Site icon HashtagU Telugu

Balakrishna Counter to Kodali Nani : నువ్వేం పీక్కొని గెడ్డం పెట్టుకుంటావ్.. కొడాలి నానికి బాలయ్య కౌంటర్

Balakrishna Nani

Balakrishna Nani

నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినిమాల్లోనే కాదు బయట కూడా మాస్ డైలాగ్స్ పేలుస్తుంటాడు. ప్రస్తుతం ఈయన నటించిన భగవత్ కేసరి (Bhagavanth Kesari) మూవీ దసరా కానుకగా ఈ నెల 19 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అనిల్ రావిపూడి (Anil Ravipudi) డైరెక్షన్లో కాజల్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ లో శ్రీ లీల (Sreeleela) ప్రధాన పాత్ర పోషించింది. ఇప్పటికే ఈ చిత్రం తాలూకా ట్రైలర్ , సాంగ్స్ సినిమా ఫై ఆసక్తి పెంచగా..తాజాగా హైదరాబాద్‌లో జరిగిన మూవీ ప్రెస్ మీట్ లో సినిమా గురించి మాట్లాడుతూ ఆ ఫ్లోలో పొలిటికల్ కౌంటర్ ఇచ్చేశారు బాలయ్య.

We’re now on WhatsApp. Click to Join.

‘బాలకృష్ణ అనేవాడు ఎవడిదో బొచ్చు పైన పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు’ అని ఆ మధ్య గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని (YCP MLA Kodali Nani) కామెంట్ చేశారు. ఆ కామెంట్‌కు బాలకృష్ణ కౌంటర్ ఇచ్చారు. అయితే, కొడాలి నాని పేరు ప్రస్తావించకుండా కౌంటర్ ఇచ్చాడు. ‘రాంప్రసాద్ అద్భుతమైన కెమెరామేన్. నా ప్రతి కథలిక ఆయనకు తెలుసు. వీఎస్ఆర్ స్వామి గారి దగ్గర ఈయన అసిస్టెంట్‌గా ఉన్నప్పటి నుంచీ మేమంతా కలిసి ఉండేవాళ్లం.. కలిసి భోజనం చేసేవాళ్లం. ఆ రోజుల్లో ఇప్పటిలా క్యారావ్యాన్‌లు లేవు కదా. హ్యాపీగా చెట్ల కింద కూర్చొని కింద ఒక చాప, దిండు వేసుకుని పడుకునేవాళ్లం. విగ్గు తీసి పక్కన పెట్టేవాడిని. మొన్న ఎవడో అన్నాడు.. ఎవడో ఎదవ.. వీడు విగ్గు పెట్టుకుంటాడా అని. అవునయ్యా విగ్గు పెట్టుకుంటా నీకేంటి.. నువ్వేం పీక్కొని గెడ్డం పెట్టుకుంటావ్ అని అడిగా. మనదంతా ఓపెన్ బుక్. ఎవడికి భయపడే పనేలేదు. వాడికి చెప్తున్నా.. మళ్లీ వాగాడంటే’ అంటూ నవ్వుతూ టాపిక్ డైవర్ట్ చేశారు బాలయ్య.

ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి. దీనిని టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ కొడాలి నాని కి కౌంటర్లు ఇస్తున్నారు.

Read Also : CM Jagan Live: విశాఖలో ఇన్ఫోసిస్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం జగన్