స్కిల్ డెవలప్మెంట్ కేసు(Skill Development Case)లో అరెస్టయిన చంద్రబాబు(Chandrababu Naidu )ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక చంద్రబాబు అరెస్టుపై ఏపీలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ప్రతిపక్ష నాయకులంతా చంద్రబాబు అరెస్టుని ఖండిస్తున్నారు. జాతీయ నేతలు కూడా చంద్రబాబుకి మద్దతు తెలుపుతున్నారు.
ఇక చంద్రబాబుని కలవడానికి అయన కుటుంబంతో పాటు పలువురు పార్టీ నాయకులు కూడా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే నారా లోకేష్, నారా భువనేశ్వరి, బ్రాహ్మణి.. చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలిశారు. అనంతరం భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతూ ఎమోషనల్ కూడా అయ్యారు. ఇక నేడు చంద్రబాబుని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలవనున్నారు. పవన్ కళ్యాణ్ తో పాటు బాలకృష్ణ కూడా చంద్రబాబుని రాజమండ్రి సెంట్రల్ జైలులో కలవనున్నారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయాల్లో ఆసక్తిగా మారింది.
నేడు గురువారం మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), బాలకృష్ణ(Balakrishna) భేటీ అవ్వనున్నారు. వీరితో పాటు నారా లోకేష్(Nara Lokesh) కూడా వెళ్లనున్నట్టు సమాచారం. మంగళగిరిలో ఉన్న పవన్ కళ్యాణ్ డైరెక్ట్ రాజమండ్రికి గన్నవరం నుంచి విమానంలో వెళ్తారు. హైదరాబాద్ లో ఉన్న బాలకృష్ణ కూడా ప్రత్యేక విమానంలో రాజమండ్రి వెళ్లి అక్కడ టీడీపీ నాయకులని కలిసి అనంతరం చంద్రబాబుని కలవడానికి వెళ్లనున్నారు.
ఒకేసారి బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ కలిసి చంద్రబాబుని కలవవడానికి వెళ్తుండటంతో రాజకీయాల్లోనే కాక రెండు తెలుగు రాష్ట్రాల్లో, సినీ పరిశ్రమలో కూడా వీరి భేటీపై ఆసక్తి నెలకొంది. అలాగే ఈ ములాఖత్ లో దేనిపై మాట్లాడుకుంటారు అనేది కూడా చర్చగా మారింది. బాలకృష్ణ పార్టీని నడిపించాలా, పవన్ ఏ విషయాల్లో బాబుకి మద్దతు ఇవ్వాలి, బాబుని ఎలా బయటకు తీసుకురావాలి, బాబుపై వస్తున్న ఆరోపణలను ఎలా ఎదుర్కోవాలి, జనసేన టీడీపీకి ఎలా మద్దతు ఇవ్వాలి అనే అంశాలు వీరి భేటీలో చర్చకు రానున్నట్టు తెలుస్తుంది.
Also Read : IT Employees : చంద్రబాబు జైల్లో ఉన్నప్పుడు కూడా మీము బయటకు రాకపోతే మేము వేస్ట్ – టెకీలు