Site icon HashtagU Telugu

Balakrishna : బాల‌య్య స‌తీస‌మేతంగా ..`ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం`

Balakrishna

Balakrishna

హిందూపురం నియోజ‌క‌వ‌ర్గానికి బాల‌య్య స‌తీస‌మేతంగా వెళ్లారు. అక్క‌డ సంచార వైద్య‌సేవ‌ల కోసం ఎన్టీఆర్ ఆరోగ్య ర‌థం పేరుతో త‌యారు చేసిన ప్ర‌త్యేక బ‌స్సును ప్రారంభించారు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం చలివెందులను బుధవారం హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గంలోని ఆస్పత్రిలో 30 వెంటిలేటర్లు వాడకుండా మూలన పడేయడాన్ని త‌ప్పుబ‌ట్టారు. ఆసుపత్రికి ఇచ్చిన అనేక పరికరాలు వినియోగించడం లేదని ఆవేదన చెందారు.

రెండేళ్లుగా కరోనా సమయంలో కష్టాల్లో ఉన్న ప్రజలకు టీడీపీ కార్యకర్తలు ఎంతో సేవ చేస్తున్నారని కొనియాడారు. తాము ప్రారంభించిన మొబైల్ వాహనం ద్వారా నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో వైద్యసేవలు అందిస్తామని వెల్ల‌డించారు. ఎన్టీఆర్ ఆరోగ్య రథం ద్వారా ప్రత్యేక వైద్యబృందం వైద్య పరీక్షలు, ఉచిత వైద్యం అందించనుంద‌ని తెలిపారు. వాహనంలో ఒక వైద్యుడు, ఒక నర్సు, ఒక ఫార్మాసిస్ట్, ఆరుగురు వైద్య సిబ్బంది, ఒక మెడిసిన్ కౌంటర్, కంప్యూటర్ ఆపరేటర్‌లు ఉంటారు. సాధారణ వ్యాధులకు చికిత్స, ఉచితంగా మందులు ఇస్తారు. తీవ్ర‌ వ్యాధులున్న రోగుల‌ను