అప్పుడు స్వర్గీయ నందమూరి తారకరామారావు (NTR) కు ఎలాగైతే వెన్నుపోటు (Vennupotu) పొడిచారో..ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు అలాగే చంద్రబాబు (Chandrababu) వెన్నుపోటు పొడిచారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మొన్నటి వరకు జగన్ ఫై యుద్ధం చేస్తానని పలికిన పవన్..ఈరోజు 24 స్థానాలతో ఎలా యుద్ధం చేస్తావని ప్రశ్నిస్తున్నారు. జనసేన – టీడీపీ ఉమ్మడి జాబితా ప్రకటించిన దగ్గరి నుండి వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు జనసేన కు ఎన్ని స్థానాలు ఇస్తారో..ఎలాంటి వ్యూహం రచ్చించాలో అని జగన్ & కో భావించారు. కానీ ఇప్పుడు జస్ట్ ముష్టి వేసినట్లు పవన్ కు 24 సీట్లు ఇవ్వడం తో జగన్ బ్యాచ్ అంత సంబరాలు చేసుకుంటున్నారు. ఈ 24 కోసమా..పవన్ బాబు దగ్గర లొగింది అంటూ సెటైర్లు వేస్తున్నారు.
వైసీపీ మంత్రులు , మాజీ మంత్రులంతా కూడా పవన్ కళ్యాణ్ పరువు తీస్తున్నారు. పల్లకి మోయడానికి తప్ప పావలా వంతుకు కూడా పనికిరావని తేల్చేసారు…. ఛీ అంటూ పవన్ ఫై మంత్రి అంబటి రాయుడు విమర్శలు కురిపించారు. చంద్రబాబు పల్లకీ మోసే బదులు పార్టీని విలీనం చేయొచ్చు కదా..అని ఉచిత సలహా ఇచ్చారు. చంద్రబాబును జైళ్లో పెట్టిన రోజునే పవన్ ఎగేసుకుంటూ వెళ్లి మేం పొత్తులో వెళ్తున్నాం అని చెప్పాడు. అమాయకులైన కాపు సోదరులు, జనసేన కార్యకర్తలు ఇక మా పవన్ కల్యాణ్ తప్పనిసరిగా ముఖ్యమంత్రి అవుతాడని భావించారు. నాకు సీఎం ఏమన్నా కొత్తా అని చంద్రబాబు అంటే ఇక పవన్ కల్యాణే సీఎం అనుకున్నారు అమాయకులు. 60–70 సీట్లన్నారు..పవన్ మేం మూడో భాగంతో పోటీ చేస్తాం అని అట్టహాసంగా ప్రకటించాడు. గ్యారెంటీగా 70 అనుకుంటే చివరికి 24 అసెంబ్లీ, 3 పార్లమెంటు స్థానాలు తీసుకొచ్చాడు. నాకు కాస్త తిక్కుంది..దానికో లెక్కుంది అంటాడుగా..ఇదీ ఆయన లెక్క… నీకు తిక్క ఉండొచ్చు..ఆ తిక్కతో నీకు తప్పుడు లెక్క ఉండొచ్చు…కానీ జనసైనికులకు ఒకటే తిక్క..నువ్వు సీఎం కావాలనేదే వారి తిక్క..ఆ తిక్కను ఈ రోజు నువ్వు దించేశావ్..అని అంబటి సెటైర్లు వేశారు.
We’re now on WhatsApp. Click to Join.
పావలా శాతం సీట్లు తెచ్చుకోలేని పవర్ లెస్ స్టార్ పవన్!అంటూ మంత్రి ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ‘24 సీట్లకే పవన్ ఎందుకు తల ఊపారో చెప్పాలి. ఏ ప్యాకేజీ కోసం 24 సీట్లకు తల వంచారో పవన్ చెప్పాలి. పవర్ స్టార్.. పవర్‌లేని స్టార్ అయ్యారు. ఎవరితో పొత్తుపెట్టుకోవాలో తెలియని గందరగోళం వారిది. పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలో తెలియని దుస్థితి అని రోజా ఎద్దేవా చేసారు. తుప్పు పట్టిన సైకిల్, పగిలిపోయిన గ్లాసులకు గోల్డ్ కవరింగ్ ఇస్తూ.. తాము బలంగా ఉన్నామన్న భ్రమలో జనసేన, టీడీపీ పార్టీలు ఉన్నాయని ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. జనసేన 24 కాదు ..4 స్థానాల్లో కూడా గెలవదని జోస్యం చెప్పారు మాజీ మంత్రి అనిల్ కుమార్.
జనసేన అభ్యర్థులను కూడా చంద్రబాబు డిసైడ్ చేస్తారా? అని వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో చంద్రబాబు పడేసే సీట్లు తీసుకునే స్థితికి పవన్ దిగజారిపోయారని హాట్ కామెంట్స్ చేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ మరోసారి రాజకీయాల్లో పనికి రాడని మరోసారి రుజువు చేసాడని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
Read Also : Janasena : పవన్ కళ్యాణ్ ఫై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న జనసేన శ్రేణులు..