Site icon HashtagU Telugu

AP : పోలింగ్‌ రోజున మీరు వేసే ఓటుకు జగన్ ప్యాలెస్ బద్ధలుకావాలి – చంద్రబాబు

Bau Elur

Bau Elur

ఏపీలో ఎన్నికల ప్రచారానికి ముగింపు పలికే సమయం దగ్గరికి వచ్చింది. మరికొద్ది గంటల్లో మైకులన్నీ మూగబోనున్నాయి. రెండు నెలలుగా దద్దరిల్లేలా మోత మోగించిన మైకులు , డీజేలు రేపు సాయంత్రం తర్వాత సైలెంట్ కానున్నాయి. ఈ తరుణంలో ఉన్న ఈ కొద్దీ సమయాన్ని నేతలు గట్టిగా వాడుకోవాలని చూస్తున్నారు..ఆఖరి పంచ్ అదిరిపోయేలా ఉండాలని పార్టీల అధినేతలు ప్రత్యర్థి పార్టీల ఫై మరింత విమర్శలతో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబు , పవన్ కళ్యాణ్ లు వైసీపీ ఫై విరుచుకుపడుతూ వస్తున్నారు. ఈరోజు ఏలూరులో జరిగిన ప్రజాగళం బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడుతూ… పోలింగ్‌ రోజున వేసే ఓటుకు తాడేపల్లి ప్యాలెస్‌ బద్ధలుకావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

We’re now on WhatsApp. Click to Join.

వైసీపీ ప్రభుత్వ అవినీతి, దోపిడీకి ముగింపు పలకాలని , జగన్‌ అహంకారి, సైకో, విధ్వంసకారుడని విమర్శించారు. జగన్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రాన్ని గంజాయి మయం చేశారని, Land Titling Act పేరుతో మీ భూములు కబ్జా చేయాలనీ చూస్తున్నారని ఆరోపించారు. అసలు మీ భూమి పత్రంపై జగన్ ఫొటో ఎందుకని ప్రశ్నించారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం లోపభూయిష్టంగా ఉందని చంద్రబాబు అన్నారు. కూటమి అధికారంలోకి రాగానే పోలీసులకు రద్దయిన అలవెన్సులన్నీ ఇస్తామని, హోంగార్డుల జీతాలు రూ.18 వేల నుంచి రూ.25 వేలకు పెంచుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్ర భవిష్యత్తు మార్చుకునేందుకు ఇంకా 3 రోజులే ఉందని చంద్రబాబు అన్నారు. అత్యధిక మెజారిటీతో కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

Read Also : PM Modi : ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. ఏంచెపుతాడో…!!