Balakrishna Nomination : హిందూపురంలో నామినేష‌న్ వేసిన బాలకృష్ణ

త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఆర్ఓ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు

  • Written By:
  • Publish Date - April 19, 2024 / 04:29 PM IST

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో నామినేషన్ల (Nominations) పర్వం మొదలైంది. నిన్నటి నుండి నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం మొదలుకావడం తో అధికార – ప్రతిపక్ష పార్టీలతో పాటు ఇతర పార్టీల అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు పోటీ పడ్డారు. పార్టీ నేతలు , అభిమానులు , కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీతో వెళ్లి తమ నామినేషన్ కు సంబంధించి దాఖలు చేసారు. తెలంగాణ లో నిన్న ఒక్క రోజే దాదాపు 48 మందికి పైగా అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయగా..ఏపీలో మొత్తం మొదటి రోజు 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

వైసీపీ అభ్యర్థుల కంటే ముందే కూటమి అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయడం విశేషం. ఎవరికీ వారు తమ బలాన్ని చూపించుకుని ప్రయత్నం చేసారు. మంగళగిరి లో టీడీపీ అభ్యర్థి నారా లోకేష్ నామినేషన్ ను కూటమి పార్టీల నేతలు రెండు సెట్లలో దాఖలు చేసారు. ఈ దాఖలు చేసే కార్యక్రమంలో వేలాది మంది పార్టీల కార్యకర్తలు , అభిమానులు పాల్గొన్నారు.

We’re now on WhatsApp. Click to Join.

ఈరోజు కూడా కూటమి పార్టీల అభ్యర్థులు తమ నామినేషన్ లను దాఖలు చేస్తూ వస్తున్నారు. హిందూపురంలో నంద‌మూరి బాల‌కృష్ణ (Balakrishna) నామినేష‌న్ దాఖ‌లు చేశారు. త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌లిసి హిందూపురం ఆర్ఓ కార్యాల‌యంలో రిట‌ర్నింగ్ అధికారికి నామినేష‌న్ ప‌త్రాల‌ను అంద‌జేశారు. అంతకు ముందు బాలకృష్ణ వందలాదిమంది అభిమానులతో మూడు పార్టీల కార్యకర్తలతో నామినేషన్ వేసేందుకు వచ్చారు. ఇప్ప‌టికే బాలకృష్ణ హిందూపురం నుంచి వ‌రుస‌గా రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన విష‌యం తెలిసిందే. ఈసారి కూడా విజ‌యం సాధించి హ్యాట్రిక్ కొట్టాల‌ని చూస్తున్నారు.

ఇక టీడీపీ అధినేత చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి కుప్పంలో నామినేషన్‌ దాఖలు చేశారు. శ్రీకాకళం జిల్లా పాతపట్నం నియోజకవర్గ కూటమి అభ్యర్ధిగా మామిడి గోవిందరావు తన నామినేషన్​ను ఎన్నికల రిటర్నింగ్ అధికారికి అందజేశారు.

Read Also : New Ration Cards : నూతన రేషన్ కార్డులపై మంత్రి పొన్నం కీలక ప్రకటన