిస్తారని ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు. ఆ క‌సి ఇప్ప‌టికీ పెద్దిరెడ్డి మీద ఉన్న‌ట్టు తెలుస్తోంది. దాన్ని తీర్చుకోవ‌డానికి చిత్తూరు జిల్లా రాజ‌కీయాల‌పై మ‌ళ్లీ పైచేయి సాధించాల‌ని కిర‌ణ్ కుమార్ రెడ్డి త‌ప‌న పడుతున్నారు. కానీ, స‌రైన గ్రౌండ్ లేక‌పోవ‌డంతో వేచిచూస్తున్నారు. ప్ర‌స్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్న‌ప్ప‌టికీ ఇప్ప‌ట్లో ఆ పార్టీకి ఏపీలో మ‌నుగ‌డ క‌ష్ట‌మ‌ని ఆయ‌న‌కు తెలుసు. అందుకే, సైలెంట్ గా ఉంటున్నారు. పైగా పీసీసీ అధ్య‌క్ష ప‌ద‌వి ఆశించిన‌ప్ప‌టికీ ఆయ‌న‌కు ఇవ్వ‌డానికి అధిష్టానం యోచిస్తోంది. ఆ క్ర‌మంలో పెద్దిరెడ్డి రాజ‌కీయ స్పీడ్ ను త‌ట్టుకోలేక హైద‌రాబాద్ కు ప‌రిమితం అవుతున్నారు. త‌మ్ముడు న‌ల్లారి కిషోర్ కుమార్ రెడ్డి టీడీపీలో ఉండ‌డం కార‌ణంగా కొద్దోగొప్పో రాజ‌కీయ ఉనికిని న‌ల్లారి కుటుంబం చిత్తూరు జిల్లాలో కాపాడుకునేలా చేసింది.

నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివ‌రి ముఖ్యమంత్రి. ఆ తర్వాత జై సమైక్యాంధ్ర స్థాపించ‌డం ద్వారా 2014 ఎన్నిక‌ల‌కు వెళ్లారు. ఆయ‌న‌తో పాటు ఎవ‌రీ ఆ. పార్టీ త‌ర‌పున పోటీ చేసిన వాళ్ల‌కు డిపాజిట్లు రాలేదు. అప్ప‌టి నుంచి మౌనంగా ఉంటూ ఇటీవ‌ల కాంగ్రెస్ లో చేరిన‌ప్ప‌టికీ యాక్టివ్ గా లేరు. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు కూడా నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి దూరంగా ఉన్నారు. అప్పుడెప్పుడో ఢిల్లీకి వెళ్లి సోనియాతో సమావేశమయినప్పుడు ఆయన యాక్టివ్ అవుతారని భావించినప్పటికీ హైదరాబాద్ కే పరిమితం అయ్యారు.

Also Read:  AP Employees: ఏపీ ఉద్యోగుల కోర్కెల‌కు జ‌గ‌న్ క‌ళ్లెం!

నల్లారి కిరణ్‌ కుమార్ రెడ్డి కుటుంబానికి రాజ‌కీయంగా చంద్ర‌బాబు, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి ప్రధాన శత్రువులున్నార‌ని స‌ర్వ‌త్రా తెలిసిన విష‌య‌మే. పెద్దిరెడ్డి తో వైరం చంద్రబాబుతో కొంత మేర‌ సయోధ్య ఉంద‌ని టాక్‌. ఒక‌ప్పుడు చిత్తూరు జిల్లాలో నల్లారి కుటుంబం రాజ‌కీయాల‌ను శాసించేది. కానీ ఇప్పుడు పెద్దిరెడ్డి కుటుంబం ఆ స్థానాన్ని భ‌ర్తీ చేస్తోంది. పెద్దిరెడ్డిని దెబ్బతీయడానికే తమ్ముడిని టీడీపీలోకి పంపిన‌ప్ప‌టికీ పెద్ద‌గా ఉప‌యోగ‌ప‌డ‌లేద‌ని స్థానికులు అంటుంటారు. జగన్ హ‌యాం వ‌చ్చిన త‌రువాత పెద్దిరెడ్డిని దగ్గరకు తీయడంతో మరింతగా వాళ్లిద్ద‌రి మ‌ధ్యా రాజ‌కీయ పగ పెరిగిందంటారు. అందుకే వచ్చే ఎన్నికలలో పెద్దిరెడ్డిని రాజకీయంగా దెబ్బతీసేందుకు నల్లారి కిరణ్ తెరవెనక నుండైనా కీల‌క పాత్ర పోషిస్తార‌ని ఆయ‌న స‌న్నిహితులు భావిస్తున్నారు.