ఇవాళ ఉదయం నుంచి చంద్రబాబు(Chandrababu) అరెస్ట్(Arrest) తో ఏపీ అట్టుడుకుతోంది. ప్రభుత్వంపై తెలుగుదేశం(Telugu Desham) నాయకులు, కార్యకర్తలు విరుచుకుపడుతున్నారు. టీడీపీ(TDP) నాయకులు మీడియా ముందుకు వచ్చి అరెస్ట్ ని ఖండిస్తున్నారు. మిగిలిన ప్రతిపక్షాలు కూడా చంద్రబాబు అరెస్ట్ ని ఖండించాయి. నందమూరి కుటుంబ సభ్యులు కూడా మీడియా ముందుకి వచ్చి చంద్రబాబు అరెస్ట్ పై మాట్లాడారు.
బాలకృష్ణ(Balakrishna) ఉదయం సోషల్ మీడియా ద్వారా స్పందించగా తాజాగా మీడియాతో మాట్లాడారు. బాలకృష్ణ చంద్రబాబు కోసం విజయవాడ వచ్చారు. బేగంపేట విమానాశ్రయంలో, గన్నవరం విమానాశ్రయంలో బాలకృష్ణ మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ ని ఖండించి ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.
బాలకృష్ణ మాట్లాడుతూ.. జగన్ 16 నెలలు జైల్లో ఉండటం వలన కక్ష సాధింపు చర్యలతో చంద్రబాబు నాయుడుని పది నిమిషాలు అయినా సరే జైల్లో పెట్టాలని ఉద్దేశంతో అక్రమ కేసులో పెట్టి అరెస్ట్ చేశారు. చంద్రబాబు నాయుడును ఎలాగైనా జైల్లో పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన పేరు యాడ్ చేసి ఇరికించాలని చూస్తున్నారు. స్కిల్ డెవలప్మెంట్ సంస్థలు ఏర్పాటు చేసి చాలా మంది నిరుద్యోగ యువతకు శిక్షణను కల్పించారు. జగన్ ఏం చేసాడు?
మూడు రాజధానులని మూడు సంవత్సరాలు కాలాన్ని కాలయాపన చేసి గడిపేసాడు. నవరత్నాలు పేరిట 80 వేల కోట్లు అప్పులు చేశాడు. ఎవరు తీరుస్తారు ఆ బకాయిలు.? వనరులు ఎలా ఉత్పత్తి చేయాలో సీఎంకి తెలియదు. అభివృద్ధి అనేది మన రాష్ట్రంలో ఎక్కడ ఉంది? గుంతలు తప్ప అభివృద్ధి శూన్యం ఒక రోడ్డైనా ఎప్పుడైనా వేసిన దాఖలాలు లేవు. నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుపై పార్టీయే కాదు ప్రజలు కూడా ఉద్యమిస్తారు అని ఫైర్ అయ్యారు.
Also Read : Chandrababu Arrest: స్నేహితుడి అరెస్టును ఖండించిన తుమ్మల