టీడీపీ, జనసేన పార్టీల (Janasena-TDP) ఆత్మీయ కలయిక కొత్త శకానికి నాంది అని అన్నారు హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ (Balakrishna) అన్నారు. ఈరోజు గురువారం సత్యసాయి జిల్లా హిందూపురంలో జరిగిన టీడీపీ – జనసేన పార్టీ సమన్వయ కమిటీ (TDP-Janasena Coordination Committee Meeting) సమావేశంలో బాలకృష్ణ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన (Balakrishna) మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌కు నాకు మధ్య సారూప్యత ఉందని, నేను , పవన్ కల్యాణ్ ముక్కుసూటిగా మాట్లాడుతాం అని చెప్పుకొచ్చారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనడానికి నాకు నేనుగా నిర్ణయం తీసుకున్నాను అని తెలిపారు. టీడిపి, జనసేన పార్టీలు కలిసి పోటీ చేయడాన్ని రాష్ట్ర ప్రజలు ఆహ్వానిస్తున్నారని బాలకృష్ణ అన్నారు. వైసీపీ అరాచకపాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీని గద్దెదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
వైసీపీ ప్రభుత్వం (YCP Govt) అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని నందమూరి బాలకృష్ణ సూచించారు. వైసీపీ నాలుగున్నరేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యం అని బాలకృష్ణ అన్నారు. వైసీపీ పాలనలో నేరస్థులు రాజ్యమేలుతున్నారని బాలకృష్ణ ఆరోపించారు. రాష్ట్రంలో అభివృద్ధి శూన్యం అని మండిపడ్డారు. రాష్ట్రంలో పరిపాలన మొత్తం నేరస్తులు, హంతకుల చేతిలో ఉందన్నారు. ప్రజాస్వామ్య సంరక్షణ అందరూ కలిసి పోరాటం చేయాలి.. పరిపాలన ఇష్టరాజ్యంగా సాగుతుంది. రాష్ట్రంలో ఎక్కడా అభివృద్ధి పనులు చేయడం లేదు. ఒక హిందూపురంలో తప్ప అని.. ప్రతిపక్షంలో ఉండే అభివృద్ధి పనులు చేస్తున్నాం అని వెల్లడించారు. ఒక సిమెంట్ రోడ్డు గానీ, ఒక గొయ్యికి తట్టెడు మట్టడు కానీ పోయలేదు, తట్టేడు మట్టికాని తీయలేదని విమర్శించారు. పెయిడ్ ఆర్టిస్టులతో పారిశ్రామిక సదస్సులు నిర్వహించారు. కానీ, రాష్ట్రానికి ఒక పరిశ్రమ రాలేదు అని ఆరోపించారు.
Read Also : Balakrishna : బాలకృష్ణ హిందూపురం పర్యటనలో స్వల్ప ఉద్రిక్తత..