Site icon HashtagU Telugu

Balaiah : వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్.. స్పీచ్ హైలైట్స్ ఇవే!

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు జరిగిన అవమానంపై, హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ స్పందించారు. బాబు కుటుంబంపై, ఎన్టీఆర్ కుటుంబంపై ఇకపై ఎవరూ నోరు తెరిచినా ఉపేక్షించేది లేదని అన్నారు. మంచి సలహాలు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో లేదీ వైసీపీ ప్రభుత్వం లేదని అన్నారు. ప్రజా సమస్యలపై చర్చ జరగాల్సిన అసెంబ్లీలో వ్యక్తిగత విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. భువనేశ్వరిపై నిన్న అభ్యంతరకర, అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ చంద్రబాబు ఘొల్లున విలపించిన సంగతి తెలిసిందే. దీనిపై నందమూరి బాలకృష్ణ, నందమూరి కుటుంబం ఇవాళ మీడియా ముందుకు వచ్చారు. అధికార పార్టీ నేతల తీరుపై మండిపడ్డారు.

మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం

మంగళగిరిలో పార్టీ కార్యాలయంపై దాడి చేయించారు

చంద్రబాబుపై ఎన్నోవిధాలుగా దాడులకు ప్రయత్నించినా ఆయన సంయమనంతో ఉన్నారు

ఆడవాళ్లను తెరపైకి తెచ్చి రాజకీయాల్లో మైండ్‌గేమ్‌ ఆడుతున్నారు

రాజకీయాల్లో అధికారం ఎప్పుడూ శాశ్వతం కాదు

ఎంతో ధైర్యంగా ఉండే చంద్రబాబు కంటతడిపెట్టుకోవటం ఎప్పుడూ లేదు

అసెంబ్లీలో సవాళ్లు, ప్రతిసవాళ్లు ఆనవాయితే.. ప్రజాసమస్యలపై పోరాడటమే అసెంబ్లీ వేదికగా ఉండేది

వైకాపా నుంచి మహిళా శాసనసభ్యులు సభలో ఉన్నారు

అసెంబ్లీలో ఉన్నామో… పశువుల కొంపలో ఉన్నామో అర్థం కాలేదు

అందరి కుటుంబాల్లో ఆడవాళ్లు ఉన్నారు… హేళన చేయవద్దు

కొత్త నీచ సంస్కృతికి తెరలేపారు.. ఆ పార్టీలోనూ బాధపడే వారున్నారు

Exit mobile version