Site icon HashtagU Telugu

BalaKrishna : పార్లమెంట్ బరిలో బాలయ్య…?

Balakrishna Mp

Balakrishna Mp

రాజకీయం నీ ఫుడ్ లో ఉందేమో.. నాకు బ్లడ్ లోనే ఉందిరా బ్లడీ ఫూల్..నువ్వు భయపడితే భయపడటానికి ఓటర్ ని అనుకున్నావా బే షూటర్ ని కాల్చి పారేస్తా..ఒకడు నాకు ఎదురైనా వాడికే రిస్క్, ఒకడికి నేను ఎదురెళ్లినా వాడికే రిస్క్, తొక్కి పడేస్తా ఇలాంటి డైలాగ్స్ బాలకృష్ణ కు సినిమాల్లోనేకాదు రాజకీయాల్లో కూడా బాగా సెట్ అవుతాయి. ప్రస్తుతం బాలకృష్ణ ఓ వైపు సినిమాలు చేస్తూనే..మరోవైపు రాజకీయాల్లతో రాణిస్తున్నారు. హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే గా ప్రస్తుతం కొనసాగుతున్న బాలకృష్ణ..త్వరలో పార్లమెంట్ బరిలో దిగేందుకు చూస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

మరో మూడు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రాబోతున్నాయి. ఈసారి ఎన్నికల సమరం ఏ రేంజ్ లో ఉంటుందో చెప్పాల్సిన పనిలేదు. గత ఎన్నికల్లో ఘోరఓటమి చవిచూసిన టీడీపీ..ఈసారి ఎలాగైనా గెలిచి తీరాలని చూస్తుంది. దానికి తగ్గట్లే జనసేన తో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగబోతుంది. అంతే కాకుండా జగన్ ను గట్టిగా ఢీ కొట్టేందుకు పక్క ప్రణాళికలతో టీడీపీ ముందుకు వెళ్తుంది. ముఖ్యంగా అభ్యర్థుల విషయంలో ఎక్కడ తగ్గడం లేదు. గెలుపే ధ్యేయంగా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. అదే విధంగా కొంతమంది త్యాగాలు చేయకతప్పదని చెపుతుంది. ఈ క్రమంలో ఈసారి హిందూపురం ఎమ్మెల్యే టికెట్ కు బాలకృష్ణ కు కాకుండా మరొకరికి ఇవ్వాలని చూస్తున్నారు బాబు..ఇదే క్రమంలో బాలకృష్ణ ను పార్లమెంట్ బరిలో దింపాలని చూస్తున్నట్లు తెలుస్తుంది.

We’re now on WhatsApp. Click to Join.

హిందూపురం పార్లమెంట్ నియోజకవర్గం అంటే టీడీపీకి కంచుకోట. అలాంటి కంచుకోట.. 2019 ఎన్నికల్లో కొత్తగా కుల సమీకరణలతో వైసీపీ బద్దలు కొట్టింది. ఈ నియోజకవర్గం పరిధిలో కురుబ సామాజిక వర్గం ఎక్కువ అందుకే.. అదే సామాజిక వర్గానికి చెందిన గోరంట్ల మాధవ్‌ని బరిలో దింపి సక్సెస్‌ అయింది. ఈ ప్రభావం మిగిలిన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలపై కూడా పడింది. ఇప్పుడు అదే క్యాస్ట్‌ ఈక్వేషన్‌ని మరో కోణంలో ఆలోచించి ఈసారి కొత్త అభ్యర్థిని తెర మీదికి తీసుకువచ్చారు జగన్. ఇక్కడ కురుబలతో పాటు బోయ సామాజిక వర్గం కూడా ఎక్కువగా ఉండడం తో…ఈసారి బోయలకు ఛాన్స్ ఇవ్వాలన్న ఉద్దేశంతో శాంతమ్మ ను లైన్లోకి తీసుకొచ్చారు. గతంలో బీజేపీ ఎంపీగా పనిచేసిన ఈమె…ఇప్పుడు వైసీపీ లో చేరి హిందూపురం ఎంపీ బరిలో నిల్చుబోతుంది. టీడీపీ కూడా మొదట కురుబ సామాజిక వర్గానికే ఎంపీ టిక్కెట్‌ ఇవ్వాలని అనుకున్నా.. వైసీపీ వ్యూహం మార్చుకోవడం తో..ఇప్పుడు టీడీపీ కూడా బాలయ్యని బరిలో దింపితే ఆయన ఇమేజ్‌ ముందు ఈ క్యాస్ట్‌ ఈక్వేషన్స్ పెద్దగా పనిచేయవని ఆలోచిస్తుంది. హిందూపురం పార్లమెంటు పరిధిలో టిడిపి బలంగా ఉండటం, బాలకృష్ణ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఇలా రెండు కలిసి వస్తాయని టీడీపీ భావిస్తుంది. అందుకే ఈసారి బాలయ్య ను పార్లమెంట్ లో దింపాలని చూస్తుంది. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన రానుందని వినికిడి.

Read Also : Free Bus Scheme : ఫ్రీ బస్ పథకం ప్రకటించి కాంగ్రెస్ తప్పు చేసిందా..?